5 ఏప్రి, 2013

153. ప్రాంశుః, प्रांशुः, Prāṃśuḥ

ఓం ప్రాంశవే నమః | ॐ प्रांशवे नमः | OM Prāṃśave namaḥ


ప్రాంశుః, प्रांशुः, Prāṃśuḥ
ప్రాంశు అనగా ఉన్నతమైన లేదా పొడువైన అని అర్థము. స ఏవ జగత్త్రయం క్రమమాణః ప్రాంశు రభూత్ ఇతి ఆ వామనుడే జగత్త్రయమును తన అడుగులతో వ్యాపించుచు ప్రాంశువు అయ్యెను.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
శా. ఇంతింతై, వటుఁడింతయై, మఱియుఁ దా నింతై, నభోవీథిపై
నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువుని పైనంతై, మహర్వాటి పై
నంతై, సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై
మ. రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్‍.

దానాన్ని తీసుకొన్న వామనుడు కొద్ది కొద్దిగా ఎదిగినాడు. ఇంతవాడు అంతవాడైనాడు. అంతవాడు మరింతవాడైనాడు. క్రమక్రమంగా పెరిగిపోతున్నాడు. వరుసగా ఆకాశం కంటె మేఘమండలం కంటె, వెలుగుల రాశికంటె పైకి పెరిగాడు. చంద్రుని వరకూ, ధ్రువతారవరకూ, మహార్లోకం వరకూ, ఆ పైన సత్యలోకం వరకూ పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయినాడు.

వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో సూర్యబింబం క్రమక్రమంగా అతనికి గొడుగుగా, తరువాత శిరోమణిగా (శిరస్సున ధరించే ఆభరణం), తరువాత మకర కుండలంగా (చెవి ఆభరణం), తరువాత కంఠాభరణంగా, ఆ తరువాత బంగారు భుజకీర్తిగా (భుజాన ధరించు ఆభరణం), అటు తరువాత కాంతులీనే కంకణంగా (చేతికి ధరించే ఆభరణం), అనంతరం మొలలోని గంటగా, ఆ పైన మేలైన కాలి అందెగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది. (వామనుడు ఎంతగా పెరిగిపోయాడో సూర్య బింబ సంబంధముతో తెలుపటం జరిగింది).

:: హరివంశము - తృతీయ ఖండము, ఏకసప్తతోఽధ్యాయము ::
తోయే తు పతితే హస్తే వామనోఽభూద వామనః ।
సర్వదేవమయం రూపం దర్శయామాస వై ప్రభుః ।
భూః పాదౌ ద్యౌః శిరశ్చాస్య చంద్రాదిత్యౌ చ చక్షుషీః ॥ 43, 44 ॥

'జలము హస్తమునందు పడగానే వామనుడు అవామనుడు (పొడగరి) అయ్యెను. అంతటి ఆ ప్రభువు సర్వదేవమయమమగు రూపమును చూపెను. అట్టి ఈతని పాదములుగా భూమియు, శిరముగా ద్యులోకమును, నేత్రములుగా చంద్రసూర్యులును అయ్యెను.'

ఈ మొదలుగా విశ్వరూపమును చూపి ఆతడు భూర్భువర్సువర్లోకములను ఆక్రమించుచు పెరిగిపోవు క్రమములో భూమిని దాటి విక్రమించుచు అతని వక్షస్థలమున చంద్రసూర్యులుండిరి. అంతరిక్షలోకమును దాటి ముందునకు ప్రక్రమించుచుండగా ఆతని నాభియందు ఆ చంద్రసూర్యులు నిలిచి ఉండిరి. ద్యులోకమును కూడా దాటుచు ఆక్రమించుచు పోవుచున్న ఆతనికి మోకాళ్ళదిగువను ఆ రవిచంద్రులు వచ్చిరి.



One of great height. Sa eva jagattrayaṃ kramamāṇaḥ prāṃśu rabhūt iti / स एव जगत्त्रयं क्रममाणः प्रांशु रभूत् इति Appearing as a dwarf at first before Mahābali, He rose to heights transcending all the worlds.

Harivaṃśa - Canto 3, Chapter 71
Toye tu patite haste vāmano’bhūda vāmanaḥ,
Sarvadevamayaṃ rūpaṃ darśayāmāsa vai prabhuḥ,
Bhūḥ pādau dyauḥ śiraścāsya caṃdrādityau ca cakṣuṣīḥ. (43, 44)

:: हरिवंश - तृतीय खंडे एकसप्ततोऽध्यायः ::
तोये तु पतिते हस्ते वामनोऽभूद वामनः ।
सर्वदेवमयं रूपं दर्शयामास वै प्रभुः ।
भूः पादौ द्यौः शिरश्चास्य चंद्रादित्यौ च चक्षुषीः ॥ ४३, ४४ ॥

Immediately after Bali poured water in his hands with the resolve to give the gift asked for, Vāmana the dwarf became Avāmana - the opposite of a dwarf. The Lord then revealed His form which includes in it all divinities. He revealed His cosmic form, having the earth as His feet, the sky His head and the sun and moon His eyes.

उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।
अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।
అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥

Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।
Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి