25 ఆగ, 2013

295. కామకృత, कामकृत, Kāmakr̥t

ఓం కామకృతే నమః | ॐ कामकृते नमः | OM Kāmakr̥te namaḥ


కామకృత, कामकृत, Kāmakr̥t

యః కామాన్ సాత్త్వికానాం వా కరోతీతి జనార్దనః ।
ప్రద్యుమ్నజనకత్వాద్వా కామకృత్ప్రోచ్యతే బుధైః ॥

సత్త్వగుణప్రధానులగు భక్తుల కామ ఫలములను పూర్ణములనుగా చేయును. లేదా కామం ప్రద్యుమ్నం కరోతి జనయతి కామః అనగా ప్రద్యుమ్నుడు; అతనిని జన్మింపజేసెను. కృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తరభాగము ::
ఉ. తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరు కంటిమంటలం
     దా మును దగ్ధుఁడై పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికై
     వేమఱ నిష్ఠఁ జేసి హరివీర్యమునం బ్రభవించె రుక్మిణీ
     కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్‍. (3)
వ. అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండన పేర విఖ్యాతుండయ్యె... (4)

విష్ణుదేవుని కుమారుడైన మన్మథుడు పూర్వం పరమేశ్వరుని కంటిమంటలలో కాలిబూడిద అయిపోయిన తర్వాత ఈశ్వరుణ్ణి తన దేహంకోసం ప్రార్థించి రుక్మిణీకృష్ణులకు విష్ణుమూర్తి అపరావతారమో అనేటట్లు ఉద్భవించాడు. ఆ బాలుడు ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు.



Yaḥ kāmān sāttvikānāṃ vā karotīti janārdanaḥ,
Pradyumnajanakatvādvā kāmakr̥tprocyate budhaiḥ.

यः कामान् सात्त्विकानां वा करोतीति जनार्दनः ।
प्रद्युम्नजनकत्वाद्वा कामकृत्प्रोच्यते बुधैः ॥

One who fulfills the desires of pure minded devotees. Or One who is the father of Kāma i.e., Pradyumna.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 55
Kāmastu vāsudevāṃśo dagdhaḥ prāgrudramanyunā,
Dehopapattaye bhūyastameva pratyapadyata. (1)
Sa eva jāto vaidarbhyāṃ kr̥ṣṇavīryasamudbhavaḥ,
Pradyumna iti vikhyātaḥ sarvato’navamaḥ pituḥ. (2)

:: श्रीमद्भागवते दशमस्कन्धे उत्तरार्धे पञ्चपञ्चाशत्तमोऽध्यायः ::
कामस्तु वासुदेवांशो दग्धः प्राग्रुद्रमन्युना ।
देहोपपत्तये भूयस्तमेव प्रत्यपद्यत ॥ १ ॥
स एव जातो वैदर्भ्यां कृष्णवीर्यसमुद्भवः ।
प्रद्युम्न इति विख्यातः सर्वतोऽनवमः पितुः ॥ २ ॥

Kāmadeva i.e., Cupid, an expansion of Vāsudeva, had previously been burned to ashes by Rudra's anger. Now, to obtain a new body, he merged back into the body of Lord Vāsudeva. He took birth in the womb of Vaidarbhī (Rukmiṇi) from the seed of Lord Kṛṣṇa and received the name Pradyumna. In no respect was He inferior to His father.

भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥

Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి