ఓం శ్రీనివాసాయ నమః | ॐ श्रीनिवासाय नमः | OM Śrīnivāsāya namaḥ
శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ |
సవైకుంఠః శ్రీనివాస ఇతి ప్రోక్తో మహాత్మభిః ॥
వాసము అనగా వసించు స్థలము. నిత్యము వసించు చోటు నివాసము. శ్రీ అనగా లక్ష్మికి నిత్యము ఎవని వక్షము చోటగునో ఆ విష్ణువు శ్రీనివాసః అని చెప్పబడును.
:: పోతన భాగవతము - పంచమ స్కంధము, ప్రథమ ఆశ్వాసము ::
సీ. | అంత నావిష్కృత కాంత చతుర్భుజంబులును బీతాంబరంబును వెలుంగ |
శ్రీవత్సకౌస్తుభ శ్రీరమా చిహ్నంబు లురమందు రమ్యమై యిరవు పడఁగ | |
శంఖ చక్రగదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ | |
నతులిత నవ రత్నహాట కాంకిత నూత్న ఘనకిరీటద్యుతుల్ గడలుకొనఁగఁ | |
తే. | గర్ణ కుండల కటి సూత్ర కనకరత్న, హారకేయూర వర నూపురాది భూష |
ణముల భూషితుఁడైన శ్రీనాయకుండు, దంపతుల కప్పు డెదురుఁ బ్రత్యక్షమయ్యె. (43) |
ప్రకాశమానములైన చతుర్భుజాలతో, పట్టుపీతాంబరంతో, రమణీయమయిన శ్రీవత్సం కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షఃస్థలంతో, శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలయిన దివ్యాయుధాలతో; సాటిలేని నవరత్నాల కాంతుల వెదజల్లే బంగారు కిరీటంతో; మకర కుండలాలూ, మొలనూలూ, మణులు చెక్కిన స్వర్ణహారాలూ; బాహుపురులూ, కాలి అందెలూ ప్రకాశింపగా లక్ష్మీనారాయణుడు ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు.
Yasya vakṣasinityaṃ śrīrnivasatyanapāyinī,
Savaikuṃṭhaḥ śrīnivāsa iti prokto mahātmabhiḥ.
यस्य वक्षसिनित्यं श्रीर्निवसत्यनपायिनी ।
सवैकुंठः श्रीनिवास इति प्रोक्तो महात्मभिः ॥
Vāsa is place of living. Nivāsa is such a place where one dwells. Śrī the goddess Lakṣmi has made His chest her permanent abode and hence He is called Śrīnivāsaḥ.
महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः । |
अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥ |
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః । |
అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥ |
Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ । |
Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥ |
🌊 *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ - 185th Nāmaṁ* 🌊
రిప్లయితొలగించండి🪷 *Aum Śrīnivāsāya Namah* 🪷
🪷 *ఓమ్ శ్రీనివాసాయ నమః* 🪷
🪷 *Śrīnivāsaḥ - The Lord who holds the Goddess Sri Mahalakshmi in his bosom as she was born while churning the ocean, He is Sri MahaVishnu.*
*శ్రీనివాసః - సముద్రాన్ని మథనం చేసే సమయంలో పుట్టినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ఉంచుకున్న భగవంతుడు శ్రీ మహావిష్ణువు.*
*श्रीनिवासः - भगवान जो देवी श्री महालक्ष्मी को अपनी गोद में रखते हैं क्योंकि वे समुद्र मंथन के दौरान पैदा हुई थीं, वे श्री महाविष्णु हैं।* 🪷
🌅🪷🙏🪷🌄