ఓం సిద్ధయే నమః । ॐ सिद्धये नमः । OM Siddhaye namaḥ
నిరతిశయరూపత్వాద్ అచ్యుతస్సర్వవస్తుషు ।
సంవిత్త్వాత్ ఫలరూపత్వాద్ వా సిద్ధిరితి కీర్త్యతే ।
స్వర్గాదీనామ్ అనిత్యత్వాత్ అఫలత్వం బుధేరితమ్ ॥
పరమాత్ముడు 'సంవిద్' (కేవలాఽనుభవ) రూపుడు. సాధకునకు కలుగు అట్టి అనుభవమే అతని సాధనము వలన అతనికి కలుగవలసిన సిద్ధి. కావున పరమాత్మ 'సిద్ధి' అనబడుచున్నాడు.
లేదా పరమాత్ముడు నిరతిశయ రూపుడు - తన రూపమును మించునది మరి ఏదియు లేని ఏ రూపము కలదో అట్టి రూపము తానే యగు వాడు. అట్టి స్థితి కంటే గొప్ప స్థితి ఏదియు లేదు. కావున అట్టి సర్వోత్తమ రూపమే తాను అగు పరమాత్ముడు తానే (సర్వోత్తమమగు) 'సిద్ధి' అనదగియున్నాడు.
లేదా ఏ కర్మలకును ఏ యోగాదిసాధనములకును ఫలము పరమాత్ముడు తానే కావున అట్టి విష్ణుపరమాత్మ 'సిద్ధి' (ఫలము) అనబడుచున్నాడు. స్వర్గము మొదలగు ఫలములును వేరగునవి యున్నవికదా! అనిన వినాశమునందునవి కావున అవి సర్వోత్తమ ఫలములు అనదగినవి కాదు.
Niratiśayarūpatvād acyutassarvavastuṣu,
Saṃvittvāt phalarūpatvād vā siddhiriti kīrtyate,
Svargādīnām anityatvāt aphalatvaṃ budheritam.
निरतिशयरूपत्वाद् अच्युतस्सर्ववस्तुषु ।
संवित्त्वात् फलरूपत्वाद् वा सिद्धिरिति कीर्त्यते ।
स्वर्गादीनाम् अनित्यत्वात् अफलत्वं बुधेरितम् ॥
The Supreme Lord is of Saṃvid form or one that can only be experienced. Such ultimate experience of a Sādhaka or devotee is what which is 'Siddhi'. This is a reason why God is known by the divine name 'Siddhiḥ'.
Or His is the ultimate consciousness. There is no other supreme form than His form. Hence He being the One who is such an ultimate blissful consciousness, He himself is known as 'Siddhi'.
Or He being the final fruit of a Sādhaka’s devoted efforts, He, the Lord Viṣṇu, is 'Siddhi'. Of course, there are other sought after results like paradise; but since these are not permanent states, they are not eternally blissful.
अजस्सर्वेश्वरस्सिद्धस्सिद्धिस्सर्वादिरच्युतः । |
वृषाकपिरमेयात्मा सर्वयोगविनिस्सृतः ॥ ११ ॥ |
అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః । |
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౧౧ ॥ |
Ajassarveśvarassiddhassiddhissarvādiracyutaḥ । |
Vr̥ṣākapirameyātmā sarvayogavinissr̥taḥ ॥ 11 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి