ఓం మహాఽద్రిధృషే నమః | ॐ महाऽद्रिधृषे नमः | OM Mahā’dridhr̥ṣe namaḥ
మహాఽద్రిధృక్, महाऽद्रिधृक्, Mahā’dridhr̥k |
మహాంతం ఆద్రిం దృష్ణోతి అమృత మథన సమయమునను, గోరక్షణ సమయమునను మందర మరియూ గోవర్ధన మహా పర్వతములను నేర్పుతో ధరించిన కారణమున ఈతడు మహాఽద్రిధృక్ అని చెప్పబడును.
:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
మ. | గరుడారోహకుఁడై గదాదిధరుఁడై కారుణ్యసంయుక్తుఁడై |
హరికోటిప్రభతో నోహో వేఱవకుం డంచుం బ్రదీపించి త | |
ద్గిరిఁ గేలన్ నలువొందఁ గందుకము మాడ్కిం బట్టి క్రీడించుచున్ | |
గరుణాలోకసుధన్ సురాసురుల ప్రానంబుల్ సమర్థించుచున్. (188) |
ఆ స్వామి గరుడునిపై కూర్చొని దయతో నిండినవాడై, గదను ధరించి, కోటిసూర్యుల కాంతితో వారి ముందు ప్రత్యక్షమైనాడు. "ఓహో! భయపడకండి" అన్నాడు. బంతివలె ఆ కొండను నేర్పుతో చేత పట్టుకొని ఆడించినాడు. దయామృతం నిండిన చూపులతో వారిని కాపాడినాడు.
Mahāntaṃ ādriṃ dr̥ṣṇoti / महान्तं आद्रिं दृष्णोति He supported the big hills Mandara and Govardhana at the time of churning of the ocean and to protect the cows. So He is Mahā’dridhr̥k.
Śrīmad Bhāgavata - Canto 8, Chapter 6
Giriṃ cārīpya garuḍe hastenaikena līlayā,
Āruhya prayayāvabdhiṃ surāsuragaṇairvr̥taḥ. (38)
:: श्रीमद्भागवते अष्टम स्कन्धे षष्ठोऽध्यायः ::
गिरिं चारीप्य गरुडे हस्तेनैकेन लीलया ।
आरुह्य प्रययावब्धिं सुरासुरगणैर्वृतः ॥ ३८ ॥
The Lord very easily lifted the mountain with one hand and placed it on the back of Garuḍa. Then, He too got on the back of Garuḍa and went to the ocean of milk, surrounded by the gods and demons.
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः । |
अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महाद्रिधृक् ॥ १९ ॥ |
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః । |
అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ॥ ౧౯ ॥ |
Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ । |
Anirdeśyavapuśśrīmānameyātmā mahādridhr̥k ॥ 19 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి