31 మార్చి, 2014

513. జీవః, जीवः, Jīvaḥ

ఓం జీవాయ నమః | ॐ जीवाय नमः | OM Jīvāya namaḥ


జీవః, जीवः, Jīvaḥ

ప్రాణాన్ క్షేత్రజ్ఞరూపేణ ధారయన్ జీవ ఉచ్యతే ప్రాణములను నిలుపువాడు అను అర్థమున 'జీవ' శబ్దము ఏర్పడును. పరమాత్ముడే క్షేత్రజ్ఞ రూపమున దేహమునందలి ప్రాణములను నిలుపి ఉంచునుగనుక జీవః.

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః ।
మనష్షష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ॥ 7 ॥

నా యొక్క అనాదీ, నిత్యమగు అంశయే జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్‍, చక్షు, శ్శ్రోత, జిహ్వ, ఘ్రాణ, మనంబులను ఆరు (ఐదు జ్ఞానేంద్రియములు + మనస్సు) ఇంద్రియములను ఆకర్షించుచున్నది.



प्राणान् क्षेत्रज्ञरूपेण धारयन् जीव उच्यते / Prāṇān kṣetrajñarūpeṇa dhārayan jīva ucyate Supporting the Prāṇa or life in the form of kṣetrajña i.e., the in dweller, He is called Jīvaḥ.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::
ममैवांशो जीवलोके जीवभूतस्सनातनः ।
मनष्षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥ ७ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15
Mamaivāṃśo jīvaloke jīvabhūtassanātanaḥ,
Manaṣṣaṣṭhānīndriyāṇi prakr̥tisthāni karṣati. 7.

It is verily a part of Mine which, becoming the eternal individual soul in the region of living beings, draws the organs which have the mind as their sixth and which abide in Nature.

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి