24 ఏప్రి, 2014

537. కృతాన్తకృత్, कृतान्तकृत्, Kr̥tāntakr̥t

ఓం కృతాన్తకృతే నమః | ॐ कृतान्तकृते नमः | OM Kr̥tāntakr̥te namaḥ


కృతాన్తకృత్, कृतान्तकृत्, Kr̥tāntakr̥t

కృతస్యాన్తం కరోతీతి కృతాన్తం కృతన్తీతివా ।
కృతాన్తకృతిది ప్రోక్తో విద్వద్భిః పరమేశ్వరః ॥

తనచే నిర్మించబడిన జగత్తునకు ప్రళయకాలమున అంతము కలిగించువాడు. లేదా అంతము అనగా మృత్యువును మోక్షదాతగా రూపుమాపు పరమేశ్వరుడు కృతాన్తకృత్.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
ఉ. విశ్వభవస్థితి ప్రళయవేళలయందు వికారసత్త్వమున్‍
     విశ్వము నీవ యీ నిఖిలవిశ్వము లోలి సృజింతు విందిరా
     ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
     శాశ్వతలీల లిట్టి వని సన్నుతి సేయఁగ మాకు శక్యమే? (436)

ఓ లక్ష్మీవల్లభా! ఈ ప్రపంచం సృష్టించేదీ, రక్షించేదీ, లయం చేసేదీ నీవే! సమస్తమూ నీవై ఈ సమస్త లోకాలనూ మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నావు. ఈశ్వరా! కేశవా! వేదమయా! దివ్యస్వరూపా! దేవ దేవా! అంతులేని నీ వింత లీలలు ఇంతటివి, ఇటువంటివి అని వర్ణించడానికి మాకు చేతనవుతుందా?



कृतस्यान्तं करोतीति कृतान्तं कृतन्तीतिवा ।
कृतान्तकृतिदि प्रोक्तो विद्वद्भिः परमेश्वरः ॥

Kr̥tasyāntaṃ karotīti kr̥tāntaṃ kr̥tantītivā,
Kr̥tāntakr̥tidi prokto vidvadbhiḥ parameśvaraḥ.

During annihilation, He brings the anta or end of everything that is kr̥ta or created by Him. Or He by bestowing liberation, has the ability to release one from the cycle of death and birth.

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
यत्र निर्विष्टमरणं कृतान्तो नाभिमन्यते ।
विश्वं विध्वंसयन्वीर्य शौर्यविस्फूर्जितभ्रुवा ॥ ५६ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Yatra nirviṣṭamaraṇaṃ kr̥tānto nābhimanyate,
Viśvaṃ vidhvaṃsayanvīrya śauryavisphūrjitabhruvā. 56.

Simply by expansion of His eyebrows, invincible time personified can immediately vanquish the entire universe. However, formidable time does not approach the devotee who has taken complete shelter at Your lotus feet.

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ,
Tripadastridaśādhyakṣo mahāśr̥ṃgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి