ఓం అమోఘాయ నమః | ॐ अमोघाय नमः | OM Amoghāya namaḥ
మోఘః న భవతి మోఘము అనగా వ్యర్థము. మోఘము కాని వాడు అమోఘః. పూజించబడువాడును, స్తుతించబడువాడును, లెస్సగా స్మరించబడువాడును అగుచు, పూజించిన, స్తుతించిన, సంస్మరించిన వారికి సర్వ ఫలములు ఇచ్చును. భక్తుల పూజను, స్తుతిని, సంస్మరణమును వ్యర్థము కానీయడు కావున అమోఘుడు.
లేదా సత్యః (సంకల్పః) యస్య సః సత్యమగు సంకల్పము ఎవనికి కలదో అట్టి వాడూ అమోఘుడు.
:: ఛాందోగ్యోపనిషత్ - అష్టమ ప్రపాఠకః, సప్తమః ఖండః ::
య ఆత్మాఽపహతపాప్మా విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోఽపిపాస స్సత్య కామ స్సత్యసఙ్కల్ప స్సోఽన్వేష్ట వ్యస్స విజిజ్ఞాసితవ్య స్స సర్వాంశ్చ లోకా నా ప్నోతి సర్వాంశ్చ కామా న్య స్తమాత్మాన మనువిద్య విజానాతీతి హ ప్రజాపతి రువాచ ॥ 1 ॥
ఆత్మ పాపరహితమైనది, ముసలితనము లేనిది, మరణము లేనిది, దుఃఖము లేనిది, ఆకలి దప్పికలు లేనిది. ఆయాత్మ సత్యకామమును, సత్య సంకల్పమును అయియున్నది. ఇట్టి ఆత్మను శ్రద్ధగా వెదకి తెలిసికొనవలెను. ఈ రీతిగా తెలిసికొన్నవాడు అన్ని లోకములను, అన్ని కోరికలను పొందుచున్నాడని ప్రజాపతి చెప్పెను.
Moghaḥ na bhavati When worshiped, praised or remembered, dowers one with the fruition of every desire. Does not let such worship etc., go in vain and hence He is Amoghaḥ.
Satyaḥ (saṃkalpaḥ) yasya saḥ His will is always unobstructed in His actions.
Chāndogyopaniṣat - Part VIII, Chapter VII
Ya ātmā’pahatapāpmā vijaro vimr̥tyurviśoko vijighatso’pipāsa ssatya kāma ssatyasaṅkalpa sso’nveṣṭa vyassa vijijñāsitavya ssa sarvāṃśca lokā nā pnoti sarvāṃśca kāmā nya stamātmāna manuvidya vijānātīti ha prajāpati ruvāca. (1)
:: छांदोग्योपनिषत् - अष्टम प्रपाठकः, सप्तमः खंडः ::
य आत्माऽपहतपाप्मा विजरो विमृत्युर्विशोको विजिघत्सोऽपिपास स्सत्य काम स्सत्यसङ्कल्प स्सोऽन्वेष्ट व्यस्स विजिज्ञासितव्य स्स सर्वांश्च लोका ना प्नोति सर्वांश्च कामा न्य स्तमात्मान मनुविद्य विजानातीति ह प्रजापति रुवाच ॥ १ ॥
The ātmā or soul which is free from sin, free from old age, free from death, free from grief, free from hunger, free from thirst, whose desires come true and whose thoughts come true - That it is which should be searched out. That it is which one should desire to understand. He who has known this Self from the scriptures and a teacher and understood It, obtains all the worlds and all desires.
वसुर्वसुमनास्सत्यस्समात्मा सम्मितस्समः । |
अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॥ १२ ॥ |
వసుర్వసుమనాస్సత్యస్సమాత్మా సమ్మితస్సమః । |
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨ ॥ |
Vasurvasumanāssatyassamātmā sammitassamaḥ। |
Amoghaḥ puṇḍarīkākṣo vr̥ṣakarmā vr̥ṣākr̥tiḥ ॥ 12 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి