15 ఫిబ్ర, 2013

104. వసుః, वसुः, Vasuḥ

ఓం వసవే నమః | ॐ वसवे नमः | OM Vasave namaḥ


వసంతి అస్మిన్ ఇతి ఈతని యందు సర్వభూతములు వసించును లేదా వసతి ఇతి వసుః ఈతడు సర్వభూతములయందును వసించును. లేదా భగవద్గీత విభూతి యోగమునందు భగవద్వచనముచే చెప్పబడిన పావకుడనే (అగ్ని) వసువు.

:: భగవద్గీత - ఆత్మసంయమ యోగము ::
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 30 ॥


ఎవడు సమస్తభూతములందును నన్ను చూచుచున్నాడో, మఱియు నన్ను సమస్తభూతములందును గాంచుచున్నాడో అట్టివానికి నేను కనబడకపోను, నాకతడు కనబడకపోడు.

:: భగవద్గీత - విభూతి యోగము ::
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ ।
వసూనాం పావకశ్చాస్మి మేరుశ్శిఖరిణామహమ్ ॥ 23 ॥


నేను రుద్రులలో శంకరుడనువాడను, యక్షులలోను, రాక్షసులలోను కుబేరుడను, వసువులలో అగ్నియు, పర్వతములలో మేరువును అయియున్నాను.

(అష్టవసువులు: ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, పావకుడు / అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు.)



Vasanti asmin iti / वसंति अस्मिन् इति All beings abide in Him therefore Vasuḥ or Vasati iti vasuḥ / वसति इति वसुः He too abides in them; so He is Vasuḥ. Or as Lord has described himself in Chapter 10 of Bhagavad Gītā, He is Pāvaka among the eight Vasus.

Bhagavad Gītā - Chapter 6
Yo māṃ paśyati sarvatra sarvaṃ ca mayi paśyati,
Tasyāhaṃ na praṇaśyāmi sa ca me na praṇaśyati.
(30)

:: श्रीमद्भगवद्गीता  - आत्मसंयम योग ::
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ३० ॥


One who sees Me in everything and sees all things in Me - I do not go out of vision and he also is not lost to My vision.

Bhagavad Gītā - Chapter 10
Rudrāṇāṃ śaṃkaraścāsmi vitteśo yakṣarakṣasām,
Vvasūnāṃ pāvakaścāsmi meruśśikhariṇāmaham.
(23)

:: श्रीमद्भगवद्गीता  - विभूति योग ::
रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरुश्शिखरिणामहम् ॥ २३ ॥


Among the Rudrās I am Śankara, among the Yakṣās and goblins I am Kubera. Among the Vasus, I am Fire and among the mountains I am Meru.

वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः ।
अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥

వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః ।
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥

Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ।
Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి