3 జూన్, 2014

577. నిర్వాణం, निर्वाणं, Nirvāṇaṃ

ఓం నిర్వాణాయ నమః | ॐ निर्वाणाय नमः | OM Nirvāṇāya namaḥ


నిర్వాణం, निर्वाणं, Nirvāṇaṃ

సర్వదుఃఖోపశమన లక్షణం యత్ సనాతనం ।
పరమానన్ద రూపం తద్బ్రహ్మ నిర్వాణముచ్యతే ॥

సర్వదుఃఖములను ఉపశమింపజేసి శాంతినొందించు లక్షణమే తన పరమానంద రూపమగు తత్త్వము లేదా పరతత్త్వము గనుక ఆ దేవదేవుడు 'నిర్వాణం' అను నామము గలవాడు.

:: శ్రీమద్భగవద్గీత - కర్మసన్న్యాస యోగము ::
లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః ।
ఛిన్నద్వైదా యతాత్మనః సర్వభూతహితేరతః ॥ 25 ॥
కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ॥ 26 ॥

పాపరహితులును, సంశయవర్జితులును, ఇంద్రియ మనంబులను స్వాధీనపఱచుకొనినవారును, సమస్తప్రాణులయొక్క క్షేమమునందు ఆసక్తి గలవారును, ఋషులు బ్రహ్మ కైవల్యమును పొందుచున్నారు.

కామ క్రోధాదులు లేనివారు, మనోనిగ్రహముగలవారును, ఆత్మతత్త్వము నెఱిగినవారునగు యత్నశీలురకు బ్రహ్మసాయుజ్యము అనగా మోక్షము లేదా బ్రహ్మానందము - శరీరమున్నప్పుడును, లేనపుడును, సర్వత్ర, అంతటా వెలయుచునేయున్నది.



सर्वदुःखोपशमन लक्षणं यत् सनातनं ।
परमानन्द रूपं तद्ब्रह्म निर्वाणमुच्यते ॥

Sarvaduḥkhopaśamana lakṣaṇaṃ yat sanātanaṃ,
Paramānanda rūpaṃ tadbrahma nirvāṇamucyate.

Since He is of the nature of supreme bliss characterized by cessation of all sorrows, He is Nirvāṇaṃ.

:: श्रीमद्भगवद्गीत - कर्मसन्न्यास योगमु ::
लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैदा यतात्मनः सर्वभूतहितेरतः ॥ २५ ॥
कामक्रोध वियुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥ २६ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 5
Labhante brahmanirvāṇamr̥ṣayaḥ kṣīṇakalmaṣāḥ,
Chinnadvaidā yatātmanaḥ sarvabhūtahiterataḥ. 25.
Kāmakrodha viyuktānāṃ yatīnāṃ yatacetasām,
Abhito brahmanirvāṇaṃ vartate viditātmanām. 26.

The seers whose sins have been attenuated, who are freed from doubt, whose organs are under control, who are engaged in doing good to all beings, attain absorption in Brahman.

To the monks who have control over their internal organ, who are free from desire and anger, who have known the Self, there is absorption in Brahman either way!

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr̥cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి