30 మే, 2013

208. సురారిహా, सुरारिहा, Surārihā

ఓం సురారిఘ్నే నమః | ॐ सुरारिघ्ने नमः | OM Surārighne namaḥ


సురారిహా, सुरारिहा, Surārihā
సురారీన్ హంతి దేవతల శత్రువులను చంపువాడు.

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
చ. అడవుల సంకటస్థలుల నాజిముఖంబుల నగ్ని కీలలం

దెడరుల నెల్ల నాకు నుతి కెక్కఁగ దిక్కగుఁగాక శ్రీనృసిం

హుఁడు సురశత్రుయూథప వధోగ్రుఁడు విస్ఫురి తాట్టహాస వ

క్త్రుఁడు ఘన దంష్ట్ర పావక విధూత దిగంతరుఁ డప్రమేయుఁడై. (303)

దేవతా ప్రతిపక్షులైన రాక్షసులను శిక్షించినవాడూ, అత్యంత భయంకరమైన అట్టహాసంతోకూడిన ముఖం కలవాడూ, తన కోరలనుండి బయలు వెడలిన అగ్ని జ్వాలలచే చెదరగొట్టబడిన దిగంతాలు కలవాడూ, ఊహింపశక్యంకాని మహిమ కలవాడూ అయిన శ్రీనృసింహదేవుడు అడవులయందూ, ప్రమాద స్థలాలయందూ, రణ భూములయందూ, నిప్పుల మంటలయందూ అన్ని యిక్కటులయందూ నాకు దిక్కగునుగాక!




Surārīn hanti / सुरारीन् हन्ति Because He kills the enemies of suras, devas i.e., gods, He is Surārihā.

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 8
Durgeṣvaṭavyājimukhādiṣu prabhuḥ pāyānnr̥siṃho~surayūthapāriḥ,
Vimuñcato yasya mahāṭṭahāsaṃ diṣo vinedurnyapataṃśca garbhāḥ. (14)

:: श्रीमद्भागवते, षष्ठस्कन्धे अष्टमोऽध्यायः ::
दुर्गेष्वटव्याजिमुखादिषु प्रभुः पायान्नृसिंहो~सुरयूथपारिः ।
विमुञ्चतो यस्य महाट्टहासं दिषो विनेदुर्न्यपतंश्च गर्भाः ॥ १४ ॥

May Lord Nṛsiḿhadeva, who appeared as the enemy of Hiraṇyakaśipu, protect me in all directions. His loud laughing vibrated in all directions and caused the pregnant wives of the asuras to have miscarriages. May that Lord be kind enough to protect me in difficult places like the forest and battlefront.

अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः ।
अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥

అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।
అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥

Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ ।
Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి