ఓం అసంమితాయ నమః | ॐ असंमिताय नमः | OM Asaṃmitāya namaḥ
సమాత్మా సమ్మితః అను శ్లోకాంకమున సమాత్మా, సమ్మితః అనియు సమాత్మా, అసమ్మితః అనియు కూడ పదచ్ఛేదము చేయు అవకాశమున్నందున, శంకర భగవత్పాదులు రెండు విధములగు విభాగములతో నిర్వచనము చేసినారు.
సమ్మితః - సమ్యక్ మితః దృశ్యములగు సకల పదార్థములును పరమాత్మునందారోపింపబడునవే కావున అట్టి సకల దృశ్య పదార్థములుగాను (సమ్యక్) లెస్సగా తానే పరిచ్చేదించ - ఆయా ప్రమాణములచే నిర్ణయించబడువాడు. మితః అనగా తెలియబడువాడు. లేదా అన్ని పదార్థ సమూహములలో, వ్యక్తులలో కలసి నిర్వైరముగా ఉండు విష్ణువు సమ్మితః అనబడును.
అసమ్మితః - న భవతి ఇతి అసమ్మితః దృశ్యమానములగు సకల పదార్థములలో ఏదియు వాస్తవమున పరమాత్ముడు కావు; కావున సకల పదార్థములుగాను లెస్సగా పరిచ్ఛిన్నుడు కాదు అనగా అమితుడు కావున అసమ్మితుడు. ఏ పదార్థముతోగాని ఏ వ్యక్తితో కానీ కలియక విడిగా ఉండువాడు.
సర్వ వ్యాపకుడగుటచే సమ్మితనామము, సర్వాతీతుతుడగుటచే అసమ్మిత నామమును సమంజసములే!
సర్వ వ్యాపకుడగుటచే సమ్మితనామము, సర్వాతీతుతుడగుటచే అసమ్మిత నామమును సమంజసములే!
:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా ।
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ॥ 4 ॥
ఈ సమస్తప్రపంచము అవ్యక్తరూపుడనగు నాచే వ్యాపించబడియున్నది. సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి. నేను వానియందుండుటలేదు (నాకవి ఆధారములు కావు).
This name and the previous one i.e., Samātmā Sammitaḥ can be split into two divine names; either as Samātmā Sammitaḥ or as Samātmā Asammitaḥ.
Sammitaḥ - Samyak Mitaḥ He who is determined by all existing entities.
Asammitaḥ - Na bhavati iti Asammitaḥ He who is measured, determined by things is mitaḥ or limited. He who is unlimited or immeasurable is Asammitaḥ.
Since Lord Viṣṇu is all pervading, the divine name Sammitaḥ and since He is beyond everything the divine name Asammitaḥ - both aptly glorify Him.
Bhagavad Gītā - Chapter 9
Mayā tatamidaṃ sarvaṃ jagadavyaktamūrtinā,
Matsthāni sarvabhūtāni na cāhaṃ teṣvavasthitaḥ. (4)
:: श्रीमद्भगवद्गीता - राजविद्या राजगुह्य योग ::
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥ ४ ॥
This whole world is pervaded by Me in My unmanifest form. All beings exist in Me, but I am not contained in them!
वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः । |
अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥ |
వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః । |
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥ |
Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ। |
Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి