1 మే, 2014

544. గహనః, गहनः, Gahanaḥ

ఓం గహనాయ నమః | ॐ गहनाय नमः | OM Gahanāya namaḥ


గహనః, गहनः, Gahanaḥ

శ్రీ విష్ణుః దుష్ప్రవేశ్యత్వాదవస్థాత్రితయస్య వా ।
సాక్షిభావావయోర్వా గహనః పరికీర్త్యతే ॥

అభేద్యుడు. ఈతని తత్త్వమును ఎరుగుట అంత సులభము కానివాడు గహనుడు. జాగృత్‍, స్వప్న, సుషుప్తి అను మూడు దశలలో భావాఽభావములకు - అవి అనుభవములోనుండు స్థితులకూ, అనుభవములోనుండని స్థితులకును కూడ సాక్షిగానుండువాడు కావున ప్రత్యగాత్మస్వరూపుడుగా తురీయావస్థయందున్న ఈతని తత్త్వమును ఎరుగుట అంత సులభము కానివాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
వ. మఱియుఁ జిత్తం బహంకార మమకార రూపాభిమాన జాతంబులగు కామలోభాది కలుషవ్రాతంబుల చేత నెప్పుడు విముక్తంబై పరిశుద్ధం బగు నప్పుడు సుఖదుఃఖ వివర్జితంబు నేకరూపంబునై ప్రకృతికంటెఁ బరుండును బరమపురుషుండును నిర్భేదనుండును స్వయంజ్యోతియు సూక్ష్మస్వరూపుండను నితరవస్త్వంత రాపరిచ్ఛిన్నుండును నుదాసీనుండును నైన పరమాత్మునిం దన్మయంబును హతౌజస్కంబునైన ప్రపంచంబును ఙ్ఞాన వైరాగ్య భక్తి యుక్తంబగు మనంబుచేఁ బొడగాంచి యోగిజనులు పరతత్త్వ సిద్ధి కొఱకు నిఖిలాత్మకుండైన నారాయణునందు సంయుజ్య మానంబయిన భక్తిభావంబు వలన నుదయించిన మార్గంబునకు నితరమార్గంబులు సరిగావండ్రు... (874)

"నేను నాది" అనే అహంకార మమకార రూపమైన అభిమానం వల్ల కామమూ, క్రోధమూ, లోభము మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తం వానికి లోనుగాకుండా వానినుండి విడివడినప్పుడు పరిశుద్ధమవుతుంది. చిత్తము పరిశుద్ధమైనప్పుడు సుఖమూ, దుఃఖమూ అనేవి ఉండక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు.

ఆ పరమాత్మ ప్రకృతికంటే అతీతుడు; అభేద్యుడు; స్వయంప్రకాశుడు; సూక్ష్మస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు. ఉదాసీనుడు. అటువంటి పరమాత్మనూ, ఆ పరమాత్మ తేజస్సువల్ల నిస్తేజమైన ప్రపంచాన్నీ యోగివరేణ్యులు భక్తిజ్ఞాన వైరాగ్యయుక్తమైన చిత్తంతో దర్శించినవారై మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునియందు సమర్పింపబడిన భక్తి మార్గమే ఉత్తమోత్తమ మైనదనీ, తక్కిన మార్గాలు దానికి సాటిరావనీ చాటిచెప్పారు...

:: శ్రీమద్భాగవతే చతుర్థ స్కన్ధే త్రింశోఽధ్యాయః ::
నమో నమః క్లేశవినాశనాయ నిరూపితోదారగుణాహ్వయాయ ।
మనోవచోవేగపురోజవాయ సర్వాక్షమార్గైరగతాధ్వనే నమః ॥ 22 ॥

382. గహనః, गहनः, Gahanaḥ



श्री विष्णुः दुष्प्रवेश्यत्वादवस्थात्रितयस्य वा ।
साक्षिभावावयोर्वा गहनः परिकीर्त्यते ॥ 

Śrī viṣṇuḥ duṣpraveśyatvādavasthātritayasya vā,
Sākṣibhāvāvayorvā gahanaḥ parikīrtyate.

One who is impenetrable to the unqualified. In other words, the One who cannot easily be  comprehended. He is witness to the three states of consciousness being free of them viz., being awake, sleeping and the state of deep sleep.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे त्रिंशोऽध्यायः ::
नमो नमः क्लेशविनाशनाय निरूपितोदारगुणाह्वयाय ।
मनोवचोवेगपुरोजवाय सर्वाक्षमार्गैरगताध्वने नमः ॥ २२ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 30
Namo namaḥ kleśavināśanāya nirūpitodāraguṇāhvayāya,
Manovacovegapurojavāya sarvākṣamārgairagatādhvane namaḥ. 22.

Dear Lord, You relieve all kinds of material distress. Your magnanimous transcendental qualities and holy name are all auspicious. This is established. You can go faster than the speed of mind and words. You cannot be perceived by material senses. We therefore offer You respectful obeisances again and again.

382. గహనః, गहनः, Gahanaḥ

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి