29 ఏప్రి, 2014

542. గుహ్యః, गुह्यः, Guhyaḥ

ఓం గుహ్యాయ నమః | ॐ गुह्याय नमः | OM Guhyāya namaḥ


గుహ్యః, गुह्यः, Guhyaḥ

రహస్యోపనిషద్వేద్యో గుహాయాం పరమేశ్వరః ।
హృదయాకాశే నిహిత ఇతి వా గుహ్య ఉచ్యతే ॥

రహస్యమైన ఉపనిషద్ వచనములచే తెలియబడువాడు పరమేశ్వరుడు. లేదా హృదయాకాశము అనగా హృదయము అనబడే గుహయందు ఉండెడివాడు గనుక ఆ దేవ దేవుడు గుహ్యుడు.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ. కలలోన జీవుండు కౌతూహలంబునఁ బెక్కు దేహంబులఁ బేరు వడసి
యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెరుఁగుకరణి
నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ డఖిలజీవుల హృదయముల నుండి
బుద్ధి వృత్తుల నెల్ల బొద్ధయై వీక్షించు బద్ధుండు గాఁడు ప్రాభవము వలన
తే. సత్యుఁ డానందబాహుళ విజ్ఞానమూర్తి, యతని సేవింప నగుఁగాక, యన్యసేవఁ
గలుగనేరవు కైవల్య గౌరవములు, పాయ దెన్నఁడు సంసారబంధ మధిప! (18)

జీవుడు కలలో ఉబలాటంతో పలు శరీరాలు దాలుస్తాడు. పలుపేర్లతో వ్యవహరింప బడతాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గ్రహిస్తాడు. ఆ తరువాత తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే అంతటికీ అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు అన్ని ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధివ్యాపారాలన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాడు. తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి దేనికీ బద్ధుడు కాడు. తాను సత్యరూపుడు. ఆనందంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు. ఈ సంసార బంధము వదలదు.



रहस्योपनिषद्वेद्यो गुहायां परमेश्वरः ।
हृदयाकाशे निहित इति वा गुह्य उच्यते ॥

Rahasyopaniṣadvedyo guhāyāṃ parameśvaraḥ,
Hr̥dayākāśe nihita iti vā guhya ucyate.

One who is to be known by the Guhya or the esoteric knowledge conveyed by the Upanishads. Or since He dwells in the guha i.e., cave of the heart, He is Guhyaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे षोडशोऽध्यायः ::
त्वत्तः सनातनो धर्मो रक्ष्यते तनुभिस्तव ।
धर्मस्य परमो गुह्यो निर्विकारो भवान्मतः ॥ १८ ॥ 


Śrīmad Bhāgavata - Canto 3, Chapter 16
Tvattaḥ sanātano dharmo rakṣyate tanubhistava,
Dharmasya paramo guhyo nirvikāro bhavānmataḥ. 18.

You are the source of the eternal occupation of all living entities, and by Your multiple manifestations, You have always protected religion. You are the supreme objective of religious principles, and in our opinion You are inexhaustible and unchangeable eternally.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి