19 మే, 2013

197. ప్రజాపతిః, प्रजापतिः, Prajāpatiḥ

ఓం ప్రజాపతయే నమః | ॐ प्रजापतये नमः | OM Prajāpataye namaḥ


ప్రజాపతిః, प्रजापतिः, Prajāpatiḥ
ప్రజానాం పతిః పితా ప్రజలకు పతి లేదా తండ్రి వంటివాడు.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ. హరియందు నాకాశ, మాకాశమున వాయు, వనిలంబువలన హుతాశనుండు,
హవ్యవాహనునందు నంబువు, లుదకంబు వలన వసుంధర గలిగె, ధాత్రి
వలన బహుప్రజావళి యుద్భవం బయ్యె, నింతకు మూలమై యొసఁగునట్టి,
నారాయణుఁడు, చిదానంద స్వరూపకుం, డవ్యయుం, డజుఁడు, ననంతుఁ, డాఢ్యుఁ
తే. డాది మధ్యాంత శూన్యుం, డనాదినిధనుఁ, డతనివలనను సంభూత మైన యట్టి
సృష్టి హేతుప్రకార మీక్షించి తెలియఁ, జాల రెంతటి మునులైన జనవరేణ్య! (277)

శ్రీహరినుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు పుట్టింది. వాయువు నుండి అగ్ని పుట్టింది. అగ్నినుండి నీరు పుట్టింది. నీటి నుండి భూమి పుట్టింది. భూమి నుండి నానావిధ జీవ సంతతి పుట్టింది. ఇంతటికీ మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుక లేనివాడు, అంతము లేనివాడు, ప్రభువు, ఆదిమధ్యాంత రహితుడు, జనన మరణాలు లేనివాడు. రాజా! ఆయన నుండి జనించిన ఈ సృష్టికి హేతువేమిటో, దాని స్వరూపమెలంటిదో ఎంత పరీక్షించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకొన లేకున్నారు.

69. ప్రజాపతిః, प्रजापतिः, Prajāpatiḥ



Prajānāṃ patiḥ pitā / प्रजानां पतिः पिता The father of all beings, who are His children.

69. ప్రజాపతిః, प्रजापतिः, Prajāpatiḥ

मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।
हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।
Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

2 కామెంట్‌లు:

  1. See.... http://ssmasramam.blogspot.in/2012/08/who-is-prajapati-view-on-rig-veda-god.html

    రిప్లయితొలగించండి
  2. ❄️ *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ* ❄️

    🏵️ *Aum Prajāpataye Namah* 🏵️

    🏵️ *ఓమ్ ప్రజాపతయే నమః* 🏵️

    🏵️ *Prajāpatiḥ - The Lord who is the Master of all living beings including Chaturmukha Brahma, He is Sri Mahavishnu.*

    *ప్రజాపతిః - చతుర్ముఖబ్రహ్మతో సహా సమస్త జీవరాశులకు అధిపతి అయిన భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*

    *प्रजापतिः - जो भगवान चतुर्मुख ब्रह्मा सहित सभी प्राणियों के स्वामी हैं, वे श्री महाविष्णु हैं।* 🏵️

    🌅🏵️🙏🏵️🌄

    రిప్లయితొలగించండి