28 ఫిబ్ర, 2013

117. విశ్వయోనిః, विश्वयोनिः, Viśvayoniḥ

ఓం విశ్వయోనయే నమః | ॐ विश्वयोनये नमः | OM Viśvayonaye namaḥ


విశ్వస్య కారణత్వాత్స విశ్వయోని రితీర్యతే లోకములకు యోని లేదా మూలకారణము లేదా ఆశ్రయస్థానము. విశ్వమునకు కారణమైనవాడగుటచే విష్ణువు విశ్వయోనిః అని పిలువబడును.

:: భగవద్గీత - గుణత్రయ విభాగయోగము ::
మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్ ।
సమ్భవస్సర్వభూతానాం తతో భవతి భారత ॥ 3 ॥

అర్జునా! గొప్పదైన మూల ప్రకృతి (మాయ) నా యొక్క సర్వభూతోత్పత్తిస్థానము. అద్దానియందు నేను గర్భకారణమైన చైతన్యరూపమగు బీజము నుంచుచున్నాను. దాని వలన సమస్త ప్రాణులయొక్క ఉత్పత్తి సంభవించుచున్నది.



Viśvasya kāraṇatvātsa viśvayoni ritīryate / विश्वस्य कारणत्वात्स विश्वयोनि रितीर्यते One who is the cause of the worlds. As He is the cause of the universe He is called Viśvayoniḥ.

Bhagavad Gītā - Chapter 14
Mama yonirmahadbrahma tasmingarbhaṃ dadhāmyaham,
Sambhavassarvabhūtānāṃ tato bhavati bhārata. (3)

:: श्रीमद्भगवद्गीता - गुणत्रय विभागयोग ::
मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् ।
सम्भवस्सर्वभूतानां ततो भवति भारत ॥ ३ ॥

My womb is the great sustainer. In that I place the seed. From that, O scion of Bharata dynasty, occurs the birth of all things.

रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः ।
अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః ।
అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥

Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ।
Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి