22 ఏప్రి, 2014

535. త్రిదశాధ్యక్షః, त्रिदशाध्यक्षः, Tridaśādhyakṣaḥ

ఓం త్రిదశాధ్యక్షాయ నమః | ॐ त्रिदशाध्यक्षाय नमः | OM Tridaśādhyakṣāya namaḥ


త్రిదశాధ్యక్షః, त्रिदशाध्यक्षः, Tridaśādhyakṣaḥ

గుణావేశేన సఞ్జాతా అవస్థా జాగ్రదాదయః ।
త్రిసో దశాస్తదధ్యక్ష స్త్రిదశాధ్యక్ష ఉచ్యతే ॥

సత్త్వము మొదలగు ఆయాగుణముల ఆవేశముచే కలుగు జాగ్రత్, స్వప్న, సుషుప్తి దశలకు మూడిటికిని అధ్యక్షుడు అనగా వానికి పైన తానుండి వానిని సాక్షాత్తుగా అవి తానై చూచువాడు గనుక ఆ దేవ దేవునికి త్రిదశాధ్యక్షః అను నామముగలదు.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. ...జాగరణస్వప్న సుషుప్తులను వృత్తు లెవ్వనిచేత గంధాశ్రయుండయిన వాయువు నెఱింగెడు భంగి ద్రిగుణాత్మకంబులయి కర్మజన్యంబు లయిన బుద్ధిబేదంబుల నాత్మ నెరుంగందగు నని చెప్పి. (237)

...జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు! సుమాలకు ఉండే సువాసన వల్ల వాయువును తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకములూ, కర్మజన్యములూ అయిన బుద్ధిబేదాల వల్ల ఆత్మను తెలుసుకోవచ్చును.



गुणावेशेन सञ्जाता अवस्था जाग्रदादयः ।
त्रिसो दशास्तदध्यक्ष स्त्रिदशाध्यक्ष उच्यते ॥

Guṇāveśena sañjātā avasthā jāgradādayaḥ,
Triso daśāstadadhyakṣa stridaśādhyakṣa ucyate.

By the combination with guṇas i.e., Sattva, Rajas and Tamas - arise three states of the mind viz., jāgrat (awake), svapna (dream) and suṣupti (deep sleep). He being unaffected by them, presides upon these states as the witness and hence He is Tridaśādhyakṣaḥ.

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे सप्तमोऽध्यायः ::
बुद्धेर्जागरणं स्वप्नः सुषुप्तिरिति वृत्तयः ।
ता येनैवानुभूयन्ते सोऽध्यक्षः पुरुषः परः ॥ २५ ॥ 

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 7
Buddherjāgaraṇaṃ svapnaḥ suṣuptiriti vr̥ttayaḥ,
Tā yenaivānubhūyante so’dhyakṣaḥ puruṣaḥ paraḥ. 25.

The state of mind or intelligence can be perceived in three states of activity - wakefulness, dreaming and deep sleep. The entity which perceives these three is to be considered the original master, the ruler and the Supreme Lord.

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ,
Tripadastridaśādhyakṣo mahāśr̥ṃgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి