26 జూన్, 2014

600. శివః, शिवः, Śivaḥ

ఓం శివాయ నమః | ॐ शिवाय नमः | OM Śivāya namaḥ


శివః, शिवः, Śivaḥ

స్వనామస్మృతిమాత్రేణ పావయన్ శివ ఉచ్యతే తన నామమును స్మరించినంతనే స్మరించినవారిని పవిత్రులునుగా చేయువాడుగనుక ఆ పరమాత్మకు శివః అను నామము.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
చ. అలరు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ
     తులసి పవిత్రమైన గతిఁ దోయజనాభ! భవత్కథాసుధా
     కలితములైన వాక్కుల నకల్మషయుక్తుని విన్నఁ గర్ణముల్‍
     విలసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా! (551)

ఓ పద్మనాభా! ఓ రమావల్లభా! నీ పాదారవిందములపై అర్పింపబడిన ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన వాక్కులను కల్మషం లేకుండా విన్న మా చెవులుకూడా పరమ పవిత్రాలై భాసిల్లుతాయి.



स्वनामस्मृतिमात्रेण पावयन् शिव उच्यते / Svanāmasmr̥timātreṇa pāvayan śiva ucyate Because of remembrance of His name, He purifies those who have uttered His name and hence He is called Śivaḥ.

:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे द्वितीयोऽध्यायः ::
न ह्यन्तोऽन्यः शिवः पन्था विषतः संसृताविह ।
वासुदेवो भगवति भक्तियोगो यतो भवेत् ॥ ३३ ॥

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 2
Na hyanto’nyaḥ śivaḥ panthā viṣataḥ saṃsr̥tāviha,
Vāsudevo bhagavati bhaktiyogo yato bhavet. 33.

For those who are wandering in the material universe, there is no more auspicious means of deliverance than what is aimed at in the direct devotional service of Lord Kṛṣṇa.

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr̥ttātmā saṃkṣeptā kṣemakr̥cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి