24 మే, 2014

567. సుధన్వా, सुधन्वा, Sudhanvā

ఓం సుధన్వనే నమః | ॐ सुधन्वने नमः | OM Sudhanvane namaḥ


సుధన్వా, सुधन्वा, Sudhanvā

ఇన్ద్రియాదిమయం శార్ఙ్గం శోభనం ధనురస్య హి ।
ఇతి విష్ణుస్సుధన్వేతి ప్రోచ్యతే విదుషం వరైః ॥

ఇంద్రియములు మొదలగు తత్త్వముల రూపమేయగు శార్ఙ్గము అను ధనువు ఈతనికిగలదు గనుక ఆ విష్ణుదేవుని సుధన్వా అని విద్వాంసులు నుతింతురు.

:: పోతన భాగవతము ద్వాదశ స్కంధము ::
సీ. సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు నఖిలలోకాధారు, నాదిదేవుఁ
బరమదయార సోద్భాసితుఁ ద్రిదశాభి వందితపాదాబ్జు వనధిశయను
నాశ్రితమందారు నాద్యంతశూన్యుని వేదాంతవేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని శంఖచక్రగదాసిశార్ఙ్గధరుని
తే. శోభనాకారుఁ బీతాంబరాభిరాము, రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయపుణ్యదేహుఁ దలఁతు నుతియింతు దేవకీతనయు నెపుడు. (50)

గుణములకన్నింటికిని అతీతమైనవాడును, సర్వమూ తెలిసినవాడునూ, అన్నింటికీ ఈశ్వరుడైనవాడునూ, సర్వ లోకములకును ఆధారమైనవాడునూ, ఆదిదేవుడునూ, గొప్పదైన కరుణారసము చేత ప్రకాశించే వాడునూ, దేవతల వందనములను అందుకొనే పాదాబ్జములుగలవాడునూ, సముద్రములో శయనించేవాడునూ, ఆశ్రయించిన వారి పాలిటి కల్పవృక్షమువంటి వాడునూ, ఆదీ-అంతమూ అనేవి లేనివాడునూ, వేదాంతముచేతను తెలియదగినవాడునూ, విశ్వము అంతయును నిండియున్నవాడునూ, వక్షఃస్థలముపై కౌస్తుభమూ-శ్రీవత్సమూగలవాడునూ, శంఖమూ-చక్రమూ-గదా-శార్ఙ్గము అనే ధనుస్సూ ధరించి ఉండెడివాడునూ, మంగళకరము అయిన రూపముగలవాడునూ, పీతాంబరము ధరించి మనోహరముగా కనిపించెడివాడునూ, రత్నములచేత ప్రకాశించెడి కిరీటముతో వెలుగులు నింపెడివాడునూ, పద్మపత్రములవంటి నేత్రములు కలవాడునూ, గొప్పదైన పుణ్యవంతము అయిన శరీరముగలవాడునూ అయిన దేవకీ నందనుని స్మరించి యెల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను.



इन्द्रियादिमयं शार्ङ्गं शोभनं धनुरस्य हि ।
इति विष्णुस्सुधन्वेति प्रोच्यते विदुषं वरैः ॥

Indriyādimayaṃ śārṅgaṃ śobhanaṃ dhanurasya hi,
Iti viṣṇussudhanveti procyate viduṣaṃ varaiḥ.

Since He sports a beautiful bow by name Śārṅga, which signifies the sense organs, the learned address Him as Sudhanvā.

:: श्रीमद्भागवते द्वादशस्कन्धे एकादशोऽध्यायः ::
ओजह् सहोबलयुतं मुख्यतत्त्वं गदां दधत् ।
अपां तत्त्वं दरवरं तेजस्तत्त्वं सुदर्शनम् ॥ १४ ॥
नभोनिभं नभस्तत्त्वमसिं चर्म तमोमयम् ।
कालरुपं धनुः शार्ङ्गं तथा कर्ममयेषुधिम् ॥ १५ ॥

Śrīmad Bhāgavata - Canto 12, Chapter 11
Ojah sahobalayutaṃ mukhyatattvaṃ gadāṃ dadhat,
Apāṃ tattvaṃ daravaraṃ tejastattvaṃ sudarśanam. 14.
Nabhonibhaṃ nabhastattvamasiṃ carma tamomayam,
Kālarupaṃ dhanuḥ śārṅgaṃ tathā karmamayeṣudhim. 15.

The club the Lord carries is the chief element, prana, incorporating the potencies of sensory, mental and physical strength. His excellent conchshell is the element water, His Sudarśana disc the element fire, and His sword, pure as the sky, the element ether. His shield embodies the mode of ignorance, His bow, named Śārṅga, time, and His arrow-filled quiver the working sensory organs.

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr̥k sarvadr̥g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి