28 ఏప్రి, 2014

541. కనకాఙ్గదీ, कनकाङ्गदी, Kanakāṅgadī

ఓం కనకాఙ్గదినే నమః | ॐ कनकाङ्गदिने नमः | OM Kanakāṅgadine namaḥ


కనకాఙ్గదీ, कनकाङ्गदी, Kanakāṅgadī

కనకమయాన్యఙ్గదాన్యస్యేతి కనకాఙ్గదీ బంగారముతో చేయబడిన భుజాభరణములు ఈతనికి కలవు.

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
సీ. కుండల మణి దీప్తి గండస్థలంబులఁ బూర్ణేందురాగంబుఁ బొందుబరుప
దివ్యకిరీట ప్రదీప్తు లంబర రమా సతికిఁ గౌస్తుభవస్త్రంబు గాఁగ
వక్షస్థలంబుపై వనమాల మాలికల్ శ్రీవత్స కౌస్తుభ శ్రీల నొఱయ
నీలాద్రి బెనఁగొని నిలిచిన విద్యుల్లతలభాతిఁ గనకాంగదములు మెఱయ
ఆ. నఖిలలోక మోహనాకార యుక్తుఁడై, నారదాది మునులు చేరి పొగడఁ
గదిసి మునులు పొగడ గంధర్వ కిన్నర, సిద్ధ గానరవము సెవుల నలర. (219)

ఆయన కర్ణకుండలాల కాంతులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్రబింబాలలాగా తళతళలాడుతున్నాయి. తలమీద ధరించిన కిరీటం తన దివ్య దీప్తులతో గగనలక్ష్మికి కుంకుమరంగు చీరను అలంకరిస్తున్నది. ఆయన వక్షస్థలం మీద విరాజిల్లే వనమాలిక శోభలు శ్రీవత్సంతోనూ కౌస్తుభంతోనూ పోటీపడుతున్నాయి. బాహువులకు చుట్టుకొని ఉన్న భుజకీర్తులు నీలగిరికి చుట్టుకొన్న మెరుపు తీగలవలె మెరుస్తున్నాయి. ఆ స్వామి సౌందర్యం సమస్తలోకాలనూ మోహంలో ముంచి తేలుస్తున్నది. నారదాది మహర్షులు చుట్టూ చేరి సేవిస్తున్నారు. దేవతా బృందాలు కైవారాలు సలుపుతున్నారు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులూ వీనులవిందుగా గానం చేస్తున్నారు.



कनकमयान्यङ्गदान्यस्येति कनकाङ्गदी / Kanakamayānyaṅgadānyasyeti kanakāṅgadī  One who has armlets made of gold.

:: श्रीमद्भागवते षष्ठस्कन्धे चतुर्थोऽध्यायः ::
महाकिरीटकटकः स्फुरन्मकरकुण्डलः ।
काञ्चङ्गुलीयवलय नूपुराङ्गदभूषितः ॥ ३७ ॥

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 4
Mahākirīṭakaṭakaḥ sphuranmakarakuṇḍalaḥ,
Kāñcaṅgulīyavalaya nūpurāṅgadabhūṣitaḥ. 37.

The Lord on His head had a gorgeous round helmet, and His ears were decorated with earrings resembling sharks. All these ornaments were uncommonly beautiful. The Lord wore a golden belt on His waist, bracelets on His arms, rings on His fingers, and ankle bells on His feet.

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి