3 ఆగ, 2013

273. శిపివిష్టః, शिपिविष्टः, Śipiviṣṭaḥ

ఓం శిపివిష్టాయ నమః | ॐ शिपिविष्टाय नमः | OM Śipiviṣṭāya namaḥ


శిపివిష్టః, शिपिविष्टः, Śipiviṣṭaḥ

శిపయః పశవస్తేషు విశతి ప్రతిష్ఠతి ।
యజ్ఞరూపేణేతి విష్ణు శ్శిపివిష్ట ఇతీర్యతే ॥

పశువులకు 'శిపి' అని నామము. వానియందు యజ్ఞము అను రూపముతో నారాయణుడే ప్రవేశించి యుండును అను అర్థమున 'శిపి-విష్టః' అనగా శిపులయందు ప్రవేశించియుండువాడు అను శబ్దము నిష్పన్నమగును. అనగా శ్రీ విష్ణువు తానే యజ్ఞములరూపమున యజ్ఞార్థము ఉపయోగించబడు పశువులయందు ప్రవేశించియుండి యజ్వలు ఆచరించు యజ్ఞములకు సమగ్రతను కలిగించి వానిని ఫలవంతములనుగా చేయుచు యజమానులకు ఫలదానము చేయుచున్నాడు అని భావము.

యజ్ఞో వై విష్ణుః - పశవః శిపిర్యజ్ఞ ఏవ పశుషు ప్రతితిష్ఠతి (తైత్తిరీయ సంహిత 1-7-4)
యజ్ఞమే విష్ణువు. పశువులు 'శిపి' అనబడును; యజ్ఞమే (యజ్ఞరూపుడగు విష్ణువే) పశువులయందు నిలుచుచున్నది అను శ్రుతి వచనము ఇందు ప్రమాణము.



Śipayaḥ paśavasteṣu viśati pratiṣṭhati,
Yajñarūpeṇeti viṣṇu śśipiviṣṭa itīryate.

शिपयः पशवस्तेषु विशति प्रतिष्ठति ।
यज्ञरूपेणेति विष्णु श्शिपिविष्ट इतीर्यते ॥

Śipi means Cow. In the form of Yajña, Lord Nārāyaṇa Himself resides in them. 'Śipi-viṣṭa' means contained in Śipi. Thus Lord Viṣṇu residing in Cows in the form of Yajña, leads to successful completion of the sacrificial Yajña rituals yielding the anticipated results to those performing them.

Yajño vai viṣṇuḥ - paśavaḥ śipiryajña eva paśuṣu pratitiṣṭhati (Taittirīya Saṃhita 1-7-4)

यज्ञो वै विष्णुः - पशवः शिपिर्यज्ञ एव पशुषु प्रतितिष्ठति (तैत्तिरीय संहित १-७-४)

Verily the Yajña is Viṣṇu. 'Śipi' is Cow. Yajña is established in Cows. One who has entered into them is Śipiviṣṭa. 

सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥

Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి