ఓం సర్వదృగ్వ్యాసాయ నమః | ॐ सर्वदृग्व्यासाय नमः | OM Sarvadr̥gvyāsāya namaḥ
సర్వదృగ్వ్యాసః, सर्वदृग्व्यासः, Sarvadr̥gvyāsaḥ |
విస్తారకృత్ సర్వదృశాం సర్వదృగ్వ్యాస ఉచ్యతే ।
సర్వాఽస్య సాచ దృక్చేతి విష్ణుస్సర్వదృగుచ్యతే ॥
సర్వాకారజ్ఞానరూపః దృక్ త్వాత్ సర్వస్య సర్వదృక్ ।
ఋగ్వేదాదివిభాగేన వ్యస్తో వేదశ్చతుర్విధః ॥
ఆద్య ఏకవింశతిధా సామవేదస్సహస్రధా ।
యజుర్వేద ఏకోత్తరశతధా శ్రూయతే కృతః ॥
అథర్వవేదో నవధా శాఖాభేదేన వై కృతః ।
అన్యాని చ పురాణాని వ్యస్తానేమవనేనహి ॥
దృక్ అనగా చూడబడి, ఎరుగబడెడి జ్ఞానము. వ్యాపింపజేయువాడు వ్యాసః. సర్వ విధములగు జ్ఞానమును విస్తారము చేయువాడు లేదా విస్తరింపజేయువాడు సర్వదృగ్వ్యాసః.
సాధన భూతమగు దేని సాయముచే ఏ వస్తువు కానీ విషయము కానీ చూడ, తెలియ బడునో అది దృక్ అనగా దృష్టి. సర్వదృక్ అనగా సర్వరూపములును గల జ్ఞానము. ప్రతియొకనికి సంబంధించిన దృష్టి అనదగినది వేదమే! అట్టి సర్వదృక్ అగు వేదమును విభజించినవాడు సర్వదృగ్వ్యాసః.
ఋగ్వేదాది విభాగముతో వేదము నాలుగుగా విభాగించబడినది. అందును మొదటి ఋగ్వేదము ఇరువదియొక విధములుగా చేయబడినది. రెండవది అయిన యజుర్వేదము నూటయొక విధములుగా చేయబడినది. సామవేదము వేయి విధములుగా, అథర్వ వేదము తొమ్మిది విధములుగా విభాగింపబడినవి. ఇట్లు వేదములు అన్నియు శాఖా భేదముచే విభజించబడినవి. ఈ విధముగానే ఇతరములగు పురాణములును ఈతనిచే విభజించబడినవి.
विस्तारकृत् सर्वदृशां सर्वदृग्व्यास उच्यते ।
सर्वाऽस्य साच दृक्चेति विष्णुस्सर्वदृगुच्यते ॥
सर्वाकारज्ञानरूपः दृक् त्वात् सर्वस्य सर्वदृक् ।
ऋग्वेदादिविभागेन व्यस्तो वेदश्चतुर्विधः ॥
आद्य एकविंशतिधा सामवेदस्सहस्रधा ।
यजुर्वेद एकोत्तरशतधा श्रूयते कृतः ॥
अथर्ववेदो नवधा शाखाभेदेन वै कृतः ।
अन्यानि च पुराणानि व्यस्तानेमवनेनहि ॥
Vistārakr̥t sarvadr̥śāṃ sarvadr̥gvyāsa ucyate,
Sarvā’sya sāca dr̥kceti viṣṇussarvadr̥gucyate.
Sarvākārajñānarūpaḥ dr̥k tvāt sarvasya sarvadr̥k,
R̥gvedādivibhāgena vyasto vedaścaturvidhaḥ.
Ādya ekaviṃśatidhā sāmavedassahasradhā,
Yajurveda ekottaraśatadhā śrūyate kr̥taḥ.
Atharvavedo navadhā śākhābhedena vai kr̥taḥ,
Anyāni ca purāṇāni vyastānemavanenahi.
As Vyāsa He expounded at length - all knowledge and hence Sarvadr̥gvyāsaḥ.
Sarvadr̥k means jñāna or the knowledge that encompasses every aspect. What other jñāna is worth calling Sarvadr̥k but the Veda?
Sarvadr̥k means He sees everything. Vyāsa the classifier. Vedas were classified fourfold in the forms of R̥k and others. The first of them, R̥g Veda was made of twenty one parts. The second Yajur Veda was made of one thousand and one parts. The Sāma Veda was of a thousand parts and the Atharva Veda in nine branches. And also other purāṇas were made by him, vyastāni. So he was called Vyāsa. In that aspect, the Lord too is called Vyāsa i.e., Brahmā.
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः । |
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥ |
సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః । |
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥ |
Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ, |
Divispr̥k sarvadr̥g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి