ఓం మహర్షయేకపిలాచార్యాయ నమః | ॐ महर्षयेकपिलाचार्याय नमः | OM Maharṣayekapilācāryāya namaḥ
కపిలాచార్యః, कपिलाचार्यः, Kapilācāryaḥ |
మహర్షిః కపిలాచార్యః ఇత్యేకం సవిశేషణం ।
మహాంశ్చాసావృషిశ్చేతి మహర్షిః కపలో హరిః ॥
దేవహూత్యాత్మసమ్భూతః కృత్స్నవేదస్య దర్శనాత్ ।
అన్యే తు వేదైకదేశదర్శనాదృషయః స్మృతాః ॥
శుద్దాత్మతత్త్వజ్ఞానస్య సాఙ్ఖ్యస్యాచార్య ఇత్యయమ్ ।
మహర్షిః కపిలాచార్య ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥
ఇక్కడ 'మహర్షిః' విశేషణముగా 'కపిలాచార్యః' విశేష్యముగా సవిసేషణమగు ఒకే నామముగా ఈ రెండు పదములును గ్రహించబడును. ఇతరులు వేదపు అల్పాంశమును దర్శించినవారు అగుటచే ఋషులు అనబడుదురు. వేద మంత్ర ద్రష్టకు 'ఋషి' అని వ్యవహారము. కపిలుడు సమగ్ర వేదమునే దర్శించెను. కావున మహాన్ అగు ఋషి లేదా మహర్షి అగును. దేవహూతీ కర్దమ ప్రజాపతులకు విష్ణుదేవుడే పుత్రుడుగా జన్మించెను. ఈతడు 'కపిలః' అను నామము కలవాడును, శుద్ధ తత్త్వ విజ్ఞానమగు సాంఖ్య దర్శనమునకు ఆచార్యుడును కావున 'కపిలాచార్యః' అనబడును.
:: శ్రీమద్భగవద్గీత విభూతి యోగము ::
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః ।
గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ॥ 26 ॥
నేను చెట్లన్నిటియందును రావిచెట్టును. దేవర్షులలో నారదుడను. గంధర్వులలో చిత్రరథుడను. సిద్ధులలో కపిలమునీంద్రుడను నేనే అయియున్నాను.
:: శ్వేతాశ్వతరోపనిషత్ - పఞ్చమోఽధ్యాయః ::
ఓం ద్వే అక్షరే బ్రహ్మపరే త్వనన్తే విద్యాఽవిద్యే నిహితే యత్ర గూఢే ।
క్షరం త్వవిద్యా హ్యమృతం తువ్ దియా ।
విద్యాఽవిద్యే ఈశతే యస్తుసోఽన్యః ॥ 1 ॥
యోఽయోనిం యోని మదితిష్ఠ త్యేకో విశ్వాని రూపాణి యోనిశ్చ సర్వాః ।
ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రేజ్ఞానైర్భి జాయమానం చ పశ్యేత్ ॥ 2 ॥
విద్య, అవిద్య అనునవీరెండునూ నాశరహితములు, అపరిచ్ఛిన్నములు. పరబ్రహ్మమునందు నిగూఢముగా ఉంచబడినవి. అవిద్య నశించునది, విద్య అమృతము. ఎవడు విద్యా అవిద్యలను నియమించుచున్నాడో, అతడు వాటికంటె అన్యముగానున్నవాడు. పృథివ్యాది సకల యోనులను, సకల రూపములను అయా ఉత్పత్తి స్థానములను ఎవడు అధిష్ఠించియున్నాడో, సర్వజ్ఞుడును కపిలవర్ణముగలవాడునూనగు హిరణ్యగర్భుని ఆదిలో ఎవడు సృజించెనో, సృష్టిసమయములో ఎవడు ధర్మజ్ఞాన వైరాగ్య భాగ్యములను భరించియున్నాడో, అతడే పరమాత్మ.
महर्षिः कपिलाचार्यः इत्येकं सविशेषणं ।
महांश्चासावृषिश्चेति महर्षिः कपिलो हरिः ॥
देवहूत्यात्मसम्भूतः कृत्स्नवेदस्य दर्शनात् ।
अन्ये तु वेदैकदेशदर्शनादृषयः स्मृताः ॥
शुद्दात्मतत्त्वज्ञानस्य साङ्ख्यस्याचार्य इत्ययम् ।
महर्षिः कपिलाचार्य इति सङ्कीर्त्यते बुधैः ॥
Maharṣiḥ kapilācāryaḥ ityekaṃ saviśeṣaṇaṃ,
Mahāṃścāsāvr̥ṣiśceti maharṣiḥ kapilo hariḥ.
Devahūtyātmasaṃbhūtaḥ kr̥tsnavedasya darśanāt,
Anye tu vedaikadeśadarśanādr̥ṣayaḥ smr̥tāḥ.
Śuddātmatattvajñānasya sāṃkhyasyācārya ityayam,
Maharṣiḥ kapilācārya iti saṃkīrtyate budhaiḥ.
This is one Name with an adjective; mahān r̥ṣiḥ is Mahar̥ṣiḥ i.e., He is great as he saw with intuitive vision the entire body of Vedas. Others are only ordinary r̥ṣis as they saw only a part of the knowledge of Sāṅkhya which is also Truth.
:: श्रीमद्भगवद्गीत विभूति योग ::
अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥ २६ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Aśvatthaḥ sarvavr̥kṣāṇāṃ devarṣīṇāṃ ca nāradaḥ,
Gandharvāṇāṃ citrarathaḥ siddhānāṃ kapilo muniḥ. 26.
Among all trees, I am the Aśvattha i.e., fig tree and Nārada among the divine sages. Among the Gandharvas I am Citraratha and among the perfected ones, the sage Kapila.
:: श्वेताश्वतरोपनिषत् - पञ्चमोऽध्यायः ::
ॐ द्वे अक्षरे ब्रह्मपरे त्वनन्ते विद्याऽविद्ये निहिते यत्र गूढे ।
क्षरं त्वविद्या ह्यमृतं तुव् दिया ।
विद्याऽविद्ये ईशते यस्तुसोऽन्यः ॥ १ ॥
योऽयोनिं योनि मदितिष्ठ त्येको विश्वानि रूपाणि योनिश्च सर्वाः ।
ऋषिं प्रसूतं कपिलं यस्तमग्रेज्ञानैर्भि जायमानं च पश्येत् ॥ २ ॥
Śvetāśvatara Upaniṣat - Chapter 5
Oṃ dve akṣare brahmapare tvanante vidyā’vidye nihite yatra gūḍe,
Kṣaraṃ tvavidyā hyamr̥taṃ tuv diyā,
Vidyā’vidye īśate yastuso’nyaḥ. 1.
Yo’yoniṃ yoni maditiṣṭha tyeko viśvāni rūpāṇi yoniśca sarvāḥ,
R̥ṣiṃ prasūtaṃ kapilaṃ yastamagrejñānairbhi jāyamānaṃ ca paśyet. 2.
In the Immutable, infinite Supreme Brahman remain hidden the two: knowledge and ignorance. Ignorance leads to worldliness and knowledge, to Immortality. Brahman, who controls both knowledge and ignorance, is different from both.
He, the non-dual Brahman, who rules over every position; who controls all forms and all sources; who, in the beginning, filled with knowledge the omniscient Hiranyagarbha, His own creation, whom He beheld when He (Hiranyagarbha) was produced - He is other than both knowledge and ignorance.
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः । |
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥ |
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః । |
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥ |
Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ, |
Tripadastridaśādhyakṣo mahāśr̥ṃgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి