23 ఏప్రి, 2013

171. మహోత్సాహః, महोत्साहः, Mahotsāhaḥ

ఓం మహోత్సాహాయ నమః | ॐ महोत्साहाय नमः | OM Mahotsāhāya namaḥ


మహోత్సాహః, महोत्साहः, Mahotsāhaḥ
మహాన్ ఉత్సాహః (ఉద్యోగః) అస్య గొప్పది యగు పూనిక ఇతనికి కలదు. జగదుత్పత్తి, స్థితిలయముల నిర్వహించ సమర్థమగు గొప్ప పూనిక కలవాడు.

:: పోతన భాగవతము - ప్రథమ స్కంధము ::
మ. తనకున్ భృత్యుఁడు వీనిఁగాచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్‍
మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్‍
జనులన్ మోహము నొందఁ జేయుఁ పరమోత్సాహుం బ్రశంసించెదన్‍.

"ఇతడు నా నమ్మినబంటు, ఇతణ్ణి కాపాడటం నా కర్తవ్యం సుమా!" అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుండి ఒక చేతిలో ఒయ్యారంగా పగ్గాలు పట్టుకొని, మరొక చేతిలో కొరడా ధరించి, పరమోత్సాహంగా అశ్వాలను అదలిస్తూ చూచేవాళ్ళను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను.



Mahān utsāhaḥ (udyogaḥ) asya / महान् उत्साहः (उद्योगः) अस्य He who takes great delight in the creation, preservation and subsumption of the universe.


वेद्यो वैध्यस्सदा योगी वीरहा माधवो मधुः ।
अतीन्द्रियो महामायो महोत्साहोमहाबलः ॥ १८ ॥

వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః ॥ ౧౮ ॥

Vedyo vaidhyassadā yogī vīrahā mādhavo madhuḥ ।
Atīndriyo mahāmāyo mahotsāhomahābalaḥ ॥ 18 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి