22 మార్చి, 2014

504. అమృతపః, अमृतपः, Amr̥tapaḥ

ఓం అమృతపాయ నమః | ॐ अमृतपाय नमः | OM Amr̥tapāya namaḥ


అమృతపః, अमृतपः, Amr̥tapaḥ

అసురైర్హ్రియమాణ మమృతం సంరక్షదేవతాః ।
పాయయిత్వా స్వయమపి యోఽపిబత్పరమేశ్వరః ।
సచామృతప ఇత్యుక్తః వేదార్థజ్ఞానిభిర్బుధైః ॥

స్వాత్మానందము అను అమృత రసమును త్రావువాడుగా పరమాత్ముడు 'అమృతపః' అనబడును. లేదా క్షీరసాగరమథనమున జనించి అసురులచే అపహరింపబడుచుండిన అమృతమును రక్షించి దానిని దేవతలచే త్రావించి తానునూ త్రావినందున అమృతపః.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
క.   ఒక్క బొట్టుఁ జిక్క కుండఁగ, సకల సుధారసము నమర సంఘంబులకుం
      బ్రకటించి పోసి హరి దన, సుకరాకృతిఁ దాల్చె నసుర శూరులు బెడగన్ (324)
మ. అమరుల్ రక్కసులుం బ్రయాసబలసత్త్వార్థాభిమానణ్బులన్
      సములై లబ్దవికల్పులైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర
      య్యమరారుల్ బహుదుఃఖముల్ గనిరి తా మత్యంత దోర్గర్వులై;
      కమలాక్షున్ శరణంబు వేఁడని జనుల్ గల్యాణ సంయుక్తులే? (325)

విష్ణువు ఒక్క చుక్క కూడా మిగలకుండా అమృతమంతా అమరసమూహానికే బాహాటంగా పోసినాడు. మోహినీ రూపాన్ని వదలి తన నిజ స్వరూపాన్ని ధరించినాడు. ఇదంతా చూసి రాక్షస వీరులు దుఃఖపడినారు.

దేవతలూ సరిసమానమైన రాక్షసులూ పూనికా, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ కలిగినవారే. కానీ వారికి రెండు విధములైన ఫలితములు ప్రాప్తించినాయి. దేవతలు శుభాలను పొందినారు. విష్ణువును శరణు వేడని వారు శుభాలను పొందగలరా?



असुरैर्ह्रियमाण ममृतं संरक्षदेवताः ।
पाययित्वा स्वयमपि योऽपिबत्परमेश्वरः ।
सचामृतप इत्युक्तः वेदार्थज्ञानिभिर्बुधैः ॥

Asurairhriyamāṇa mamr̥taṃ saṃrakṣadevatāḥ,
Pāyayitvā svayamapi yo’pibatparameśvaraḥ,
Sacāmr̥tapa ityuktaḥ vedārthajñānibhirbudhaiḥ.

One who drinks the Amr̥ta (nectar) of immortal Bliss which is of One's own self. Or One who recovered the Amr̥ta from the wicked and made the Devas, including Himself, partake of it.

:: श्रीमद्भागवते अष्टम स्कन्धे नवमोऽध्यायः ॥
एवं सुरासुरगणाः समदेशकाल
    हेत्वर्थकर्ममतयोऽपि फले विकल्पाः ।
तत्रामृतं सुरगणाः फलमञ्जसापुर्‌
    यत्पादपङ्कजरजः श्रयणान्न दैत्याः ॥२८ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 9
Evaṃ surāsuragaṇāḥ samadeśakāla
Hetvarthakarmamatayo’pi phale vikalpāḥ,
Tatrāmr̥taṃ suragaṇāḥ phalamañjasāpurˈ
Yatpādapaṅkajarajaḥ śrayaṇānna daityāḥ.28.

The place, the time, the cause, the purpose, the activity and the ambition were all the same for both the gods and the demons, but the gods achieved one result and the demons another. Because the gods are always under the shelter of the dust of the Lord's lotus feet, they could very easily drink the nectar and get its result. The demons, however, not having sought shelter at the lotus feet of the Lord, were unable to achieve the result they desired.

सोमपोऽमृतस्सोमः पुरुजित्पुरुसत्तमः ।
विनयो जयस्सत्यसंधो दाशार्ह स्सात्वतां पतिः ॥ ५४ ॥

సోమపోఽమృతస్సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయస్సత్యసంధో దాశార్హ స్సాత్వతాం పతిః ॥ 54 ॥

Somapo’mr̥tassomaḥ purujitpurusattamaḥ,
Vinayo jayassatyasaṃdho dāśārha ssātvatāṃ patiḥ ॥ 54 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి