ఓం అమేయాత్మనే నమః | ॐ अमेयात्मने नमः | OM Ameyātmane namaḥ
అమేయః (ఇయా నితి పరిచ్ఛేత్తుం న శక్యః) ఆత్మా యస్య సః అమేయము (ఇంత అని పరిమితి నిర్ణయించుటకు శక్యము కానిది) అగు ఆత్మ ఎవనికి కలదో అట్టివాడు. అట్టివాడు శ్రీ విష్ణువు.
:: పోతన భాగవతము - చతుర్థ స్కందము, ధ్రువోపాఖ్యానము ::
క. కొందరు స్వభావ మందురు, కొందరు కర్మం బటండ్రు, కొందరు కాలం
బందురు, కొందరు దైవం, బందురు, కొంద ఱొగిఁ గామ మండ్రు మహాత్మా!
వ. ఇట్టు లవ్యక్తరూపుండును, నప్రమేయుండును, నానాశక్త్యుదయ హేతుభూతుండును నైన భగవంతుడు సేయు కార్యంబుల బ్రహ్మరుద్రాదు లెరుంగరన నతని తత్త్వంబు నెవ్వరెరుంగ నొపుదురు?
ఆయనను కొందరు "స్వభావం" అంటారు. కొందరు "కర్మం" అంటారు. కొందరు "కాలం" అంటారు. కొందరు "దైవం" అంటారు. మరి కొందరు "కామం" అని కూడా అంటారు. నిర్గుణుడు, అప్రమేయుడు అనేక శక్తులకు హేతుభూతుడు అయిన భగవంతుడు చేసే పనులను బ్రహ్మరుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక అతని తత్త్వాన్ని ఎవరు తెలుసుకోగలరు?
Ameyaḥ (iyā niti paricchettuṃ na śakyaḥ) ātmā yasya saḥ He whose ātmā (nature) cannot be measured (determined) as of what extent by division.
Śrīmad Bhāgavata - Canto 4, Chapter 11
Avyaktasyāprameyasya nānāśaktyudayasya ca,
na vai cikīrṣitaṃ tāta ko vedāthambhavam. (23)
:: श्रीमद्भागवत - चतुर्थस्कन्धे, एकादशोऽध्यायः ::
अव्यक्तस्याप्रमेयस्य नानाशक्त्युदयस्य च ।
न वै चिकीर्षितं तात को वेदाथम्भवम् ॥ २३ ॥
The Absolute Truth, Transcendence, is never subject to the understanding of imperfect sensory endeavor, nor is He subject to direct experience. He is the master of varieties of energies, like the full material energy, and no one can understand His plans or actions; therefore it should be concluded that although He is the original cause of all causes, no one can know Him by mental speculation.
अजस्सर्वेश्वरस्सिद्धस्सिद्धिस्सर्वादिरच्युतः । |
वृषाकपिरमेयात्मा सर्वयोगविनिस्सृतः ॥ ११ ॥ |
అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః । |
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౧౧ ॥ |
Ajassarveśvarassiddhassiddhissarvādiracyutaḥ । |
Vr̥ṣākapirameyātmā sarvayogavinissr̥taḥ ॥ 11 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి