27 ఆగ, 2013

297. కామః, कामः, Kāmaḥ

ఓం కామాయ నమః | ॐ कामाय नमः | OM Kāmāya namaḥ


కామః, कामः, Kāmaḥ

కామః కమ్యోఽర్థకాంక్షిభిః పురుషార్థములను అభికాంక్షించువారిచే ఫలదానమునకై కోరబడెడివాడు కావున విష్ణువు కామః.

:: పోతన భాగవతము, అష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::
సీ. వరధర్మకామార్థ వర్జితకాములై విబుధులెవ్వని సేవించి యిష్ట
గతిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి కవ్యయ దేహ మిచ్చు నెవ్వాఁడు కరుణ?
ముక్తాత్ములెవ్వని మునుకొని చింతించు? రానందవార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక భద్రచరిత్రంబుఁ బాడుచుందు?
తే. రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మ, యోగగమ్యుఁ బూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమైన వానిఁ బరుని నతీంద్రియు, నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు. (83)

భగవంతుడు ధర్మంపైనా, కామంపైనా, ధనం పైనా ఆశలు విడిచిన పండితుల పూజలందుకొని వారు కోరుకున్న ఉత్తమ వరాలు అనుగ్రహిస్తాడు. దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ప్రసాదిస్తాడు. ముక్తులైన వారు ఆనంద సముద్రంలో మునిగిన మనస్సులతో ఆయనను అనునిత్యమూ ఆరాధిస్తారు. పరమార్థాన్ని చింతించేవారు ఏకాంతంగా ఆయన పవిత్రమైన చరిత్రను పాడుతుంటారు. అతడు అందరికంటే ఆద్యుడైనవాడు. కంటికి కానరానివాడు. అధ్యాత్మ యోగంవల్ల మాత్రమే చేరదగినవాడు. పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, శ్రేష్ఠమైనవాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, స్థూలస్వరూపుడు, సూక్ష్మ స్వరూపుడు, అటువంటి మహాత్ముణ్ణి నేను సేవిస్తాను.



Kāmaḥ kamyo’rthakāṃkṣibhiḥ / कामः कम्योऽर्थकांक्षिभिः Since He is sought after by those who desire to attain the four supreme values of life, He is Kāmaḥ.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 3
Yaṃ dharmakāmārthavimuktikāmā bhajanta iṣṭāṃ gatimāpnuvanti,
Kiṃ cāśiṣo rāpyapi dehamavyayaṃ karotu me’dabhradayo vimokṣaṇām. (19)

:: श्रीमद्भागवत अष्टमस्कन्धे तृतीयोऽध्यायः ::
यं धर्मकामार्थविमुक्तिकामा भजन्त इष्टां गतिमाप्नुवन्ति ।
किं चाशिषो राप्यपि देहमव्ययं करोतु मेऽदभ्रदयो विमोक्षणाम् ॥ १९ ॥


Worshiping Him, those who are interested in the four principles of religion, economic development, sense gratification and liberation - obtain from Him what they desire. What then is to be said of other benedictions? Indeed, sometimes the Lord gives a spiritual body to such ambitious worshipers. May that Supreme God, who is unlimitedly merciful, bestow upon me the benediction of liberation from this present danger and from the materialistic way of life.

भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥

Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి