31 జన, 2014

454. జ్ఞానముత్తమమ్‌, ज्ञानमुत्तमम्‌, Jñānamuttamam

ఓం జ్ఞానముత్తమాయ నమః | ॐ ज्ञानमुत्तमाय नमः | OM Jñānamuttamāya namaḥ


జ్ఞానముత్తమ మిత్యేతన్నామైకం సవిశేషణమ్ ।
జ్ఞానం ప్రకృష్టమజన్యమనవచ్ఛిన్నమేవ చ ॥
సర్వస్య సాధకతమం బ్రహ్మైవ జ్ఞానముత్తమమ్ ।
సత్యం జ్ఞానమనంతమిత్యాది శ్రుతి సమీరణాత్ ॥

ఉత్తమమగు జ్ఞానము అను సవిశేషణము అగు ఒకే నామము. ఉత్తమము అనగా జనించునది కానిదీ, స్వభావసిద్ధమూ, అనవచ్ఛిన్నమూ, అవధులు లేనిదీ, ప్రతీ ఒక్కరికి పరమాత్మ సాక్షాత్కార రూప సిద్ధి విషయమున అత్యంత సాధకము అయిన ప్రకృష్టమూ, చాలా గొప్పది అగు జ్ఞానము అని అర్థము. అట్టి నిర్మల జ్ఞానము పరమాత్మ స్వరూపమే! 'సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ' (తైత్తిరీయోపనిషత్ - 2.1) 'బ్రహ్మ తత్త్వము అసత్యము కానిదీ, జడము కానిదీ, అంతము లేనిది అయిన అనవధిక నిత్య జ్ఞాన చక్రము' అను శ్రుతి వచనము ఇచ్చట ప్రమాణము.



Jñānamuttama mityetannāmaikaṃ saviśeṣaṇam,
Jñānaṃ prakr̥ṣṭamajanyamanavacchinnameva ca.
Sarvasya sādhakatamaṃ brahmaiva jñānamuttamam,
Satyaṃ jñānamanaṃtamityādi śruti samīraṇāt.

ज्ञानमुत्तम मित्येतन्नामैकं सविशेषणम् ।
ज्ञानं प्रकृष्टमजन्यमनवच्छिन्नमेव च ॥
सर्वस्य साधकतमं ब्रह्मैव ज्ञानमुत्तमम् ।
सत्यं ज्ञानमनंतमित्यादि श्रुति समीरणात् ॥

This is a Name with an adjective. He is jñāna or knowledge that is the most superior, produced by no one because it has been ever existent, unlimited and which is most efficacious for all. That uttama jñāna is Brahma vide the śruti 'Satyaṃ jñāna manantaṃ brahma / सत्यं ज्ञान मनन्तं ब्रह्म' (Taittirīyopaniṣat - 2.1) Brahman is Truth, Knowledge, and Infinite.

यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः ।
सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥

Yajña ijyo mahejyaśca kratussatraṃ satāṃ gatiḥ ।
Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి