ఓం ఉపేంద్రాయ నమః | ॐ उपेन्द्राय नमः | OM Upendrāya namaḥ
ఉపేంద్రః, उपेन्द्रः, Upendraḥ |
య ఉపగతవానింద్రమనుజత్వేన కేశవః ।
స్వీకృతవామనరూపస్స ఉపేంద్ర ఇతీర్యతే ॥
అనుజుని అనగా తమ్ముని రూపమున ఇంద్రుని సమీపమున చేరియున్నవాడు. లేదా ప్రసిద్ధుడగు ఇంద్రుని కంటెను పై గానున్న ఇంద్రుడు.
:: హరివంశము - ద్వితీయ ఖండము, ఎకోనవింశోఽధ్యాయము ::
మమోపరి యథేంద్ర స్త్వం స్థాపితో గోభిరీశ్వరః ।
ఉపేంద్ర ఇతి కృష్ణ త్వాం గాస్యంతి భువి దేవతాః ॥ 46 ॥
నేను ఎట్లు ఇంద్రుడనో అట్లే నీవు నాకు పైగా ఇంద్రుడుగా ఈశ్వరుడుగా (స్వామిగా) గోవులచే నిలుపబడితివి. అందుచేత కృష్ణా! నిన్ను భూమియందూ, దేవతలును ఉపేంద్రుడు అని గానము చేయుదురు.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము, శ్రీ కృష్ణావతార ఘట్టము ::
క. అదితియుఁ గశ్యపుఁడును నన, విదితుల రగు మీకుఁ గురుచచేషంబున నే
నుదయించితి వామనుఁ డన్ఁ, ద్రిదశేంద్రానుజుఁడనై ద్వితీయభవనమున్.
రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు.
(శ్రీకృష్ణుడు జన్మించినపుడు దేవకీ వసుదేవుల పూర్వజన్మల వృత్తాంతాలను ఈశ్వరుడైన మహా విష్ణువు తెలియజేస్తూ దేవకీదేవి పూర్వం స్వాయంభువ మన్వంతరంలో 'పృశ్ని' అనే మహాపతివ్రతయని, వసుదేవుడు 'సుతపుడు' అనే ప్రజాపతియని తెలియజేస్తారు. వారు తీవ్రమైన తపస్సు చేసి శ్రీమహావిష్ణువు సాక్షాత్కారము పొంది, బిడ్డలు లేనందున విష్ణువుతో సమానమైన పుత్రుడిని అర్థిస్తారు. వారి మొరాలకించి తన సాటివాడు మరొకడు లేనందున, తానే ఆ మన్వంతరములో "పృశ్నిగర్భుడుగా", వారి రెండవ జన్మలైన అదితీ కశ్యపులకు వామనుడిగా, మూడవజన్మలో దేవకీ వసుదేవులకు కృష్ణుడిగా జన్మించిన వృత్తాంతం తెలియజేస్తారు.)
Ya upagatavānindramanujatvena keśavaḥ,
Svīkr̥tavāmanarūpassa upendra itīryate.
य उपगतवानिन्द्रमनुजत्वेन केशवः ।
स्वीकृतवामनरूपस्स उपेन्द्र इतीर्यते ॥
One born as the younger brother of Indra. Or One who is greater than Indra.
Harivaṃśa - Part 2, Chapter 19
Mamopari yathendra stvaṃ sthāpito gobhirīśvaraḥ,
Upendra iti Kr̥ṣṇa tvāṃ gāsyanti bhuvi devatāḥ. (46)
:: हरिवंशे द्वितीय खंडे एकोनविंशोऽध्यायः ::
ममोपरि यथेन्द्र स्त्वं स्थापितो गोभिरीश्वरः ।
उपेन्द्र इति कृष्ण त्वां गास्यन्ति भुवि देवताः ॥ ४६ ॥
The cows have established You superior to me as my master. Therefore, O Kr̥ṣṇa - the dwellers of Earth and the Devās will sing about You, addressing You as Upendra.
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Tayorvāṃ punarevāhamadityāmāsa kaśyapāt,
Upendra iti vikhyāto vāmanatvācca vāmanaḥ. (42)
:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे तृतीयोऽध्यायः ::
तयोर्वां पुनरेवाहमदित्यामास कश्यपात् ।
उपेन्द्र इति विख्यातो वामनत्वाच्च वामनः ॥ ४२ ॥
In the next millennium, I again appeared from the two of you, who appeared as My mother, Aditi, and My father, Kaśyapa. I was known as Upendra, and because of being a dwarf, I was also known as Vāmana.
(Lord Viṣṇu explains the previous births of Devaki and Vasudeva who begot him as their Son for the third time. During Svāyambhuva millennium, they as Pr̥śni and Sutapa, underwent severe austerities with the desire for progeny. When Lord Viṣṇu appeared before them and offered benediction, they expressed the desire to have a son exactly like Him. Since there is none comparable to Him, He Himself appeared as Pr̥śnigarbha through them. He again appeared from the two of them, who took birth as Aditi and Kaśyapa as Upendra or Vamana. The third incarnation was, of course, Śrī Kr̥ṣṇa through Devaki and Vasudeva.)
उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः । |
अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥ |
ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః । |
అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥ |
Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ । |
Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి