ఓం ఆదిదేవాయ నమః | ॐ आदिदेवाय नमः | OM Ādidevāya namaḥ
ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ |
ఆదీయంతే సర్వభూతాన్యనేనేత్యాదిరచ్యుతః ।
దేవశ్చాసావితి విష్ణురాదిదేవ ఇతీర్యతే ॥
ప్రళయాది సమయములయందు సర్వభూతములనూ తనలోనికి గ్రహించుతాడుగనుక అచ్యుతుడు 'ఆదిః' అనబడును. ఈ విష్ణుడు అట్లు ఆదియగు అనగా సర్వభూతములను తనలోనికి గ్రహించువాడగు దేవుడుగనుక ఆదిదేవః.
:: పోతన భాగవతము ద్వాదశ స్కంధము ::
సీ. | సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు నఖిలలోకాధారు, నాదిదేవుఁ |
బరమదయార సోద్భాసితుఁ ద్రిదశాభి వందితపాదాబ్జు వనధీశయను | |
నాశ్రితమందారు నాద్యంతశూన్యుని వేదాంతవేద్యుని విశ్వమయునిఁ | |
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని సంఖచక్రగదాశిశార్ఙ్గధరుని | |
తే. | శోభనాకారుఁ బీతాంబరాభిరాము, రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ |
బుండరీకాక్షు మహనీయపుణ్యదేహుఁ దలఁతు నుతియింతు దేవకీతనయునెపుడు. (50) |
గుణములకన్నింటికీ అతీతమైనవాడునూ, సర్వమూ తెలిసినవాడునూ, అన్నింటికీ ఈశ్వరుడైనవాడునూ, సర్వలోకాలకూ ఆధారమైనవాడునూ, ఆదిదేవుడునూ, గొప్పదైన కరుణారసంచేత ప్రకాశించేవాడునూ, దేవతల వందనాలను అందుకునే పాదాబ్జాలు కలవాడునూ, సముద్రంలో శయనించేవాడునూ, ఆశ్రయించిన వారి పాలిటికి కల్పవృక్షంవంటివాడునూ, ఆదీ-అంతమూ అనేవి లేనివాడునూ, వేదాంతంచేత తెలియదగినవాడునూ, విశ్వమంతా నిండిఉన్నవాడునూ, వక్షస్థలం మీద కౌస్తుభమూ శ్రీవత్సమూ కలవాడునూ, శంఖమూ, చక్రమూ, గదా, ఖడ్గమూ, శార్ఙ్గం అనే ధనుస్సు ధరించి ఉండేవాడునూ, మంగళకరమైన రూపం కలవాడునూ, పీతాంబరము ధరించి మనోహరంగా కనిపించేవాడునూ, రత్నాలచేత ప్రకాశించే కిరీటంతో వెలుగులు నింపేవాడునూ, పద్మపత్రాలవంటి నేత్రాలు కలవాడునూ, గొప్పదైన పుణ్యవంతమైన శరీరం కలవాడునూ అయిన దేవకీనందనుని స్మరించి యెల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను.
334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ
आदीयंते सर्वभूतान्यनेनेत्यादिरच्युतः ।
देवश्चासाविति विष्णुरादिदेव इतीर्यते ॥
Ādīyante sarvabhūtānyanenetyādiracyutaḥ,
Devaścāsāviti viṣṇurādideva itīryate.
During the times of dissolution, all the beings are drawn into Lord Acyuta; hence He is 'Ādiḥ'. As Lord Viṣṇu is the Deva who draws all beings to Himself, He is called Ādidevaḥ.
::श्रीमद्भागवते एकादशस्कन्धे चतुर्थोऽध्यायह् ::
भूतैर्यदा पङ्चभिरात्मसृष्टैः पुरं विराजं विरचय्य तस्मिन् ।
स्वांशेन विष्टः पुरुशाभिधानम् अवाप नारायण आदिदेवः ॥
Śrīmad Bhāgavata - Canto 11, Chapter 4
Bhūtairyadā paṅcabhirātmasr̥ṣṭaiḥ puraṃ virājaṃ viracayya tasmin,
Svāṃśena viṣṭaḥ puruśābhidhānam avāpa nārāyaṇa ādidevaḥ.
When the primeval Lord Nārāyaṇa created His universal body out of the five elements produced from Himself and then entered within that universal body by His own plenary portion, He thus became known as the Puruṣa.
334. ఆదిదేవః, आदिदेवः, Ādidevaḥ
गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः । |
आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥ |
గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః । |
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥ |
Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ, |
Ādidevo mahādevo deveśo devabhr̥dguruḥ ॥ 52 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి