3 మే, 2014

546. చక్రగదాధరః, चक्रगदाधरः, Cakragadādharaḥ

ఓం చక్రగదాధరాయ నమః | ॐ चक्रगदाधराय नमः | OM Cakragadādharāya namaḥ


చక్రగదాధరః, चक्रगदाधरः, Cakragadādharaḥ

మనస్తత్త్వాత్మకం చక్రం బుద్ధితత్త్వాత్మికాం గదామ్ ।
ధారయన్ లోకరక్షకార్థముక్తశ్చక్రగదాధరః ॥

చక్రమును, గదను ధరించువాడు. మనస్తత్త్వరూపమగు చక్రమును, బుద్ధి తత్త్వమగు గదను లోక రక్షార్థము ధరించుచున్నందున విష్ణువు చక్రగదాధరుడని చెప్పబడుచున్నాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
వ. మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదర కరసరోరుహంబందు రాజహంస రుచిరంబయిన పాంచజన్యంబును, నరాతిభట శోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారణి యగు కౌమోదకియును, బంధురసుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకారనాద విరాజితంబైన వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వంబైన కౌస్తుభ మణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు, వెండియు భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్య మంగళ విగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయమండిత ముకురోపమాన నిర్మల గండ మండలంబును, సంతత శ్రీనివాసంబు లయిన లోచన పంకజంబులును గలిగి లాలితభ్రూలతాజుష్టంబును, మధుకర సమాన రుచి చికుర విరాజితంబును నైన ముఖకమలంబును ధ్యానంబు గావింపవలయు, మఱియు శరణాగతుల కభయ ప్రదంబు లగుచునెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁప వలయు. (937)

శత్రుసమూహాలకు సహింపరాని వేయి అంచుల సుదర్శన చక్రాన్నీ, సరోజనాభుని కరసరోజంలో రాజహంసవలె విరాజిల్లే పాఞ్చజన్య శంఖాన్నీ, నిశాచరుల నెత్తురు చారికలతోకూడి దామోదరునికి ఆమోదదాయకమైన కౌమోదకీగదనూ, హృదయంలో పదిలపరచుకోవాలి.

గప్పుమంటున్న క్రొంగ్రొత్త నెత్తావుల గుబుల్కొన్న కమ్మ తెమ్మరల పిలుపులందుకొని సంగీతాలు పాడే కోడె తుమ్మెదలతో కూడిన వైజయంతీ వనమాలికనూ, అఖిలలోకాలకూ ఆత్మస్వరూపమైన కౌస్తుభమణినీ, వైకుంఠనాథుని కంఠసీమలో వేర్వేరుగా ధ్యానించాలి.

భక్త రక్షణ పరాయణుడైన నారాయణుని దివ్య మంగళ స్వరూపానికి అనురూపమై మకరకుండలాల మణికాంతులు జాలువారే చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైన అందాల కందమ్ములతో వంపులు తిరిగిన సొంపైన కనుబొమలతో, ఎలదేటి కదుపులవంటి నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముకుందుని ముఖకమలాన్ని ధ్యానం చేయాలి. ఆర్తులై శరణాగతులైన భక్తులకు అభయాన్ని ఇచ్చే చక్రపాణి పాణిపద్మాలను హృదయపద్మములో భావన చేయాలి.



मनस्तत्त्वात्मकं चक्रं बुद्धितत्त्वात्मिकां गदाम् ।
धारयन् लोकरक्षकार्थमुक्तश्चक्रगदाधरः ॥

Manastattvātmakaṃ cakraṃ buddhitattvātmikāṃ gadām,
Dhārayan lokarakṣakārthamuktaścakragadādharaḥ.

Cakram, the discuss is of the nature of manastattva; gadā the club is of the nature of the buddhi tattva. He is the bearer of the cakra and the gadā for protecting the world; so He is Cakragadādharaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे अष्टाविंशोऽध्यायः ::
बाहूंश्च मन्दरगिरेः परिवर्तनेन निर्णिक्तबाहुवलयानधिलोकपालान् ।
सञ्चिन्तयेद्दससतारमसह्यतेजः सङ्खं च तत्करसरोरुहराजहंसम् ॥ २७ ॥
कौमोदकीं भगवतो दयितां स्मरेत दिग्धमरातिभटशोणितकर्दमेन ।
मलां मधुव्रतवरूथगिरोपघुष्टां चैत्यस्य तत्त्वममलं मणिमस्य कण्ठे ॥ २८ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 28
Bāhūṃśca mandaragireḥ parivartanena nirṇiktabāhuvalayānadhilokapālān,
Sañcintayeddasasatāramasahyatejaḥ saṅkhaṃ ca tatkarasaroruharājahaṃsam. 27.
Kaumodakīṃ bhagavato dayitāṃ smareta digdhamarātibhaṭaśoṇitakardamena,
Malāṃ madhuvratavarūthagiropaghuṣṭāṃ caityasya tattvamamalaṃ maṇimasya kaṇṭhe. 28.

The yogi should further meditate upon the Lord's four arms, which are the source of all the powers of the gods who control the various functions of material nature. Then the yogi should concentrate on the polished ornaments, which were burnished by Mount Mandara as it revolved. He should also duly contemplate the Lord's discus, the Sudarśana cakra, which contains one thousand spokes and a dazzling luster, as well as the conch, which looks like a swan in His lotuslike palm.

The yogi should meditate upon His club, which is named Kaumodaki and is very dear to Him. This club smashes the demons, who are always inimical soldiers, and is smeared with their blood. One should also concentrate on the nice garland on the neck of the Lord, which is always surrounded by bumblebees, with their nice buzzing sound, and one should meditate upon the pearl necklace on the Lord's neck, which is considered to represent the pure living entities who are always engaged in His service.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి