25 మే, 2013

203. స్థిరః, स्थिरः, Sthiraḥ

ఓం స్థిరాయ నమః | ॐ स्थिराय नमः | OM Sthirāya namaḥ


సదా ఏక రూపః విష్ణువు ఎల్లపుడును ఒకే రూపముతో నుండువాడు గనుక, స్థిరుడు.

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
సీ. హరికి నర్థముఁ బ్రాణ మర్పితంబుగ నుండు వాని కైవల్య మెవ్వనికి లేదు
వనజలోచను భక్తచరుల సేవించిన వాని కైవల్య మెవ్వనికి లేదు
వైకుంఠ నిర్మల వ్రతపరుం డై నట్టి, వాని కైవల్య మెవ్వనికి లేదు
సరసిజోదరు కథా శ్రవణ లోలుండైన వాని కైవల్య మెవ్వనికి లేదు
తే. లేదు తపముల బ్రహ్మచర్యాది నిరతి, శమ దమాదుల సత్యశౌచముల దాన
ధర్మసుఖముల సుస్థిర స్థానమైన, వైష్ణవజ్ఞాన జనిత నిర్వాణపదము. (55)

ఎవరైతే శ్రీహరికి తమ అర్థమూ, ప్రాణమూ సమర్పిస్తారో, ఎవరైతే పుండరీకాక్షుని భక్తులను సేవిస్తారో, ఎవరైతే నారాయణ వ్రత పరాయణులో, ఎవరైతే మాధవ కథలను ఆసక్తితో వింటారో అటువంటివారికి లభించే మోక్షం మరెవ్వరికీ లభించదు. విష్ణుభక్తివల్ల సంప్రాప్తించే సుస్థిరమైన కైవల్యపదం తపస్సుల వల్లకానీ, బ్రహ్మచర్యాది నియమాలవల్లకానీ, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం వల్లకానీ, సత్యపరిపాలనం వల్లకానీ, శుచిత్వం వల్లకానీ, దానధర్మాలవల్లకానీ, యజ్ఞాలు చేయడం వల్లకానీ ప్రాప్తించదు.



Sadā eka rūpaḥ / सदा एक रूपः One who is always of the same nature. Being always of the same  form, He is Sthiraḥ or constant.

अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः
अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥

అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః
అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥

Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ
Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి