12 ఫిబ్ర, 2013

101. వృషాకపిః, वृषाकपिः, Vr̥ṣākapiḥ

ఓం వృషాకపయే నమః | ॐ वृषाकपये नमः | OM Vr̥ṣākapaye namaḥ


సర్వాన్ కామాన్ వర్షతి ఇతి ధర్మస్య నామ సర్వకామ ఫలములను వర్షించునది కావున ధర్మమునకు 'వృషః' అని పేరు. కాత్ తోయాత్ భూమిం అపాత్ ఇతి కపిః - వరాహ రూపో హరిః జలమునుండి భూమిని రక్షించెను కావున వరాహమునకు, వరాహరూపుడగు హరికి 'కపిః' అని వ్యవహారము. విష్ణువు ధర్మరూపుడు అనుట ప్రసిద్ధమే. ఇట్లు వృష (ధర్మ) రూపుడును, కపి (వరాహ) రూపుడును కావున విష్ణువునకు 'వృషాకపిః' అని ప్రసిద్ధి ఏర్పడినది.

:: మహాభారతము - శాంతి పర్వము ::
కపిర్వరాహః శ్రేష్ఠశ్చ ధర్మశ్చ వృష ఉచ్యతే ।
తస్మాద్ వ్రుషాకపిం ప్రాహ కాశ్యపో మాం ప్రజాపతిః ॥


'కపి' అనగా వరాహము, శ్రేష్ఠుడు అని అర్థములు. ధర్మము 'వృషః' అనబడును. అందువలన కాశ్యప ప్రజాపతి నన్ను 'వృషాకపిః' అనెను.



Sarvān kāmān varṣati iti dharmasya nāma Dharma is called 'Vr̥ṣāḥ' as it rains (results of all) rightful desires. Kāt toyāt bhūmiṃ apāt iti kapiḥ - Varāha rūpo hariḥ He protected, lifted the earth as Varāha. So He is called 'Kapiḥ'. He is called 'Vr̥ṣākapiḥ' as He is of the form of Vr̥ṣa and Kapi.

Mahābhāratam - Śānti parva
Kapirvarāhaḥ śreṣṭhaśca dharmaśca vr̥ṣa ucyate,
Tasmād vruṣākapiṃ prāha kāśyapo māṃ prajāpatiḥ.


:: महाभारत - शान्ति पर्व ::
कपिर्वराहः श्रेष्ठश्च धर्मश्च वृष उच्यते ।
तस्माद् व्रुषाकपिं प्राह काश्यपो मां प्रजापतिः ॥


Kāśyapa Prajāpati called Me Vr̥ṣākapi as Kapi means the big boar and dharmā is said to be Vr̥ṣa.

अजस्सर्वेश्वरस्सिद्धस्सिद्धिस्सर्वादिरच्युतः ।
वृषाकपिरमेयात्मा सर्वयोगविनिस्सृतः ॥ ११ ॥

అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౧౧ ॥

Ajassarveśvarassiddhassiddhissarvādiracyutaḥ ।
Vr̥ṣākapirameyātmā sarvayogavinissr̥taḥ ॥ 11 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి