29 ఏప్రి, 2013

177. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ

ఓం అనిర్దేశ్యవపుషే నమః | ॐ अनिर्देश्यवपुषे नमः | OM Anirdeśyavapuṣe namaḥ


అనిర్దేశ్యం ఇదం తత్ ఇతి పరస్మై నిర్దేష్టుం అశక్యం స్వసంవేద్యత్వాత్ వపుః అస్య పరమాత్ముని శరీరము లేదా స్వరూపము సాధకునకు తనచే మాత్రమే తెలియ దగినది లేదా అనుభవగోచరము కాదగినది యగుటచేత ఇతరులకు ఆతని స్వరూపము ఇది, అది, అట్టిది అని నిర్దేశించబడుటకు శక్యముకాని స్వరూపము ఇతనికి కలదు.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. ఇట్లు సర్వాత్మకంబై యిట్టి దట్టి దని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణునియందుఁ జిత్తంబుఁ జేర్చి తన్మయుండయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుడు దన కింకరుల చేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబులైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి. (196)

ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సు మహావిష్ణునియందు నిల్పి తనను తానే మరిచిపోయాడు. దివ్యమైన ఆనందంతో పరవశించి పోయాడు. పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలం అవుతాయో అదే విధంగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ విఫలమై పోయాయి.



Anirdeśyaṃ idaṃ tat iti parasmai nirdeṣṭuṃ aśakyaṃ svasaṃvedyatvāt vapuḥ asya / अनिर्देश्यं इदं तत् इति परस्मै निर्देष्टुं अशक्यं स्वसंवेद्यत्वात् वपुः अस्य As He cannot be indicated to others by saying "This is His form." Because He is to be known by oneself. He has a body or nature which cannot be so indicated in a generic form. So He is Anirdeśyavapuḥ.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6
Pratyagātmasvarūpeṇa dr̥śyarūpeṇa ca svayam,
Vyāpyavyāpakanirdeśyo hyanirdeśyo’vikalpitaḥ. (22)

:: श्रीमद्भागवते - सप्तमस्कन्धे, षष्टोऽध्यायः ::
प्रत्यगात्मस्वरूपेण दृश्यरूपेण च स्वयम् ।
व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥

He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.

महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः ।
अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।
అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥

Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ ।
Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి