12 ఆగ, 2013

282. భాస్కరద్యుతిః, भास्करद्युतिः, Bhāskaradyutiḥ

ఓం భాస్కరద్యుతయే నమః | ॐ भास्करद्युतये नमः | OM Bhāskaradyutaye namaḥ


భాస్కరద్యుతిః, भास्करद्युतिः, Bhāskaradyutiḥ

భాస్కరద్యుతిసాధర్మ్యాద్భాస్కరద్యుతి రచ్యుతః ప్రకాశమును అందించుటలో భాస్కరుని ద్యుతితో అనగా సూర్యుని ప్రకాశముతో సమాన ధర్మము ఉండుటచేత అచ్యుతునకు 'భాస్కరద్యుతిః' అని వ్యవహారము తగును.

:: భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
అర్జున ఉవాచ:
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్ ।
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తా ద్దీప్తానలార్కద్యుతి మప్రమేయమ్ ॥ 17 ॥


అర్జునుడు పలికెను: మిమ్ము ఎల్లెడలను కిరీటముగలవారినిగను, గదను ధరించినవారినిగను, చక్రమును బూనినవారినిగను, కాంతిపుంజముగను, అంతటను ప్రకాశించువారినిగను, జ్వలించు అగ్ని, సూర్యులవంటి కాంతిగలవారినిగను, అపరిచ్ఛిన్నులుగను (పరిమితిలేని వారినిగను) చూచుచున్నాను.



Bhāskaradyutisādharmyādbhāskaradyuti racyutaḥ / भास्करद्युतिसाधर्म्याद्भास्करद्युति रच्युतः Since Lord Acyuta has similarity to Sun just as his rays dispel darkness, He is aptly called Bhāskaradyutiḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 11

Kirīṭinaṃ gadinaṃ cakriṇaṃ ca tejorāśiṃ sarvato dīptimantam,
Paśyāmi tvāṃ durnirīkṣyaṃ samantā ddīptānalārkadyuti maprameyam. (17)

:: श्रीमद्भगवद्गीत - विश्वरूपसंदर्शन योग ::
किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ता द्दीप्तानलार्कद्युति मप्रमेयम् ॥ १७ ॥

Arjuna said: I see You as wearing a diadem, wielding a mace and holding a disc; a mass of brilliance glowing all around; difficult to look at from all sides, possessed of the radiance of the blazing fire and sun, and immeasurable.

ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।
बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥

Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ ।
Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి