14 ఫిబ్ర, 2013

103. సర్వయోగ వినిః సృతః, सर्वयोग विनिः सृतः, Sarvayoga viniḥ sr̥taḥ

ఓం సర్వయోగ వినిః సృతాయ నమః | ॐ सर्वयोग विनिः सृताय नमः | OM Sarvayoga viniḥ sr̥tāya namaḥ


సర్వేభ్యో యోగేభ్యః (సంబంధేభ్యః) వినిస్సృతః (వినిర్గతః) అన్ని విధములగు సంబంధములనుండియు వెలికి వచ్చిన వాడు. ఎవరితోను వేనితోను ఏ సంబంధము లేనివాడు.

:: పోతన భాగవతము - దశమ స్కందము ::
సీ. పరఁగ జీవునికైన బంధమోక్షము లంట వంటునే పరతత్త్వమైన నిన్ను
     నంటునే యీశ! దేహాద్యుపాధులు ననిర్వచనీయములు గాన వరుస నీకు
     జన్మంబు జన్మసంశ్రయభేదములు లేవు కావున బంధమోక్షములు లేవు
     గణుతింప ని న్నులూఖల బద్ధుఁ డనుటయు నహిముక్తుఁ డనుటయు నస్మదీయ

ఆ. బాలబుద్ధిఁ గాదె? పాషాండ ముఖర మా, ర్గములచేత నీ జగద్దితార్థ
     మైన వేదమార్గ మడఁగిపో వచ్చిన, నవతరించి నిలుపు దంబుజాక్ష!


పరమేశ్వరా! బంధమోక్షములు జీవునికూడ అంట వనగా జ్ఞానస్వరూపుడ వగు ని న్నంటునా? దేహాదులైన ఉపాధులు నిరూపించబడక పోవుటవల్ల నీకు జన్మముగాని, అందుకు కారణమైన అవిద్యకాని లేదు. ఆ కారణంవల్లనే నీకు బంధమోక్షములు లేవు. ఆలోచించగా నిన్ను రోటికి కట్టువడినవాడనీ, యమునా స్రవంతిలో కాళియ విముక్తుడనీ అనడం అవివేకం వల్లనే సుమా! నాస్తిక మార్గములచేత ప్రాచీనమగు వేదపథం అణగారిపోతున్న కాలాన జగము మేలుకోఱకు నీవు అవతరించి ధర్మమును కాపాడుతావు. 



Sarvebhyo yogebhyaḥ (saṃbaṃdhebhyaḥ) vinissr̥taḥ (vinirgataḥ) One who stands aside completely from all bondage.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 48
Sr̥jasyatho lumpasi pāsi viśvaṃ rajastamaḥ sattvaguṇaiḥ svaśaktibhiḥ,
Na badhyase tadguṇakarmabhirvā jñānātmanaste kva ca bandhahetuḥ.
(21)

:: श्रीमद्भागवत - दशमस्कन्धे, अष्टचत्वारिंशोऽध्यायः ::
सृजस्यथो लुम्पसि पासि विश्वं रजस्तमः सत्त्वगुणैः स्वशक्तिभिः ।
न बध्यसे तद्गुणकर्मभिर्वा ज्ञानात्मनस्ते क्व च बन्धहेतुः ॥ २१ ॥


You create, destroy and also maintain this universe with Your personal energies — the modes of passion, ignorance and goodness — yet You are never entangled by these modes or the activities they generate. Since You are the original source of all knowledge, what could ever cause You to be bound by illusion?

अजस्सर्वेश्वरस्सिद्धस्सिद्धिस्सर्वादिरच्युतः ।
वृषाकपिरमेयात्मा सर्वयोगविनिस्सृतः ॥ ११ ॥

అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౧౧ ॥

Ajassarveśvarassiddhassiddhissarvādiracyutaḥ ।
Vr̥ṣākapirameyātmā sarvayogavinissr̥taḥ ॥ 11 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి