2 ఆగ, 2013

272. బృహద్రూపః, बृहद्रूपः, Br̥hadrūpaḥ

ఓం బృహద్రూపాయ నమః | ॐ बृहद्रूपाय नमः | OM Br̥hadrūpāya namaḥ


బృహద్రూపః, बृहद्रूपः, Br̥hadrūpaḥ

బృహన్మహద్వరాహాదిరూపమస్యేతి కేశవః ।
నైకేషు చావతారేషు బృహద్రూప ఇతీర్యతే ॥

బృహత్‍, మహత్‍, లేదా పెద్దదియగు వరాహాది రూపములు గల కేశవుడు, బృహద్రూపుడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
మ. సకలాభీరులు వీఁడె కృష్ణుఁ డన నైజంబైన రూపంబుతో
      నకలంకస్థితినుండి శైలిమిదె మీ రర్చింప రం' డంచుఁ దా
      నొక శైలాకృతిఁ దాల్చి గోపకులతో నొండొండ పూజించి గో
      పక దత్తాన్నము లాహరించె విభుఁ డా ప్రత్యక్షశైలాకృతిన్‍. (891)

శ్రీ కృష్ణుడు ఎప్పటి రూపుతో గొల్లల నడుమ నిశ్శంకంగా నిష్కళంకంగా ఉంటూ, వారితో "ఇదిగో! పర్వతం. దీనిని పూజించడానికి మీరంతా రండి" అని తాను తత్‍క్షణం పర్వతాకృతి ధరించాడు. ఆ గోపాలకులతోనే కలిసి గిరిరూపం దాల్చిన హరి తన్ను తానే ప్రత్యేకంగా పూజించుకుంటూ గొల్లలిడిన నైవేద్యమంతా ఆరగించాడు. 



Br̥hanmahadvarāhādirūpamasyeti keśavaḥ,
Naikeṣu cāvatāreṣu br̥hadrūpa itīryate.

बृहन्महद्वराहादिरूपमस्येति केशवः ।
नैकेषु चावतारेषु बृहद्रूप इतीर्यते ॥

Since Keśava has adopted big forms like the Varāha or Boar incarnation, He is known by the divine name Br̥hadrūpaḥ.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 24
Kr̥ṣṇastvanyatamaṃ rūpaṃ gopaviśrambhaṇaṃ gataḥ,
Śailo’smīti bruvanbhūri balimādadbr̥hadvapuḥ. (35)

:: श्रीमद्भागवते दशम स्कन्धे, पूर्वार्धे चतुर्विंऽशोध्यायः ::
कृष्णस्त्वन्यतमं रूपं गोपविश्रम्भणं गतः ।
शैलोऽस्मीति ब्रुवन्भूरि बलिमादद्बृहद्वपुः ॥ ३५ ॥

Kṛṣṇa then assumed an unprecedented, huge form to instill faith in the cowherd men. Declaring "I am Govardhana Mountain!" He ate the abundant offerings.

सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥

Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి