ఓం మహాశృఙ్గాయ నమః | ॐ महाशृङ्गाय नमः | OM Mahāśr̥ṅgāya namaḥ
మహాశృఙ్గః, महाशृङ्गः, Mahāśr̥ṅgaḥ |
మత్స్యరూపేణ మహతి శృఙ్గే ప్రలయవారిధౌ ।
చిక్రీడ నావం బద్ద్వేతి మహాశృఙ్గ ఇతీర్యతే ॥
పెద్దదియగు శృంగము (పెద్ద కొమ్ము) ఇతనికి క్రీడాస్థానముగానుండెను. మత్స్యరూపి యగుచు ప్రళయకాలపు మహా సముద్రమున తన మహా శృంగము నందు నావను కట్టి క్రీడించెను.
:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
వ. | కని, జలచరేంద్రుని కొమ్మున నొక్కపెనుఁ బాఁపత్రాట న న్నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నారాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడం దొడంగె. (722) |
మ. | తమలోఁ బుట్టు నవిద్య గప్పిగొనుడుం దన్మూలసంసార వి |
బ్రములై కొందరు దేలుచుం గలఁగుచున్ బల్వెంటలన్ దైవ యో | |
గమునం దే పరమేశుఁ గొల్చి ఘనులై కైవల్యసంప్రాప్తులై | |
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మ మ్మీశ్వరా! (723) |
సత్యవ్రతుడు ఒక పెద్దపామును త్రాడుగా చేసి ఆ ఓడను మహామత్స్యం కొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకొన్నాడు. ఋషులతో పాటు అతడు విష్ణువును క్రింది విధంగా పొగడసాగినాడు.
ఓ భగవంతుడా! తమలో ఆవరించిన అజ్ఞానం వల్ల కొందరు సంసారసాగరంలోపడి చిక్కుకొని మోసపోయి కలత పడతారు. కోరికలను వెన్నంటుతారు. అటువంటివారు అదృష్టంవల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోషపడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు.
मत्स्यरूपेण महति शृङ्गे प्रलयवारिधौ ।
चिक्रीड नावं बद्द्वेति महाशृङ्ग इतीर्यते ॥
Matsyarūpeṇa mahati śr̥ṅge pralayavāridhau,
Cikrīḍa nāvaṃ baddveti mahāśr̥ṅga itīryate.
The One sporting a big horn. During His Matsyāvatāra or incarnation as a great fish, He sported in the waters of great deluge binding the boat with only life to His great horn.
:: श्रीमद्भागवते अष्टमस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
सोऽनुध्यातस्ततो राज्ञा प्रादुरासीन्महार्णवे ।
एकशृङ्गधरो मत्स्यो हैमो नियुतयोजनः ॥ ४४ ॥
Śrīmad Bhāgavata - Canto 8, Chapter 24
So’nudhyātastato rājñā prādurāsīnmahārṇave,
Ekaśr̥ṅgadharo matsyo haimo niyutayojanaḥ. 44.
Then, while the King (Satyavrata) constantly meditated upon the Supreme Personality of Godhead, a large golden fish appeared in the ocean of inundation. The fish had one horn and was inconceivably long.
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः । |
त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् ॥ ५७ ॥ |
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః । |
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృఙ్గః కృతాన్తకృత్ ॥ 57 ॥ |
Maharṣiḥ kapilācāryaḥ kr̥tajño medinīpatiḥ, |
Tripadastridaśādhyakṣo mahāśr̥ṅgaḥ kr̥tāntakr̥t ॥ 57 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి