6 జన, 2014

429. బీజమవ్యయమ్, बीजमव्ययम्, Bījamavyayam

ఓం బీజమవ్యయాయ నమః | ॐ बीजमव्ययाय नमः | OM Bījamavyayāya namaḥ


తదేవ చాన్యథాభావ వ్యతిరేకేణ కారణమ్ ।
బీజమవ్యయమిత్యుక్తం నామైకం సవిశేషణమ్ ॥

న వ్యేతి అను వ్యుత్పత్తిచే ఏ మార్పును లేనిది 'అవ్యయమ్‍' అనబడును. కారణభూతముగానుండు తత్త్వము 'బీజం' అనబడును. అన్యథాభావవ్యతిరేకము అనగా ఒక విధముగా మొదటనున్నది మరియొక విధముగా అగు స్థితి లేకపోవుటతో పాటుగా సర్వకారణకారణము అగువాడు అని అర్థము. 'బీజమ్‍' విశేష్యముకాగా 'అవ్యయం' విశేషణము కాగా ఈ రెండు శబ్దములును కలిసి 'సవిశేషణము అగు ఏకనామము.'

:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥


పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.



Tadeva cānyathābhāva vyatirekeṇa kāraṇam,
Bījamavyayamityuktaṃ nāmaikaṃ saviśeṣaṇam.

तदेव चान्यथाभाव व्यतिरेकेण कारणम् ।
बीजमव्ययमित्युक्तं नामैकं सविशेषणम् ॥

Bījam is cause. Avyayam is not changing or immutable. Both the names combined mean the One who is the seed or cause of the Saṃsāra without Himself undergoing any change. This is a name with an adjective.

Śrīmad Bhagavad Gīta - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam. 18.

:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योग ::
गतिर्भर्ता प्रभुस्साक्षी निवासश्शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥ १८ ॥ 

I am the fruit of actions, the nourisher, the Lord, witness, abode, refuge, friend, origin, end, foundation, store and the imperishable seed.

विस्तारः स्थावरस्स्थाणुः प्रमाणं बीजमव्ययम्
अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥ ४६ ॥

విస్తారః స్థావరస్స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬ ॥

Vistāraḥ sthāvarassthāṇuḥ pramāṇaṃ bījamavyayam
Artho’nartho mahākośo mahābhogo mahādhanaḥ ॥ 46 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి