21 మే, 2013

199. సర్వదృక్‍, सर्वदृक्‌, Sarvadr̥k

ఓం సర్వదృశే నమః | ॐ सर्वदृशे नमः | OM Sarvadr̥śe namaḥ


సర్వదృక్‍, सर्वदृक्‌, Sarvadr̥k

ప్రాణినాం కృతాకృతం సర్వం పశ్యతి స్వాభావికేన బోధేన తన స్వభావమే యగు శుద్ధ జ్ఞానముచేతనే ప్రాణుల కృతాకృతములగు కర్మలను అనగా చేయబడినవీ, చేయబడనివీ యగు కర్మములను చూచును గావున ఈతడు సర్వదృక్‍.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ. కేశవా! సంతత క్లేశనాశనుఁడవు గురుసన్మనో వాగగోచరుఁడవు
నిద్ధమనోరథ హేతుభూతోదార గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవ స్థితి విలయార్థ ధృతనిత్య విపుల మాయాగుణ విగ్రహుఁడవు
మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుండ వతిశాంతమానసుఁడవు
తే. తవిలి సంసార హారిమేధస్కుఁడవును, దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
సర్వభూత నివాసివి సర్వసాక్షి, వైన నీకు నమస్కారమయ్య! కృష్ణ! (918)

కేశవా! నీవు దుఃఖాన్ని తొలగిస్తావు. భక్తుల మనస్సునకూ, మాటలకూ అందవు. సకల శ్రేయస్సులను కలిగించే ఉదారగుణాలు, పేర్లు కలవాడవు. సత్త్వగుణం కలవాడవు. ప్రప్రంచసృష్టి, స్థితి, విలయాల కోసం మాయామయమైన బ్రహ్మాది గుణ విగ్రహాన్ని ధరిస్తావు. నీవు సర్వేంద్రియ మార్గాలచేత తెలియబడని మార్గం కలవాడవు. ప్రశాంతమైన మనస్సు కలవాడవు. సంసారాన్ని హరించే జ్ఞానం కలవాడవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. నీవు సర్వప్రాణులలో నివసిస్తావు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! నీకు నమస్కారం.



प्राणिनां कृताकृतं सर्वं पश्यति स्वाभाविकेन बोधेन / Prāṇināṃ kr̥tākr̥taṃ sarvaṃ paśyati svābhāvikena bodhena He sees by His native intelligence what is all done and omitted to be done by creatures.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 3
Yaḥ svātmanīdaṃ nijamāyayārpitaṃ kvacidvibhātaṃ kva ca tattirohitam,
Aviddhadr̥ksākṣyubhayaṃ tadīkṣate sa ātmamūlo’vatu māṃ parātparaḥ. (4)

:: श्रीमद्भागवते - आष्टम स्कन्धे, तृतीयोऽध्यायः ::
यः स्वात्मनीदं निजमाययार्पितं क्वचिद्विभातं क्व च तत्तिरोहितम् ।
अविद्धदृक्साक्ष्युभयं तदीक्षते स आत्ममूलोऽवतु मां परात्परः ॥ ४ ॥ 

By expanding His own energy, He who keeps this cosmic manifestation visible and again sometimes renders it invisible. He is both the supreme cause and the supreme result, the observer and the witness, in all circumstances. Thus He is transcendental to everything. May He protect me.

अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।
अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥

అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।
అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥

Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।
Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి