30 జూన్, 2014

604. శ్రీమతాం వరః, श्रीमतां वरः, Śrīmatāṃ Varaḥ

ఓం శ్రీమతాం వరాయ నమః | ॐ श्रीमतां वराय नमः | OM Śrīmatāṃ varāya namaḥ

శ్రీమతాం వరః, श्रीमतां वरः, Śrīmatāṃ Varaḥ

బ్రహ్మాదీనాం సమస్తానామ్ ఋగ్యజుస్సామలక్షణా ।
యేషాం శ్రీరస్తి తేషాం చ ప్రధానః శ్రీమతాం వరః ॥
ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ ।
ఇతి శ్రుతేర్మహావిష్ణుః శ్రీమతాం వర ఉచ్యతే ॥

ఋక్‍, యజుర్‍, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి శ్రీగల బ్రహ్మ మొదలగువారు శ్రీమంతులు. అట్టి శ్రీమంతులలో శ్రేష్ఠుడు 'శ్రీమతాంవరః'. ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ (తైత్తిరీయ బ్రాహ్మణము 1.1.1) - 'ఋక్కులు, యజుస్సులు, సామములు - ఈ త్రివిధ రూపము గల విద్యయే 'సత్‍'జనులకు ఉండు శ్రీ. అది అమృతతుల్యమౌ శాశ్వతమగు శ్రీ.' అను శ్రుతి వచనము ఈ విషయమున ప్రమాణము.

ब्रह्मादीनां समस्तानाम् ऋग्यजुस्सामलक्षणा ।
येषां श्रीरस्ति तेषां च प्रधानः श्रीमतां वरः ॥
ऋचस्सामानि यजूग्‍ंषि सा हि श्री रमृता सताम् ।
इति श्रुतेर्महाविष्णुः श्रीमतां वर उच्यते ॥

Brahmādīnāṃ samastānām r̥gyajussāmalakṣaṇā,
Yeṣāṃ śrīrasti teṣāṃ ca pradhānaḥ śrīmatāṃ varaḥ.
R̥cassāmāni yajūgˈṃṣi sā hi śrī ramr̥tā satām,
Iti śrutermahāviṣṇuḥ śrīmatāṃ vara ucyate.

R̥k, Yajur and Sāma are the Śrīḥ of those who possess it like Brahma and others who are hence called Śrīmantaḥ. Since Lord Hari is the best amongst such, He is called Śrīmatāṃ Varaḥ.

ऋचस्सामानि यजूग्‍ंषि सा हि श्री रमृता सताम् / R̥cassāmāni yajūgˈṃṣi sā hi śrī ramr̥tā satām (तैत्तिरीय ब्राह्मण १.१.१/Taittirīya brāhmaṇa 1.1.1) - R̥k, Yajur and Sāma are the Śrī of the good - making for immortality.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

29 జూన్, 2014

603. శ్రీపతిః, श्रीपतिः, Śrīpatiḥ

ఓం శ్రీపతయే నమః | ॐ श्रीपतये नमः | OM Śrīpataye namaḥ

శ్రీపతిః, श्रीपतिः, Śrīpatiḥ

అమృతమథనే సర్వాన్ త్రిదివేశాన్ శ్రియః ।
విహాయ శ్రీః పతిత్వేన వరయామాస యం హరిమ్ ॥
స శ్రీపతిరితి ప్రోక్తః పరాశక్తేరుత శ్రియః ।
పతిరితి వా శ్రీపతిరితి స ప్రోచ్యతే బుధైః ।
పరాఽస్య శక్తిర్విధైవేతిశ్రుతిసమీరణాత్ ॥

లక్ష్మికి పతి. అమృత మథనమునందు సురాసురాదులను అందరను కాదని శ్రీ ఈతనిని తన పతిగా వరించెను. లేదా 'శ్రీ' అనగా పరాశక్తి. ఆమెకు పతి శ్రీ విష్ణువు.

:: శ్వేతాశ్వతరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::
న తస్య కార్యం కరణఞ్చ విద్యతే న తత్సమ శ్చాభ్యధికశ్చదృశ్యతే ।
పరాఽస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా చ ॥ 8 ॥

ఆ పరమేశ్వరునకు శరీరము, ఇంద్రియ సమూహములు లేవు. ఆ దేవునకు సముడుగానీ, అధికుడుగానీ కనిపించుటలేదు. ఆ పరమేశ్వరునికి పరాశక్తి నానా విధములుగా ఉన్నదని వేదములు ప్రతిపాదించుచున్నవి. ఆ దేవుని పరాశక్తి స్వభావసిద్ధమయినది. జ్ఞాన క్రియా బలములు గలది.

अमृतमथने सर्वान् त्रिदिवेशान् श्रियः ।
विहाय श्रीः पतित्वेन वरयामास यं हरिम् ॥
स श्रीपतिरिति प्रोक्तः पराशक्तेरुत श्रियः ।
पतिरिति वा श्रीपतिरिति स प्रोच्यते बुधैः ।
पराऽस्य शक्तिर्विधैवेतिश्रुतिसमीरणात् ॥

Amr̥tamathane sarvān tridiveśān śriyaḥ,
Vihāya śrīḥ patitvena varayāmāsa yaṃ harim.
Sa śrīpatiriti proktaḥ parāśakteruta śriyaḥ,
Patiriti vā śrīpatiriti sa procyate budhaiḥ,
Parā’sya śaktirvidhaivetiśrutisamīraṇāt.

The husband of Śrī. At the time of churning the ocean, rejecting the devās and asurās, Śrī i.e., goddess Lakṣmi chose Him for Her husband. Or 'Śrīḥ' may mean parā śakti. Since Lord Viṣṇu is Her husband, He is Śrīpatiḥ.

:: श्वेताश्वतरोपनिषत् षष्ठोऽध्यायः ::
न तस्य कार्यं करणञ्च विद्यते न तत्सम श्चाभ्यधिकश्चदृश्यते ।
पराऽस्य शक्तिर्विविधैव श्रूयते स्वाभाविकी ज्ञानबल क्रिया च ॥ ८ ॥

Śvetāśvataropaniṣat - Chapter 6
Na tasya kāryaṃ karaṇañca vidyate na tatsama ścābhyadhikaścadr̥śyate,
Parā’sya śaktirvividhaiva śrūyate svābhāvikī jñānabala kriyā ca. 8.

He is without a body or organs; none like unto Him is seen, or better than He. The Vedas speak of parā śakti i.e., His exalted power, which is innate and capable of producing diverse effects and also of His omniscience and might.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

28 జూన్, 2014

602. శ్రీవాసః, श्रीवासः, Śrīvāsaḥ

ఓం శ్రీవాసాయ నమః | ॐ श्रीवासाय नमः | OM Śrīvāsāya namaḥ

శ్రీవాసః, श्रीवासः, Śrīvāsaḥ

వక్షస్యస్య భగవతో విష్ణోః శ్రీరనసాయినీ ।
వసతీతి బుధైరేష శ్రీవాస ఇతి కథ్యతే ॥

లక్ష్మికి నివాసము అగువాడు. ఈతని వక్షమునందు ఎన్నడును విడువనిదగుచు శ్రీ ఉన్నదిగనుక ఆ విష్ణుదేవునకు శ్రీవాసః అను నామము.

वक्षस्यस्य भगवतो विष्णोः श्रीरनसायिनी ।
वसतीति बुधैरेष श्रीवास इति कथ्यते ॥

Vakṣasyasya bhagavato viṣṇoḥ śrīranasāyinī,
Vasatīti budhaireṣa śrīvāsa iti kathyate.

He in whom Śrī i.e., goddess Lakṣmi resides; who is permanent abode of goddess Lakṣmi. Since Lakṣmi resides in His chest forever without separation, Lord Viṣṇu is called Śrīvāsaḥ.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

27 జూన్, 2014

601. శ్రీవత్సవక్షాః, श्रीवत्सवक्षाः, Śrīvatsavakṣāḥ

ఓం శ్రీవత్సవక్షే నమః | ॐ श्रीवत्सवक्षे नमः | OM Śrīvatsavakṣe namaḥ

శ్రీవత్సవక్షాః, श्रीवत्सवक्षाः, Śrīvatsavakṣāḥ

చిహ్నం శ్రీవత్ససఙ్జ్ఞం హి వక్షస్యస్య స్థితం హరేః ।
ఇతి శ్రీవత్సవక్షా ఇత్యుచ్యతే విదుషం వరైః ॥

శ్రీవత్సము అను సంజ్ఞ కల చిహ్నము ఈతని వక్షమునందు కలదుగనుక హరికి శ్రీవత్సవక్షాః అను నామముగలదు.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
వ. మఱియు న ద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుండును, బిశంగవర్ణవస్త్రుండును, మకర కుండల మండిత గండ భాగుండును, శ్రీవత్సవక్షుండును, నలిన చక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణికనక కాంచిత కాంచీవలయాంగద కిరీటహార నూపురాలంకృతుండునుఁ, కమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరణుండునునై యవతరించిన సమయంబున. (507)
శా.చింతం బాసిరి యక్షతార్క్ష్యసుమనస్సిద్ధోరగాధీశ్వరుల్
సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్
గాంతిం జెందిరి భానుచంద్రములు; రంగద్గీత వాద్యంబులన్
గంతుల్ వైచిరి మింటఁ గింపురుషులున్ గంధర్వులుం గిన్నరుల్. (508)

వామనుడు జన్మించినపుడు అతనికి నాలుగు చేతులూ, ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదాపద్మములు ఉన్నాయి. గోరోజనరంగు వస్త్రమూ, మకర కుండలాలలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సమూ, కమలాలవంటి కన్నులూ కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల మెడలో కదులుతున్నది. రత్నములు కూర్చిన బంగారు ఒడ్డాణము, బాహుపురులూ, కిరీటమూ, హారములూ, కాలి అందెలు కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన, కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపము అఖిల జనుల మనస్సులను ఆకర్షిస్తున్నది.

వామనుడు పుట్టగానే, యక్షులూ, గరుడులూ, సిద్ధులూ, నాగులూ, చింతలు విడిచినారు. సాధ్యులూ, చారణులూ, ఋషులూ, ఋత్విజులూ, విద్యాధరులూ, సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారు. గంధర్వులూ, కిన్నరులూ, కింపురుషులూ వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశములో నాట్యములుజేసినారు.

चिह्नं श्रीवत्ससङ्ज्ञं हि वक्षस्यस्य स्थितं हरेः ।
इति श्रीवत्सवक्षा इत्युच्यते विदुषं वरैः ॥

Cihnaṃ śrīvatsasaṅjñaṃ hi vakṣasyasya sthitaṃ hareḥ,
Iti śrīvatsavakṣā ityucyate viduṣaṃ varaiḥ.

Since there is a mark called Śrīvatsa on His bosom, He is called Śrīvatsavakṣāḥ.

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे अष्टादशोऽध्यायः ::
श्यामावदातो झषराजकुण्डलत्विषोल्लसच्छ्रीवदनाम्बुजः पुमान् ।
श्रीवत्सवक्षा बलयाङ्गदोल्लसत्किरीटकाञ्चीगुणचारुनूपुरः ॥ २ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 18
Śyāmāvadāto jhaṣarājakuṇḍalatviṣollasacchrīvadanāmbujaḥ pumān,
Śrīvatsavakṣā balayāṅgadollasatkirīṭakāñcīguṇacārunūpuraḥ. 2.

The body of the Lord, blackish in complexion, was free from all inebrieties. His lotus face, decorated with earrings resembling sharks, appeared very beautiful, and on His bosom was the mark of Śrīvatsa. He wore bangles on His wrists, armlets on His arms, a helmet on His head, a belt on His waist, a sacred thread across His chest, and ankle bells decorating His lotus feet.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

26 జూన్, 2014

600. శివః, शिवः, Śivaḥ

ఓం శివాయ నమః | ॐ शिवाय नमः | OM Śivāya namaḥ

శివః, शिवः, Śivaḥ

స్వనామస్మృతిమాత్రేణ పావయన్ శివ ఉచ్యతే తన నామమును స్మరించినంతనే స్మరించినవారిని పవిత్రులునుగా చేయువాడుగనుక ఆ పరమాత్మకు శివః అను నామము.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
చ. అలరు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ
     తులసి పవిత్రమైన గతిఁ దోయజనాభ! భవత్కథాసుధా
     కలితములైన వాక్కుల నకల్మషయుక్తుని విన్నఁ గర్ణముల్‍
     విలసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా! (551)

ఓ పద్మనాభా! ఓ రమావల్లభా! నీ పాదారవిందములపై అర్పింపబడిన ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన వాక్కులను కల్మషం లేకుండా విన్న మా చెవులుకూడా పరమ పవిత్రాలై భాసిల్లుతాయి.

स्वनामस्मृतिमात्रेण पावयन् शिव उच्यते / Svanāmasmr̥timātreṇa pāvayan śiva ucyate Because of remembrance of His name, He purifies those who have uttered His name and hence He is called Śivaḥ.

:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे द्वितीयोऽध्यायः ::
न ह्यन्तोऽन्यः शिवः पन्था विषतः संसृताविह ।
वासुदेवो भगवति भक्तियोगो यतो भवेत् ॥ ३३ ॥

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 2
Na hyanto’nyaḥ śivaḥ panthā viṣataḥ saṃsr̥tāviha,
Vāsudevo bhagavati bhaktiyogo yato bhavet. 33.

For those who are wandering in the material universe, there is no more auspicious means of deliverance than what is aimed at in the direct devotional service of Lord Kṛṣṇa.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

25 జూన్, 2014

599. క్షేమకృత్, क्षेमकृत्, Kṣemakr̥t

ఓం క్షేమకృతే నమః | ॐ क्षेमकृते नमः | OM Kṣemakr̥te namaḥ

క్షేమకృత్, क्षेमकृत्, Kṣemakr̥t

క్షేమకృద్య ఉపాత్తస్య కరోతి పరిరక్షణమ్ క్షేమము అనగా కలిగియున్నదాని పరిరక్షణము. భక్తులకు అట్టి క్షేమమును అందించువాడు క్షేమకృత్‍.

:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ 22 ॥

ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో, ఎల్లప్పుడు నాయందే నిష్ఠగలిగియుండు అట్టివారియొక్క యోగక్షేమములు నేనే వహించుచున్నాను.

क्षेमकृद्य उपात्तस्य करोति परिरक्षणम् / Kṣemakr̥dya upāttasya karoti parirakṣaṇam Safeguarding what is possessed is Kṣema. Since He provides such Kṣema to His devotees, He is Kṣemakr̥t.

:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योगमु ::
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥ २२ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 9
Ananyāścintayanto māṃ ye janāḥ paryupāsate,
Teṣāṃ nityābhiyuktānāṃ yogakṣemaṃ vahāmyaham. 22.

Those persons, who becoming non-different from Me and meditatively worship Me all the times, for them, who are ever attached to Me, I arrange for securing what they lack and preserving what they have.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

24 జూన్, 2014

598. సంక్షేప్తా, संक्षेप्ता, Saṃkṣeptā

ఓం సంక్షేప్త్రే నమః | ॐ संक्षेप्त्रे नमः | OM Saṃkṣeptre namaḥ

సంహార సమయే విశ్వం విస్తృతం సంక్షిపన్ హరిః ।
సూక్ష్మరూపేణ సంక్షేప్తేత్యుచ్యతే విదుషం వరైః ॥

సృష్టిచే విస్తరించి యున్న విశ్వము, సంహార సమయమునందు అనగా ప్రళయకాలమునందు ఆ పరమాత్మునియందు సూక్ష్మరూపమున సంక్షిప్తమై యుండునుగనుక ఆ పరమాత్ముడు సంక్షిప్తః.

संहार समये विश्वं विस्तृतं संक्षिपन् हरिः ।
सूक्ष्मरूपेण संक्षेप्तेत्युच्यते विदुषं वरैः ॥

Saṃhāra samaye viśvaṃ vistr̥taṃ saṃkṣipan hariḥ,
Sūkṣmarūpeṇa saṃkṣeptetyucyate viduṣaṃ varaiḥ.

Out of creation the universe that is existing in an expanded state gets contracted into Him in a subtle form during the times of dissolution and hence He is called Saṃkṣeptā.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

23 జూన్, 2014

597. నివృత్తాత్మా, निवृत्तात्मा, Nivr̥ttātmā

ఓం నివృత్తాత్మనే నమః | ॐ निवृत्तात्मने नमः | OM Nivr̥ttātmane namaḥ

స్వభావతో విషయేభ్యో నివృత్తోఽస్యజగత్పతే ।
ఆత్మా మన ఇతి హరిర్నివృత్తాత్మేతి కథ్యతే ॥

స్వభావ సిద్ధముగా విషయముల నుండి మరలియుండు ఆత్మ/మనస్సు కలవాడు నివృత్తాత్మ.

स्वभावतो विषयेभ्यो निवृत्तोऽस्यजगत्पते ।
आत्मा मन इति हरिर्निवृत्तात्मेति कथ्यते ॥

Svabhāvato viṣayebhyo nivr̥tto’syajagatpate,
Ātmā mana iti harirnivr̥ttātmeti kathyate.

By nature, His ātma i.e., mind has turned back from sensory pleasures and hence He is Nivr̥ttātmā.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

22 జూన్, 2014

596. అనివర్తీ, अनिवर्ती, Anivartī

ఓం అనివర్తినే నమః | ॐ अनिवर्तिने नमः | OM Anivartine namaḥ

వృషప్రియత్వాద్ధర్మాద్వా సఙ్గ్రామాద్వాఽసురైస్సహ ।
న నివర్తత ఇత్యనివర్తీతి ప్రోచ్యతే హరిః ॥

తాను వృషప్రియుడు అనగా ధర్మము తనకు ప్రీతిపాత్రముగా కలవాడుగావున ధర్మమునుండి ఎన్నడును మరలువాడు కాదు. లేదా దేవాసురుల నడుమ జరుగు సంగ్రామమునుండి ఎన్నడును మరలువాడు కాదు.

वृषप्रियत्वाद्धर्माद्वा सङ्ग्रामाद्वाऽसुरैस्सह ।
न निवर्तत इत्यनिवर्तीति प्रोच्यते हरिः ॥

Vr̥ṣapriyatvāddharmādvā saṅgrāmādvā’suraissaha,
Na nivartata ityanivartīti procyate hariḥ.

Since He is Vr̥ṣapriyaḥ i.e., the One to whom dharma or righteousness is dear, He never abrogates from the path of dharma.

Or He who never turns back from the war between devas and asuras is Anivartī.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

21 జూన్, 2014

595. వృషప్రియః, वृषप्रियः, Vr̥ṣapriyaḥ

ఓం వృషప్రియాయ నమః | ॐ वृषप्रियाय नमः | OM Vr̥ṣapriyāya namaḥ

వృషశ్చాసౌ ప్రియశ్చేతి వృషప్రియ ఇతీర్యతే ।
వృషో ధర్మః ప్రియో యస్య హరిర్వాఽయం వృషప్రియః ।
వా ప్రియస్యేత్యతః పూర్వనిపాతస్య వికల్పనాత్ ॥

వృషము ఎవనికి ప్రియమో అనగా ధర్మము ఎవనికి ప్రియమో ఆతడు వృషప్రియః. లేదా ఈ భగవానుడు సర్వకామిత ఫలములను వర్షించు వృషుడును, ప్రియకరుడగు ప్రియుడునుగనుక వృషప్రియః.

वृषश्चासौ प्रियश्चेति वृषप्रिय इतीर्यते ।
वृषो धर्मः प्रियो यस्य हरिर्वाऽयं वृषप्रियः ।
वा प्रियस्येत्यतः पूर्वनिपातस्य विकल्पनात् ॥

Vr̥ṣaścāsau priyaśceti vr̥ṣapriya itīryate,
Vr̥ṣo dharmaḥ priyo yasya harirvā’yaṃ vr̥ṣapriyaḥ,
Vā priyasyetyataḥ pūrvanipātasya vikalpanāt.

He to whom vr̥ṣa i.e., dharma or righteousness is priya or dear. Or He who abundantly bestows fulfillment of all the appropriate desires and also the One who is very dear.

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

20 జూన్, 2014

594. వృషభాక్షః, वृषभाक्षः, Vr̥ṣabhākṣaḥ

ఓం వృషభాక్షాయ నమః | ॐ वृषभाक्षाय नमः | OM Vr̥ṣabhākṣāya namaḥ

వృషభాక్షః, वृषभाक्षः, Vr̥ṣabhākṣaḥ

వార్షుకేఽఖిలకామానామక్షిణీహ్యస్య మాపతేః ।
యస్మాత్తస్వాద్వృషభాక్ష ఇతి విష్ణుస్సమీర్యతే ॥
అథవా వృషభో ధర్మః దృష్టిరస్యేతి వా హరిః ।
వృషభాక్ష ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥

వర్షతి ఇతి వృషః, వృషభః అను అర్థమున వర్షించునది. సర్వ కామములను వర్షించు కనులు ఈతనికి కలవు. లేదా వృషభము అనగా సర్వ కామములను వర్షించునదియగు ధర్మము ఈతనికి అక్షి అనగా దృష్టి లేదా కన్నుగా నున్నది.

वार्षुकेऽखिलकामानामक्षिणीह्यस्य मापतेः ।
यस्मात्तस्वाद्वृषभाक्ष इति विष्णुस्समीर्यते ॥
अथवा वृषभो धर्मः दृष्टिरस्येति वा हरिः ।
वृषभाक्ष इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥

Vārṣuke’khilakāmānāmakṣiṇīhyasya māpateḥ,
Yasmāttasvādvr̥ṣabhākṣa iti viṣṇussamīryate.
Athavā vr̥ṣabho dharmaḥ dr̥ṣṭirasyeti vā hariḥ,
Vr̥ṣabhākṣa iti prokto vedavidyāviśāradaiḥ.

वर्षति इति वृषः, वृषभः / Varṣati iti vr̥ṣaḥ, vr̥ṣabhaḥ from this derivation, as rain or bestow in abundance. Thus Vr̥ṣabhākṣaḥ is the One whose eyes bestow all that is desired in abundance.

Or the One with eye or sight that bestows all that is desired in abundance.

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

19 జూన్, 2014

593. గోప్తా, गोप्ता, Goptā

ఓం గోప్త్రే నమః | ॐ गोप्त्रे नमः | OM Goptre namaḥ

స్వమాయయా స్వమాత్మానం సంవృణోతీతి వా హరిః ।
జగతో రక్షక ఇతి వా గోప్తేత్యుచ్యతే బుధైః ॥

గుపూ, గుప్‍ - రక్షణే అను ధాతువునకు కప్పివేయుట, దాచుట అను అర్థములను గ్రహించినచో - తన మాయ చేత తన స్వరూపమును కప్పివేయువాడు అను అర్థమును చెప్పవచ్చును. లేదా మరి యొక విధముగా చూచినట్లైన జగమును రక్షించువాడు అని కూడా అర్థమును గ్రహించవచ్చును.

स्वमायया स्वमात्मानं संवृणोतीति वा हरिः ।
जगतो रक्षक इति वा गोप्तेत्युच्यते बुधैः ॥

Svamāyayā svamātmānaṃ saṃvr̥ṇotīti vā hariḥ,
Jagato rakṣaka iti vā goptetyucyate budhaiḥ.

He who conceals His ownself by His māya or the illusion. In another form, Goptā can also be interpreted as the protector of the worlds.

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

18 జూన్, 2014

592. గోపతిః, गोपतिः, Gopatiḥ

ఓం గోపతయే నమః | ॐ गोपतये नमः | OM Gopataye namaḥ

గోర్భూమ్యాః పతిరితి గోపతిరిత్యుచ్యతే హరిః గో అనగా గోవు లేదా భూమి అని కూడా అర్థము వచ్చును. కావున గోపతిః అనగా గోవునకూ, భూమికీ పతి/రక్షకుడు/ప్రభువు/భర్త అను అర్థము చెప్పవచ్చును.

(గోపతిః అనగా సూర్య భగవానుడు అని కూడా అర్థము చెప్పవచ్చును. సూర్య దేవుడు సైతము ఆ విష్ణు దేవుని విభూతియే కదా!)

495. గోపతిః, गोपतिः, Gopatiḥ

गोर्भूम्याः पतिरिति गोपतिरित्युच्यते हरिः / Gorbhūmyāḥ patiriti gopatirityucyate Hariḥ Go can mean a cow as well as earth. Hence Gopatiḥ means the One who is pati of Go i.e., Lord of earth or cows.

(Sun is also called Gopatiḥ. Sun is also an opulence of Lord Hari.)

495. గోపతిః, गोपतिः, Gopatiḥ

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

17 జూన్, 2014

591. గోహితః, गोहितः, Gohitaḥ

ఓం గోహితాయ నమః | ॐ गोहिताय नमः | OM Gohitāya namaḥ

గోహితః, गोहितः, Gohitaḥ

గవాం వృద్ధ్యర్థమపి గోవర్ధనం ధృతవానితి ।
గోభ్యోహితో గోహిత ఇత్యుచ్యతే విబుదైర్హరిః ॥

గోవులకు హితుడు. గోవుల విషయమున హితకరమగు పనులు చేయువాడు గోహితః. గోవులను కాపాడటానికై గోవర్ధన గిరిని ధరించియుండుట ఒక ఉదాహరణ. లేదా 'గో' అనగా భూమికి సంబంధించిన విషయమున హితమును చేకూర్చువాడు అని కూడా చెప్పవచ్చును. భూభారమును తగ్గించుటకొరకై పలు అవతారములను దాల్చి యుండెను కదా!

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
క. ఏ నవతరించు టెల్లను, మానుగఁ జతురంతధరణి మండలభరమున్‍
    మానుపుకోఱకుం గాదే, పూనెద నిది మొదలు దగిలి భూభార మణఁపన్‍. (1533)
ఆ. మగధనాథుఁ బోర మడియింపఁ బోలదు, మడియకున్న వీఁడు మరల మరలి
     బలము గూర్చికొంచుఁ బఱతెంచుఁ బరతేరఁ, ద్రుంపవచ్చు నేల దొసఁగు దొఱఁగ. (1534)

నేను అవతరించుట నాలుగు చెఱగుల భూభారమును నివారించుట కొరకేగనుక నేటినుంచి భూభారమును హరించుటకు ఉద్యమిస్తాను. యుద్ధములో మగధేశ్వరుడైన జరాసంధుడిని చంపరాదు. వీడు చావకుంటే మళ్ళీ మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని వస్తూ వుంటాడు. అప్పుడు అందరినీ చంపి ధరాభారమును ఉడిపి, ఆవల వీడిని చంపవచ్చును.

गवां वृद्ध्यर्थमपि गोवर्धनं धृतवानिति ।
गोभ्योहितो गोहित इत्युच्यते विबुदैर्हरिः ॥

Gavāṃ vr̥ddhyarthamapi govardhanaṃ dhr̥tavāniti,
Gobhyohito gohita ityucyate vibudairhariḥ.

The One who thinks of welfare of the cows. For the welfare of cows he lifted and sustained the Govardhana hill. So Gohitaḥ or the One who thinks of welfare of the cows.

Or 'Go' can also be interpreted as earth. To ease the burden of earth, i.e., annihilate the evil doers who are a burden to earth, He incarnated many times and hence He is Gohitaḥ.

:: श्रीमद्भागवते एकादशस्कन्धे पञ्चमोऽध्यायः ::
भूभारासुरराजन्य हन्तवे गुप्तये सताम् ।
अवतीर्णस्य निर्वृत्यैः यशो लोके वितन्तये ॥ ५० ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 5
Bhūbhārāsurarājanya hantave guptaye satām,
Avatīrṇasya nirvr̥tyaiḥ yaśo loke vitantaye. 50.

The Lord descended to kill the demoniac kings who were the burden of the earth and to protect the saintly devotees. However, both the demons and the devotees are awarded liberation by the Lord's mercy. Thus, His transcendental fame has spread throughout the universe.

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

16 జూన్, 2014

590. కువలేశయః, कुवलेशयः, Kuvaleśayaḥ

ఓం కువలేశాయ నమః | ॐ कुवलेशाय नमः | OM Kuvaleśāya namaḥ

కోః క్షితేర్వలనాదమ్భః సరణాత్ కువలాభిధమ్ ।
తత్రాచ్యుతః శేత ఇతి కువలేశయ ఉచ్యతే ॥
శయవాసాశిష్వకాలాదిత్యలుక్ సప్తమీ సుపః ।
కువలస్య వా బదరీఫలస్యాన్తస్తు తక్షకః ॥
విష్ణ్వోర్విభూతిరిత్యేవ వా హరిః కువలేశయః ।
కౌ భూమ్యాం వలతే వా సంశ్రయతే భుజగోదరమ్ ॥
ఇత్యతః కువలం శేషస్యోదరం తత్ర కేశవః ।
శేషోదరే శేత ఇతి వా హరిః కువలేశయః ॥

భూమిని క్రమ్మి వేయుట వలన కువలం అనగా జలము. అట్టి కువలమునందు శయనించియుండువాడుగనుక ఆ హరికి కువలేశయః అను నామము. (ఇచట కువలే అనుటలో కువల శబ్దము మీది సప్తమీ విభక్తికి 'శయ వాస వాసి ష్వకాలాత' (పాణిని 6.3.18) చే లోపము రాకపోయినది.)

లేదా కువలము అనగా రేగుపండునందు శయనించి యుండినవాడు అని కూడా చెప్పవచ్చును. భాగవత కథను అనుసరించి తక్షకుడు అటువంటివాడు. ఆ తక్షకుడునూ హరి విభూతియే కావున హరికి కువలేశయః అను నామము తగును.

లేదా 'కు' నందు అనగా భూమియందు ఆశ్రయము పొందియుండునవి అను అర్థమున 'కువలం' అనగా సర్పముల పొట్ట. దానియందు అనగా శేషుని ఉదరమునందు శయనించియుండువాడుగనుక కువలేశయః అని కూడా చెప్పవచ్చును.

कोः क्षितेर्वलनादम्भः सरणात् कुवलाभिधम् ।
तत्राच्युतः शेत इति कुवलेशय उच्यते ॥
शयवासाशिष्वकालादित्यलुक् सप्तमी सुपः ।
कुवलस्य वा बदरीफलस्यान्तस्तु तक्षकः ॥
विष्ण्वोर्विभूतिरित्येव वा हरिः कुवलेशयः ।
कौ भूम्यां वलते वा संश्रयते भुजगोदरम् ॥
इत्यतः कुवलं शेषस्योदरं तत्र केशवः ।
शेषोदरे शेत इति वा हरिः कुवलेशयः ॥

Koḥ kṣitervalanādambhaḥ saraṇāt kuvalābhidham,
Tatrācyutaḥ śeta iti kuvaleśaya ucyate.
Śayavāsāśiṣvakālādityaluk saptamī supaḥ,
Kuvalasya vā badarīphalasyāntastu takṣakaḥ.
Viṣṇvorvibhūtirityeva vā hariḥ kuvaleśayaḥ,
Kau bhūmyāṃ valate vā saṃśrayate bhujagodaram.
Ityataḥ kuvalaṃ śeṣasyodaraṃ tatra keśavaḥ,
Śeṣodare śeta iti vā hariḥ kuvaleśayaḥ.

Kuvalam is water since it is around (or in) the earth. Since Lord Hari rests on it, He is Kuvaleśayaḥ.

In another form, the divine name can be interpreted as the one that lied within the badari fruit i.e., jujube fruit. As per Bhagavata, the serpent Takshaka is the one who came out of the fruit. Since Takshaka is also an opulence of Lord Hari, He is Kuvaleśayaḥ.

Or Kuvala can also be interpreted as the belly of serpents as they crawl on the ground. Since Lord Hari rests on it i.e., the belly of Śeṣa, He is called Kuvaleśayaḥ.

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

15 జూన్, 2014

589. కుముదః, कुमुदः, Kumudaḥ

ఓం కుముదాయ నమః | ॐ कुमुदाय नमः | OM Kumudāya namaḥ

కౌ భూమ్యాం మోదత ఇతి కుముదః ప్రోచ్యతే హరిః మానవాది జీవుల రూపమున భూమిపై సంతోషముతోనుండునుగనుక ఆ హరి కుముదః

कौ भूम्यां मोदत इति कुमुदः प्रोच्यते हरिः / Kau bhūmyāṃ modata iti kumudaḥ procyate Hariḥ In the forms of various life forms Lord Hari delights dwelling on earth and hence He is Kumudaḥ.

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

14 జూన్, 2014

588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā

ఓం స్రష్ట్రే నమః | ॐ स्रष्ट्रे नमः | OM Sraṣṭre namaḥ

స్రష్టా, स्रष्टा, Sraṣṭā

సర్గాదౌ సర్వభూతాని ససర్జేత్యచ్యుతో హరిః ।
స్రష్టేతి ప్రోచ్యతే సద్భిర్వేదవిద్యావిశారదైః ॥

సృష్టి ఆది యందు సర్వ భూతములనూ సృజించినవాడుగనుక ఆ విష్ణుదేవుడు స్రష్టా.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. వేదవధూశిరో మహితవీథులఁ జాల నలంకరించు మీ
     పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని
     త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెరుంగఁ బల్కు దా
     మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! ( 753)

దామోదరా! వేదాంత వీథులలో విహరించెడి నీ పాద పద్మములు మా హృదయములలో ఎల్లప్పుడును నిలి ఉండే ఉపాయమును మాకు అనుగ్రహింపుము. నీవు సంసార సాగరమును తరింప జేసెడివాడవు. ఈ సమస్త సృష్టికీ కారణమైయున్నవాడవు.

सर्गादौ सर्वभूतानि ससर्जेत्यच्युतो हरिः ।
स्रष्टेति प्रोच्यते सद्भिर्वेदविद्याविशारदैः ॥

Sargādau sarvabhūtāni sasarjetyacyuto hariḥ,
Sraṣṭeti procyate sadbhirvedavidyāviśāradaiḥ.

Since He created all the beings during creation, He is called Sraṣṭā.

:: श्रीमद्भागवते दशमस्कन्धे षट्पञ्चाशत्तमोऽध्यायः ::
त्वं हि विश्वसृजाम्‌स्रष्टा सृष्टानामपि यच्च सत् ।
कालः कलयतामीशः पर आत्मा तथात्मनाम् ॥ २७ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 56
Tvaṃ hi viśvasr̥jāmˈsraṣṭā sr̥ṣṭānāmapi yacca sat,
Kālaḥ kalayatāmīśaḥ para ātmā tathātmanām. 27.

You are the ultimate creator of all creators of the universe, and of everything created You are the underlying substance. You are the subduer of all subduers, the Supreme Lord and Supreme Soul of all souls.

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

13 జూన్, 2014

587. శాన్తిదః, शान्तिदः, Śāntidaḥ

ఓం శాన్తిదాయ నమః | ॐ शान्तिदाय नमः | OM Śāntidāya namaḥ

రాగద్వేషాదినిర్మోక్షలక్షణాం శాన్తిమచ్యుతః ।
దదాతీతి శాన్తిద ఇతి ప్రోక్తో విష్ణుర్బుధైర్వరైః ॥

రాగ, ద్వేషాది దోషములకు అతీతమైనట్టి శాంతి స్థితిని అనుగ్రహించగలవాడుగనుక ఆ విష్ణువు శాంతిదః.

रागद्वेषादिनिर्मोक्षलक्षणां शान्तिमच्युतः ।
ददातीति शान्तिद इति प्रोक्तो विष्णुर्बुधैर्वरैः ॥

Rāgadveṣādinirmokṣalakṣaṇāṃ śāntimacyutaḥ,
Dadātīti śāntida iti prokto viṣṇurbudhairvaraiḥ.

Since He confers Śānti, the state that is characterized by freedom from attachment and aversion etc., Lord Viṣṇu is called Śāntidaḥ.

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

12 జూన్, 2014

586. శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ

ఓం శుభాఙ్గాయ నమః | ॐ शुभाङ्गाय नमः | OM Śubhāṅgāya namaḥ

శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ

ధారయన్ సున్దరతనుం శుభాఙ్గ ఇతి కథ్యతే బాహ్య సౌందర్యవంతమయిన లేదా ఆధ్యాత్మిక దృక్కోణములో సచ్చిదానంద రూపముగల శరీరము ఎవనికి కలదో అట్టివాడు శుభాంగుడు.

శాన్తాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ।
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గం ॥
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం ।
వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥

శాంతాకారుడు, శేషశయనుడు, పద్మనాభుడూ, దేవాదిదేవుడు, విశ్వానికి ఆధారము వంటివాడు, ఆకాశమువలె విశాలమైనవాడు, నీలమేఘశ్యాముడు, సుందరమైన అంగములుగలవాడు, లక్ష్మీపతి, కమలములవంటి కన్నులుగలవాడు, యోగి జనుల హృదయాలలో కొలువుదీరేవాడు, అన్ని లోకాలకు ఏకైక నాథుడు, సంసారమనే భయమును తొలగించగల ఆ విష్ణు దేవునికి ప్రణామము.

धारयन् सुन्दरतनुं शुभाङ्ग इति कथ्यते / Dhārayan sundaratanuṃ śubhāṅga iti kathyate From mere appearance point-of-view the One with handsome body and from the spiritual angle, the One who has has a blissful body is called Śubhāṅgaḥ.

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं ।
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं ॥
लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं ।
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ॥

Śāntākāraṃ bhujagaśayanaṃ padmanābhaṃ sureśaṃ,
Viśvādhāraṃ gaganasadr̥śaṃ meghavarṇaṃ śubhāṅgaṃ.
Lakṣmīkāntaṃ kamalanayanaṃ yogihr̥ddhyānagamyaṃ,
Vande Viṣṇuṃ bhavabhayaharaṃ sarvalokaikanāthaṃ.

I salute Lord Viṣṇu, the sole master of the universe, Whose presence is very peaceful, Who stretches Himself on a serpent-bed, Who sports a lotus in His navel, Who is the One Lord of all the gods, Who is the Support of the worlds, Who is subtle and all-pervading like the sky, Whose complexion is like that of the rain bearing clouds, Whose form is very beautiful, Who is the consort of Śrī, Whose eyes are like lotus petals, Who is mediated upon by Yogis and Who eradicates the fear of saṃsāra.

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥

11 జూన్, 2014

585. పరాయణమ్, परायणम्, Parāyaṇam

ఓం పరాయ్ణాయ నమః | ॐ पराय्णाय नमः | OM Parāyṇāya namaḥ

పరముత్కృష్టమయనం స్థానం బ్రహ్మ సనాతనమ్ ।
పునరావృత్తిశాఙ్కాయా విరహాత్తత్పరాయణమ్ ॥
పరముత్కృష్ఠమయనం స్థానం యస్య రమాపతేః ।
స పరాయణ ఇత్యేవం బహువ్రీహిః పుమానపి ॥

పరాయణమ్ అనగా పరమ ఉత్కృష్టమూ, గొప్పదీ, పునరావృత్తి రహితమూయగు ఆయనము అనగా స్థానము. ఈ నామము పరాయణః అనుచు పులింగ రూపముగా గ్రహించబడినచో, 'ఎవని స్థానము ఉత్కృష్టమైయున్నదో' అని బహువ్రీహి సమాసముగా చెప్పవలెను.

परमुत्कृष्टमयनं स्थानं ब्रह्म सनातनम् ।
पुनरावृत्तिशाङ्काया विरहात्तत्परायणम् ॥
परमुत्कृष्ठमयनं स्थानं यस्य रमापतेः ।
स परायण इत्येवं बहुव्रीहिः पुमानपि ॥

Paramutkr̥ṣṭamayanaṃ sthānaṃ brahma sanātanam,
Punarāvr̥ttiśāṅkāyā virahāttatparāyaṇam.
Paramutkr̥ṣṭhamayanaṃ sthānaṃ yasya ramāpateḥ,
Sa parāyaṇa ityevaṃ bahuvrīhiḥ pumānapi.

The state which is the highest and from which there is no return to lower states is Parāyaṇam. If the divine name is taken as 'Parāyaṇaḥ', then linguistically considering it to be of masculine gender, it should be interpreted as 'He whose is the highest of the states.'

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे एकादशोऽध्यायः ::
तमेव मृत्युममृतं तात दैवं सर्वात्मनोपेहि जगत्परायणम् ।
यस्मै बलिं विश्वसृजो हरन्ति गावो यथा वै नसि दामयन्त्रिताः ॥ २७ ॥ 

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 11
Tameva mr̥tyumamr̥taṃ tāta daivaṃ sarvātmanopehi jagatparāyaṇam,
Yasmai baliṃ viśvasr̥jo haraṃti gāvo yathā vai nasi dāmayaṃtritāḥ. 27.

Surrender unto the Him, who is the ultimate goal of the world. Everyone, including the gods headed by Lord Brahmā, is working under His control, just as a bull, prompted by a rope in its nose, is controlled by its owner.

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

10 జూన్, 2014

584. శాన్తిః, शान्तिः, Śāntiḥ

ఓం శాన్త్యై నమః | ॐ शान्त्यै नमः | OM Śāntyai namaḥ

శాన్తిః, शान्तिः, Śāntiḥ

శాన్తిస్సమస్తావిద్యాయా నివృత్తిర్బ్రహ్మవాచికా సమస్తమగు అవిద్య, అజ్ఞానము నివృత్తి చెందుట అను స్థితియే 'శాంతి' అనబడును. ఆ విధమగు శాంతి బ్రహ్మ రూపమే!

:: శ్రీమద్భగవద్గీత శాఙ్ఖ్య యోగము ::
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చా భావయతః శాన్తిరశాన్త్యస్య కుతః సుఖమ్ ॥ 66 ॥

ఇంద్రియ నిగ్రహము, మనస్సంయమనము లేనివానికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేని వానికి శాంతి లభించదు. శాంతి లేనివానికి సుఖము కలుగనేరదు.

शान्तिस्समस्ताविद्याया निवृत्तिर्ब्रह्मवाचिका / Śāntissamastāvidyāyā nivr̥ttirbrahmavācikā The state in which all kinds of avidya or all forms of misconceptions and ignorance subside is called Śāntiḥ. Such a blissful state is that of Brahman only!

:: श्रीमद्भगवद्गीत शाङ्ख्य योग ::
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चा भावयतः शान्तिरशान्त्यस्य कुतः सुखम् ॥ ६६ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 2
Nāsti buddhirayuktasya na cāyuktasya bhāvanā,
Na cā bhāvayataḥ śāntiraśāntyasya kutaḥ sukham. 66.

For the unsteady there is no wisdom, and there is no meditation for the unsteady. And for an unmeditative man there is no śānti. How can there be happiness for one without śānti?

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

9 జూన్, 2014

583. నిష్ఠా, निष्ठा, Niṣṭhā

ఓం నిష్ఠాయై నమః | ॐ निष्ठायै नमः | OM Niṣṭhāyai namaḥ

భూతాని తత్రైవ లయే తిష్ఠన్తి నితరామితి ।
నిష్ఠేతి ప్రోచ్యతే సద్భిః నిష్ణ్వాఖ్యా దేవతా బుధైః ॥

ప్రళయకాలమున సకల భూతములును ఆతనియందే మిక్కిలిగా నిలిచియుండునుగనుక నిష్ఠా.

भूतानि तत्रैव लये तिष्ठन्ति नितरामिति ।
निष्ठेति प्रोच्यते सद्भिः निष्ण्वाख्या देवता बुधैः ॥

Bhūtāni tatraiva laye tiṣṭhanti nitarāmiti,
Niṣṭheti procyate sadbhiḥ niṣṇvākhyā devatā budhaiḥ.

During pralaya or the times of dissolution, all beings rest in Him for long so He is Niṣṭhā or the Abode.

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

8 జూన్, 2014

582. శాన్తః, शान्तः, Śāntaḥ

ఓం శాన్తాయ నమః | ॐ शान्ताय नमः | OM Śāntāya namaḥ

శాన్తః, शान्तः, Śāntaḥ

విషయేష్వసఙ్గతయా శాన్త ఇత్యుచ్యతే హరిః ।
నిష్కలం నిష్క్రియం శాన్తమితి శ్రుతిసమీరణాత్ ॥

శమః అను నామమునందు వివరించబడిన శమమును పొందియుండి విషయసుఖములందు సంగము అనగా సంబంధమును, ఆసక్తియును లేనివాడు శాన్తః.

:: శ్వేతాశ్వతరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::
నిష్కలం నిష్క్రియగ్‍ం శాన్తం నిరవద్యం నిరఞ్జనం ।
అమృతస్య పరగ్‍ం సేతుం దగ్ధేన్ధనమివానలమ్ ॥ 19 ॥

అవయవ రహితుడును, నిష్క్రియుడును, సర్వవికార రహితుడును, అనింద్యుడును, నిర్లేపుడును, మోక్షమును పొందుటకు సేతువువంటివాడును, సంసార సముద్ర వారధియు, అగ్నిదేవునివలె ప్రకాశించువాడునగు పరమేశ్వరుని మోక్షార్థినయి శరణుజొచ్చుచున్నాను.

विषयेष्वसङ्गतया शान्त इत्युच्यते हरिः ।
निष्कलं निष्क्रियं शान्तमिति श्रुतिसमीरणात् ॥

Viṣayeṣvasaṅgatayā śānta ityucyate hariḥ,
Niṣkalaṃ niṣkriyaṃ śāntamiti śrutisamīraṇāt.

The One who is at the stage described by the previous divine name Śamaḥ being unattached to sensory pleasures, is Śāntaḥ.

:: श्वेताश्वतरोपनिषत् षष्ठोऽध्यायः ::
निष्कलं निष्क्रियग्‍ं शान्तं निरवद्यं निरञ्जनं ।
अमृतस्य परग्‍ं सेतुं दग्धेन्धनमिवानलम् ॥ १९ ॥

Śvetāśvataropaniṣat Chapter 6
Niṣkalaṃ niṣkriyagˈṃ śāntaṃ niravadyaṃ nirañjanaṃ,
Amr̥tasya paragˈṃ setuṃ dagdhendhanamivānalam. 19.

I take refuge in the Lord who is without parts, without actions, tranquil, blameless, unattached, the supreme bridge to immortality, and like a fire that has consumed all its fuel.

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

7 జూన్, 2014

581. శమః, शमः, Śamaḥ

ఓం శమాయ నమః | ॐ शमाय नमः | OM Śamāya namaḥ

ప్రాధాన్యేన శమం జ్ఞానసాధనం ప్రాహ తచ్ఛమః ఇంద్రియ ప్రవృత్తులు నిరోధించబడుటను శమము అందురు అనగా ఇంద్రియములు తమ తమ విషయములయందు ప్రవర్తిల్లకపోవుట. సన్యాసులకు ప్రధానముగా జ్ఞానసాధనమగు అట్టి శమమును ఉపదేశించువాడుగనుక శమః.

యతీనాం ప్రశమో ధర్మః నియమో వనవాసినామ్
దానమేవ గృహస్థానాం శుశ్రూషా బ్రహ్మచారిణాం
ఇతి స్మృతేస్తత్కరోతి తదాచష్టేత్యతోణిచి
పచాద్యచి కృతే రూపం శమ ఇత్యేవ సిద్ధ్యతి

యతులకు ప్రశమమును, వానప్రస్థులకు నియమమును, గృహస్తులకు దానమును, బ్రహ్మచారులకు గురు శుశ్రూషయయు ముఖ్య ధర్మము అను స్మృతి వచనము ఇట ప్రమాణము. దానిని వ్యాఖ్యానించు, బోధించువాడు అను అర్థమున 'తత్కరోతి తదా చష్టే' అము పాణినీయ చురాదిగణసూత్రముచే 'ణిచ్‍' ప్రత్యయమును పచాది గణశబ్దములపై వచ్చు 'అచ్‍' ప్రత్యయము రాగా పై అర్థమున 'శమః' అను పద రూపము సిద్ధించును.

సర్వభూతానాం శమయితేతి వా శమ ఉచ్యతే లేదా సర్వభూతములను శమింప అనగా నశింపజేయువాడు శమయతి అని చెప్పవచ్చును.

प्राधान्येन शमं ज्ञानसाधनं प्राह तच्छमः ।
यतीनां प्रशमो धर्मः नियमो वनवासिनाम् ॥
दानमेव गृहस्थानां शुश्रूषा ब्रह्मचारिणां ।
इति स्मृतेस्तत्करोति तदाचष्टेत्यतोणिचि ॥
पचाद्यचि कृते रूपं शम इत्येव सिद्ध्यति ।
सर्वभूतानां शमयितेति वा शम उच्यते ॥

Prādhānyena śamaṃ jñānasādhanaṃ prāha tacchamaḥ,
Yatīnāṃ praśamo dharmaḥ niyamo vanavāsinām.
Dānameva gr̥hasthānāṃ śuśrūṣā brahmacāriṇāṃ,
Iti smr̥testatkaroti tadācaṣṭetyatoṇici.
Pacādyaci kr̥te rūpaṃ śama ityeva siddhyati,
Sarvabhūtānāṃ śamayiteti vā śama ucyate.

He declared that śama is chiefly the means of knowledge of ātmajñāna. So He Himself is Śamaḥ.

As per the smr̥ti, 'The Dharma of the Sannyāsin is pacification of the mind; of the forest-dweller it is austerity; of the house-holder it is charity and of the Brahmacārin, it is service.'

He controls all creates therefore, He is Śamaḥ.

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

6 జూన్, 2014

580. సన్న్యాసకృత్, सन्न्यासकृत्, Sannyāsakr̥t

ఓం సన్న్యాసకృతే నమః | ॐ सन्न्यासकृते नमः | OM Sannyāsakr̥te namaḥ

సన్న్యాసకృత్, सन्न्यासकृत्, Sannyāsakr̥t

చతుర్థమాశ్రమం వ్యధాదితి సన్న్యాసకృద్ హరిః మోక్షము పొందుట కొరకు సాధనముగా చతుర్థాశ్రమమైన సంన్యాసమును ఏర్పరిచినందున ఆ హరి సన్న్యాసకృత్.

चतुर्थमाश्रमं व्यधादिति सन्न्यासकृद् हरिः / Caturthamāśramaṃ vyadhāditi sannyāsakr̥d hariḥ Since Lord Hari established the fourth phase of Saṃnyāsa i.e., phase of renunciation in our lives to aid us in attaining mokṣa or liberation, He is called Sannyāsakr̥t.

:: श्रीमद्भागवते एकादशस्कन्धे षोडशोऽध्यायः ::
धर्माणामस्मि सन्न्यासः क्षेमाणामबहिर्मतिः ।
गुह्यानां सुनृतं मौनं मिथुनानामजस्त्वहम् ॥ २६ ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 16
Dharmāṇāmasmi sannyāsaḥ kṣemāṇāmabahirmatiḥ,
Guhyānāṃ sunr̥taṃ maunaṃ mithunānāmajastvaham. 26.

Among religious principles I am renunciation, and of all types of security I am consciousness of the eternal soul within. Of secrets I am pleasant speech and silence, and among sexual pairs I am Brahmā.

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

5 జూన్, 2014

579. భిషక్, भिषक्, Bhiṣak

ఓం భిషజే నమః | ॐ भिषजे नमः | OM Bhiṣaje namaḥ

సంసారరోగ నిర్మోక్ష కరీముపదిదేశ సః ।
విద్యాం గీతాస్వితి హరిర్భిషగిత్యుచ్యతే బుధైః ।
భిషక్తమం త్వాం భిషజాం శృణోమితి శ్రుతీరణాత్ ॥

సంసారమను రోగమునుండి సమగ్రముగా విడుదల కలిగించగల 'పరా' అను తత్త్వవిద్యను భగవద్గీతాదులతో ఉపదేశించెనుగనుక పరమాత్ముడు వైద్యుడనదగును.

భిషక్తమం త్వాం భిషజాం శృణోమి  (ఋగ్ వేదము 2.33.4) అనగా 'నిన్ను వైద్యులందరిలో గొప్ప వైద్యునిగా తెలిసికొనుచున్నాను' అను శ్రుతి వచనము కలదు.

संसाररोग निर्मोक्ष करीमुपदिदेश सः ।
विद्यां गीतास्विति हरिर्भिषगित्युच्यते बुधैः ।
भिषक् तमं त्वां भिषजां शृणोमिति श्रुतीरणात् ॥

Saṃsāraroga nirmokṣa karīmupadideśa saḥ,
Vidyāṃ gītāsviti harirbhiṣagityucyate budhaiḥ,
Bhiṣak tamaṃ tvāṃ bhiṣajāṃ śr̥ṇomiti śrutīraṇāt.

Through the mediums like Bhagavad Gītā, since he delivered the medicine that can help alleviate the condition of those afflicted with the disease called worldly existence, He can be considered to be the greatest of physicians and hence He is called Bhiṣak.

भिषक्तमं त्वां भिषजां शृणोमि / Bhiṣaktamaṃ tvāṃ bhiṣajāṃ śr̥ṇomi (R̥g veda 2.33.4) You are best of all physician.

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक्
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

4 జూన్, 2014

578. భేషజం, भेषजं, Bheṣajaṃ

ఓం భేషజాయ నమః | ॐ भेषजाय नमः | OM Bheṣajāya namaḥ

భేషజం, भेषजं, Bheṣajaṃ

ఔషధం భవరోగస్య బ్రహ్మ భేషజముచ్యతే సంసారమను రోగమునకు ఔషధము వంటివాడుగనుక పరమాత్ముడు భేషజమనబడును.

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
ఉ. అరయ వీర్యవంత మగు ఔషధమెట్లు యదృచ్ఛఁ గొన్నఁ ద
     చ్చారు గుణంబు రోగములఁ జయ్యనఁ బాపినమాడ్కిఁ ఋణ్య వి
     స్పారుని నంబుజోదరునిఁ బామరుఁ దజ్ఞుఁ డవజ్ఞుఁ బల్కివన్‍
     వారక తత్ప్రభావము ధ్రువంబుగ నాత్మగుణంబుఁ జూపదే! (126)

సారవంతమైన ఔషధం అనుకోకుండా పొరబాటున సేవించినప్పటికిని దాని గుణము వృథాగా పోదు. దాని ప్రభావం రోగాలను పోగొట్టి తీరుతుంది. అటులనే పరమపావనుడైన భగవంతుని నామము తెలియక పలికినను, తిరస్కారభావముతో పలికినను - దాని ప్రభావము ఊరకనే పోదు. దాని మహత్తర గుణమును అది తప్పక చూపి తీరుతుంది.

औषधं भवरोगस्य ब्रह्म भेषजमुच्यते / Auṣadhaṃ bhavarogasya brahma bheṣajamucyate Since Paramātma is the remedy of a malady called worldly existence, He is called Bheṣajaṃ.

:: श्रीमद्भागवते सप्तम स्कन्धे नवमोऽध्यायः ::
यस्मात्प्रियाप्रियवियोगसंयोगजन्म
शोकाग्निना सकलयोनिषु दह्यमानः ।
दुःखैषधं तदपि दुःखमतद्धियाहं
भूमन्भ्रमामि वद मे तव दास्ययोगम् ॥ १९ ॥

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 9
Yasmātpriyāpriyaviyogasaṃyogajanma
Śokāgninā sakalayoniṣu dahyamānaḥ,
Duḥkhaiṣadhaṃ tadapi duḥkhamataddhiyāhaṃ
Bhūmanbhramāmi vada me tava dāsyayogam. 19.

O great one, O Supreme Lord, because of combination with pleasing and displeasing circumstances and because of separation from them, one is placed in a most regrettable position, within heavenly or hellish planets, as if burning in a fire of lamentation. Although there are many remedies by which to get out of miserable life, any such remedies in the material world are more miserable than the miseries themselves. Therefore I think that the only remedy is to engage in Your service. Kindly instruct me in such service.

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

3 జూన్, 2014

577. నిర్వాణం, निर्वाणं, Nirvāṇaṃ

ఓం నిర్వాణాయ నమః | ॐ निर्वाणाय नमः | OM Nirvāṇāya namaḥ

నిర్వాణం, निर्वाणं, Nirvāṇaṃ

సర్వదుఃఖోపశమన లక్షణం యత్ సనాతనం ।
పరమానన్ద రూపం తద్బ్రహ్మ నిర్వాణముచ్యతే ॥

సర్వదుఃఖములను ఉపశమింపజేసి శాంతినొందించు లక్షణమే తన పరమానంద రూపమగు తత్త్వము లేదా పరతత్త్వము గనుక ఆ దేవదేవుడు 'నిర్వాణం' అను నామము గలవాడు.

:: శ్రీమద్భగవద్గీత - కర్మసన్న్యాస యోగము ::
లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః ।
ఛిన్నద్వైదా యతాత్మనః సర్వభూతహితేరతః ॥ 25 ॥
కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ॥ 26 ॥

పాపరహితులును, సంశయవర్జితులును, ఇంద్రియ మనంబులను స్వాధీనపఱచుకొనినవారును, సమస్తప్రాణులయొక్క క్షేమమునందు ఆసక్తి గలవారును, ఋషులు బ్రహ్మ కైవల్యమును పొందుచున్నారు.

కామ క్రోధాదులు లేనివారు, మనోనిగ్రహముగలవారును, ఆత్మతత్త్వము నెఱిగినవారునగు యత్నశీలురకు బ్రహ్మసాయుజ్యము అనగా మోక్షము లేదా బ్రహ్మానందము - శరీరమున్నప్పుడును, లేనపుడును, సర్వత్ర, అంతటా వెలయుచునేయున్నది.

सर्वदुःखोपशमन लक्षणं यत् सनातनं ।
परमानन्द रूपं तद्ब्रह्म निर्वाणमुच्यते ॥

Sarvaduḥkhopaśamana lakṣaṇaṃ yat sanātanaṃ,
Paramānanda rūpaṃ tadbrahma nirvāṇamucyate.

Since He is of the nature of supreme bliss characterized by cessation of all sorrows, He is Nirvāṇaṃ.

:: श्रीमद्भगवद्गीत - कर्मसन्न्यास योगमु ::
लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैदा यतात्मनः सर्वभूतहितेरतः ॥ २५ ॥
कामक्रोध वियुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥ २६ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 5
Labhante brahmanirvāṇamr̥ṣayaḥ kṣīṇakalmaṣāḥ,
Chinnadvaidā yatātmanaḥ sarvabhūtahiterataḥ. 25.
Kāmakrodha viyuktānāṃ yatīnāṃ yatacetasām,
Abhito brahmanirvāṇaṃ vartate viditātmanām. 26.

The seers whose sins have been attenuated, who are freed from doubt, whose organs are under control, who are engaged in doing good to all beings, attain absorption in Brahman.

To the monks who have control over their internal organ, who are free from desire and anger, who have known the Self, there is absorption in Brahman either way!

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

2 జూన్, 2014

576. సామః, सामः, Sāmaḥ

ఓం సామ్నే నమః | ॐ साम्ने नमः | OM Sāmne namaḥ

సామః, सामः, Sāmaḥ

వేదానాం సామవేదోఽస్మీత్యుక్తేస్సామేతి కథ్యతే సామవేదము కూడా పరమాత్ముని రూపవిశేషమే! శ్రీమద్భగవద్గీతయందు దీని ప్రమాణము...

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః ।
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥ 22 ॥

నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సున్ను, ప్రాణులలో చైతన్యమున్ను నేనే అయి యున్నాను.

वेदानां सामवेदोऽस्मीत्युक्तेस्सामेति कथ्यते / Vedānāṃ sāmavedo’smītyuktessāmeti kathyate Sāma Veda is also His opulence as told by the Lord in Śrīmad Bhagavad Gīta.
:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥ २२ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Vedānāṃ sāmavedo’smi devānāmasmi vāsavaḥ,
Indriyāṇāṃ manaścāsmi bhūtānāmasmi cetanā. 22.

Among the Vedas, I am Sāma Veda; among the gods, I am Indra. Among the organs, I am the mind, and I am the intelligence in creatures.

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

1 జూన్, 2014

575. సామగః, सामगः, Sāmagaḥ

ఓం సామగాయ నమః | ॐ सामगाय नमः | OM Sāmagāya namaḥ

యస్సామ గాయతి హరిస్సామగ ఇతీర్యతే పరమాత్మ విభూతియే అయిన సామవేదగానము చేయు సామవేదీయుడు సామగః.

यस्साम गायति हरिस्सामग इतीर्यते / Yassāma gāyati harissāmaga itīryate The Sāmvedin who sings from Sāma Veda is also His opulence and hence He is Sāmagaḥ.

:: श्रीमद्भागवते द्वादशस्कन्धे त्रयोदशोऽध्यायः ::
यं ब्रह्मा वरुनेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैर्
वेदैः सङ्गपदक्रमोपनिशदैर्गायन्ति यं सामगाः ।
ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो
यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॥ १ ॥

Śrīmad Bhāgavata - Canto 12, Chapter 13
Yaṃ brahmā varunendrarudramarutaḥ stunvanti divyaiḥ stavair
Vedaiḥ saṃgapadakramopaniśadairgāyanti yaṃ sāmagāḥ,
Dhyānāvasthitatadgatena manasā paśyanti yaṃ yogino
Yasyāntaṃ na viduḥ surāsuragaṇā devāya tasmai namaḥ. 1.

Unto that personality whom Brahma, Varuṇa, Indra, Rudra and the Maruts praise by chanting transcendental hymns and reciting the Vedas with all their corollaries, pada-kramas and Upanisads, to whom the chanters of the Sāma Veda always sing, whom the perfected yogis see within their minds after fixing themselves in trance and absorbing themselves within Him, and whose limit can never be found by any god or demon -- unto that Lord I offer my humble obeisances.