7 మే, 2013

185. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ

ఓం అనిరుద్ధాయ నమః | ॐ अनिरुद्धाय नमः | OM Aniruddhāya namaḥ


అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ
నకేనాపి ప్రాదుర్భావేషు నిరుద్ధః తన ప్రాదుర్భావ సందర్భములందు ఎవని చేతను అడ్డగించబడువాడుకాదు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::
ఉ. తెంపరివై పొరిం బొరిని దేవకిబిడ్డలఁ జిన్నికుఱ్ఱలం
జంపితి వింకనైన నుపశాంతి వహింపక ఱాలమీఁద నొ
ప్పింపఁగ నిస్సిరో యిదియు బీరమె? నా సరసన్ జనించి నిన్‍
జంపెడు వీరుఁ డొక్క దెస్ సత్కృతి నొందెడు వాఁడు దుర్మతీ! (154)

(దేవకీ దేవి అష్టమ గర్భమునందు జన్మించినది ఆడ శిశువు అని భావించి, ఆ బిడ్డను రాతికేసి కొట్టి హతమార్చబోతున్న కంసునితో దుర్గా దేవి...) "దుర్మార్గుడా! మహాకోపంతో ఈ దేవకీదేవి బిడ్డలను ఆరుగురిని వధించావు. మహా పరాక్రమవంతుడవు! పోనీ అంతటితో శాంతించక పసిబిడ్డను రాతిమీద కొట్టి చంపడానికి పూనుకొన్నావు. ఛీ! ఛీ! ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే వీరుడొకడు నాతో పాటే జన్మించి మరో దిక్కున మహాగౌరవాలు అందుకుంటూ పెరుగుతున్నాడులే!"



Nakenāpi prādurbhāveṣu niruddhaḥ / नकेनापि प्रादुर्भावेषु निरुद्धः One who has never been obstructed by anyone or anything from manifesting in various forms.

Śrīmad Bhāgavate - Canto 10, Chapter 4
Kiṃ mayā hatayā manda jātaḥ khalu tavāntkr̥t,
Yatra kva vā pūrvaśatrurmā hiṃsīḥ kr̥paṇānvr̥thā. (12)

:: श्रीमद्भागवते दशम स्कन्धे, पूर्वार्धे, चतुर्थोऽध्यायः ::
किं मया हतया मन्द जातः खलु तवान्त्कृत् ।
यत्र क्व वा पूर्वशत्रुर्मा हिंसीः कृपणान्वृथा ॥ १२ ॥

(Goddess Durgā addressing Kaṃsā who was about to kill the girl child) O Kaṃsā, you fool, what will be the use of killing me? He who has been your enemy from the very beginning and who will certainly kill you, has already taken His birth somewhere else. Therefore, do not unnecessarily kill other children.

महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।
अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।
అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।
Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

1 కామెంట్‌:

  1. అజ్ఞాత24 ఆగ, 2023 5:19:00 PM

    🔆 *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ - 187th Nāmaṁ* 🔆

    🌟 *Aum Aniruddhāya Namah* 🌟

    🌟 *ఓమ్ అనిరుద్ధాయ నమః* 🌟

    🌟 *Aniruddhaḥ - The Lord who has achieved complete victory with His splendor which is unopposed in every incarnation, He is Sri Mahavishnu.*

    *అనిరుద్ధః - ప్రతి అవతారంలోనూ ఎదురులేని తన తేజస్సుతో సంపూర్ణ విజయం సాధించిన భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*

    *अनिरुद्धः - जिस भगवान ने हर अवतार में अपने तेज से पूर्ण विजय प्राप्त की है, वे श्री महाविष्णु हैं।* 🌟

    🌅🌟🙏🌟🌄

    రిప్లయితొలగించండి