ఓం విముక్తాఽఽత్మనే నమః | ॐ विमुक्ताऽऽत्मने नमः | OM Vimuktā’’tmane namaḥ
స్వభావేనైవ విముక్తో యస్యాత్మా స్వయమేవ వా ।
విముక్తోఽసావితి హరిర్విముక్తాత్మేతి కథ్యతే ॥
కఠనామోపనిషది విముక్తశ్చ విముచ్యతే ।
ఇతి శ్రుతేర్మహావిష్ణుః పరమాత్మా సనాతనః ॥
ఏ సాధనముతో పనిలేకయే ముక్తినందినది అగు ఆత్మ ఎవనిదియో అట్టివాడు. ఇట్లు చెప్పుటచే అతనికి ఒక ఆత్మ అన్ని ప్రాణులకునువలె ఉన్నదని, ఆతడును మన అందరివలె ఒక ప్రాణియే అనియూ అర్థము వచ్చుచున్నందున, శాస్త్ర విరుద్ధమైన ఈ దోషమును పరిహరించ వలయునని మరియొక విధముగా అర్థము ఇట్లు చెప్పవచ్చును.
జీవులలోని ఆత్మ వస్తుతత్త్వమున విముక్తమే. బంధములు లేనిది. అయిననూ అజ్ఞానవశమున బంధములలో తానున్నదనుకొనుచు గురు, పరమేశ్వర అనుగ్రహమున అది తొలగి విముక్తుడగుచున్నాడు.
ఈ అర్థమున 'విముక్తశ్చ విముచ్యతే' (కఠోపనిషత్ 2-5-1) 'బంధములో ఉన్నాడను భ్రాంతి కలిగి దానిని వదిలించుకొని విముక్తుడగుచున్నాడు' అను శ్రుతి వచనము ఇచట ప్రమాణము.
Svabhāvenaiva vimukto yasyātmā svayameva vā,
Vimukto’sāviti harirvimuktātmeti kathyate.
Kaṭhanāmopaniṣadi vimuktaśca vimucyate,
Iti śrutermahāviṣṇuḥ paramātmā sanātanaḥ.
स्वभावेनैव विमुक्तो यस्यात्मा स्वयमेव वा ।
विमुक्तोऽसाविति हरिर्विमुक्तात्मेति कथ्यते ॥
कठनामोपनिषदि विमुक्तश्च विमुच्यते ।
इति श्रुतेर्महाविष्णुः परमात्मा सनातनः ॥
One who is naturally free. But this definition leads to a misinterpretation that even He is with a soul as like all of us. But since this is misleading, the interpretation needs to be looked at correctly as below.
The soul in all the beings is in reality without bonds. However, because of the illusion that is it bonded, seeking guidance from a capable teacher and by the mercy of Lord, it breaks free from this illusion and realizes its true free state.
The verses from Kaṭhopaniṣat (2.5.1) support this as 'Vimuktaśca vimucyate' meaning 'getting rid of the bonds, being naturally free, it becomes free'
यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः । |
सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥ |
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః । |
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥ |
Yajña ijyo mahejyaśca kratussatraṃ satāṃ gatiḥ । |
Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి