8 మే, 2013

186. సురానందః, सुरानन्दः, Surānandaḥ

ఓం సురానందాయ నమః | ॐ सुरानन्दाय नमः | OM Surānandāya namaḥ


సురాన్ ఆనందయతి దేవతలను ఆనందపరచువాడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::
సీ. స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేఉడును గలఘోషణముల మేఘంబు లుఱిమె,
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ
గమ్మని చల్లని గాలి మెల్లన వీచె, హోమమానలంబు చెన్నొంది వెలిఁగెఁ
గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ, బ్రవిమలతోయలై పాఱె నదులు,
తే. వరపుర గ్రామఘోషయై వసుధ యొప్పె, విహగ రవ పుష్పఫలముల వెలసె వనము,
లలరుసోనలు గురిసి ర య్యమరవరులు దేవదేవుని దేవకీదేవి గనఁగ. (106)
క. పాడిరి గంధర్వోత్తము, లాడిరి రంభాదికాంత, లానందమునం
గూడిరి సిద్ధులు, భయములు, వీడిరి చారణులు, మొరసె వేల్పులు భేరుల్‍. (107)

దేవకీదేవి దేవదేవుని ప్రసవిస్తూ ఉన్న ఆ సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగినాయి. మేఘాలు ఆనందంతో ఆ విషయాన్ని చాటుతున్నట్లు గర్జించాయి. ఆకాశము గ్రహాలతోనూ, తారకలతోనూ ప్రకాశించింది. దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపొయాయి. చల్లనిగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. ఆ అర్ధరాత్రి ఋషులు ప్రత్యేకంగా చేస్తూవున్న హోమకుండాలలో అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తామరఫులతోనూ, వాటిలో ఝంకారాలు చేస్తూ తిరుగుతూ ఉన్న తుమ్మెదలతోనూ కొలనులు కళకళ లాడాయి. నదులు చాలా నిర్మలమైన నీటితో నిండుగా ప్రవహించాయి. శ్రేష్ఠమైన నగరాలతో, గ్రామాలతో, గోకులములతో, ఉత్సవాలతో భూదేవి వెలిగిపోయింది. పక్షుల కిలకిలరావాలతో, పుష్కలమైన పూలతో, పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు ఆనందం ప్రకటించాయి. దేవకీదేవి ఆ దేవదేవుడైన ఆ వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ పుష్పవర్షాలు కురిపించారు.

విశ్వావసు మొదలైన గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారు. రంభ మొదలైన అప్సరసలు నృత్యం చేశారు. సిద్ధులు అనబడే దేవతలు ఆనందంతో ఒకచోట చేరారు. చారణులు అనబడే దేవతలు భయం తీరి ఆనందించారు. దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లు భేరీలు మ్రోగించారు.



Surān ānaṃdayati / सुरान् आनंदयति He who causes joy to the Surās or gods.

Śrīmad Bhāgavate - Canto 10, Chapter 3
Mumucurmunayo devāḥ sumanāṃsi mudānvitāḥ,
Mandaṃ mandaṃ jaladharā jagarjuranusāgaram. (7)
Niśīthe tamaudbhūte jāyamāne janārdane,
Devakyāṃ devarūpiṇyāṃ viṣṇuḥ sarvaguhāśayaḥ,
Avirāsīdyathā prācyāṃ diśīnduriva puṣkalaḥ. (8)

:: श्रीमद्भागवते - दशम स्कन्धे, पूर्वार्धे, तृतीयोऽध्यायः ::
मुमुचुर्मुनयो देवाः सुमनांसि मुदान्विताः ।
मन्दं मन्दं जलधरा जगर्जुरनुसागरम् ॥ ७ ॥
निशीथे तमौद्भूते जायमाने जनार्दने ।
देवक्यां देवरूपिण्यां विष्णुः सर्वगुहाशयः ।
अविरासीद्यथा प्राच्यां दिशीन्दुरिव पुष्कलः ॥ ८ ॥

The gods and great saintly persons showered flowers in a joyous mood and clouds gathered in the sky and very mildly thundered, making sounds like those of the ocean's waves. Then Lord Viṣṇu, who is situated in the core of everyone's heart, appeared from the heart of Devakī in the dense darkness of night, like the full moon rising on the eastern horizon, because Devakī was of the same category as Śrī Kṛṣṇa.

महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।
अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।
అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।
Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

1 కామెంట్‌:

  1. అజ్ఞాత25 ఆగ, 2023 8:17:00 AM

    ❄️ *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ - 186th Nāmaṁ* ❄️

    🏵️ *Aum Surānandāya Namah* 🏵️

    🏵️ *ఓమ్ సురానందాయ నమః* 🏵️

    🏵️ *Surānandaḥ - The Lord who protects all deities in times of distress and bestows happiness to them, He is Sri Mahavishnu.*

    *సురానందః - దేవతలందరినీ ఆపదసమయాలలో ఆదుకొని ఆనందాన్ని అనుగ్రహించే భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*

    *सुरानन्दः - जो भगवान संकट के समय सभी देवताओं की रक्षा करते हैं और उन्हें प्रसन्नता प्रदान करते हैं, वे श्री महाविष्णु हैं।* 🏵️

    🌅🏵️🙏🏵️🌄

    రిప్లయితొలగించండి