18 మే, 2014

561. వనమాలీ, वनमाली, Vanamālī

ఓం వనమాలినే నమః | ॐ वनमालिने नमः | OM Vanamāline namaḥ


వనమాలీ, वनमाली, Vanamālī

భూతతన్మాత్రరూపాం తామ్ వైజయన్త్యాహ్వయాం హరిః ।
వనమాలాం వహన్ వనమాలీతి హరిరుచ్యతే ॥

వనమాల అనగా వైజయంతీ నామక మాల ఈతనికి కలదు. పంచభూతతన్మాత్రారూపమగు వైజయంతీ మాలను వహించియుండువాడుగనుక ఆ హరి 'వనమాలీ'.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ. హార కిరీట కేయూర కంకణ ఘన భూషణుం డాశ్రిత పోషణుండు
లాలిత కాంచీకలాప శోభిత కటి మండలుం డంచిత కుండలుండు
మహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుం డానంద దాయకుండు
సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ హస్తుండు భువన ప్రశస్తుఁ డజుఁడు
తే. గమ్ర సౌరభ వనమాలికా ధరుండు, హతవిమోహుండు నవ్యపీతాంబరుండు
లలిత కాంచన నూపురాలంకృతుండు, నిరతిశయసద్గుణుఁడు దర్శనీయతముఁడు. (251)

ఆ హరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతుంటాడు. ఆయన కటిప్రదేశం అందమైన మొలనూలు చేత ప్రకాశిస్తుంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలు ధరిస్తాడు. కౌస్తుభం అనే గొప్ప మణి కాంతులతో కమనీయమైన కంఠమాలికను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖం, చక్రం, గద, పద్మం అనే నాలుగింటినీ నాలుగు చేతులతో పట్టుకొని ఉంటాడు. ఆయన లోకాలలో ప్రశస్తికెక్కినవాడు. పుట్టుక లేనివాడు. కమ్మని సువాసనగల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆ హరి అజ్ఞానాన్ని పొగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు. మేలిమి బంగారు అందియలు ఆయన కాళ్ళకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. చూడదగిన వారిలో అగ్రగణ్యుడు. భక్తజన శరణ్యుడు.



भूततन्मात्ररूपां ताम् वैजयन्त्याह्वयां हरिः ।
वनमालां वहन् वनमालीति हरिरुच्यते ॥

Bhūtatanmātrarūpāṃ tām vaijayantyāhvayāṃ hariḥ,
Vanamālāṃ vahan vanamālīti harirucyate.

Since Lord Hari wears the Vanamāla or floral wreath - called Vaijayanti made out of the tanmatrās or categories of five subtle elements, He is called Vanamālī.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे सप्तमोऽध्यायः ::
वक्षस्यधिश्रितवधूर्वनमाल्युदार हासावलोककलया रमयंश्चविश्वम् ।
पार्श्वभ्रमद्व्यजनचामरराजहंसः श्वेतातपत्रशशिनोपरि रज्यमानः ॥ २१ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 7
Vakṣasyadhiśritavadhūrvanamālyudāra hāsāvalokakalayā ramayaṃścaviśvam,
Pārśvabhramadvyajanacāmararājahaṃsaḥ śvetātapatraśaśinopari rajyamānaḥ. 21.

Lord Viṣṇu looked extraordinarily beautiful because the goddess of fortune and a garland were situated on His chest. His face was beautifully decorated with a smiling attitude which can captivate the entire world, especially the devotees. Fans of white hair appeared on both sides of the Lord like white swans and the white canopy overhead looked like the moon.

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి