ఓం శ్రీమతే నమః | ॐ श्रीमते नमः | OM Śrīmate namaḥ
శ్రీమాన్యస్య సమగ్రా శ్రీః హరేరైశ్వర్యలక్షణా శ్రీ అనగా ఐశ్వర్యము. ఐశ్వర్యము అను శ్రీ గల విష్ణువు శ్రీమాన్ అని చెప్పబడును.ఈశ్వరత్వము అనగా సృష్టిస్థితిలయ సామర్థ్యము అను సమగ్రమగు శ్రీ ఎవనికి కలదో అట్టివాడు.
:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ. | పరమాత్మ! మర్త్య సుపర్వ తిర్యఙ్మృగ దితిజ సరీసృప ద్విజగణాది |
సంవ్యాప్తమును సదసద్విశేషంబును గైకొని మహదాది కారణంబు | |
నైన విరాడ్విగ్రహంబు నే నెఱుంగుఁదుఁ గాని తక్కిన సుమంగళము నైన | |
సంతత సుమహితైశ్వర్య రూపంబును భూరిశబ్దాది వ్యాపార శూన్య | |
తే. | మైన బ్రహ్మస్వరూప మే నాత్మ నెఱుఁగఁ, బ్రవిమలాకార! సంసార భయవిదూర! |
పరమ మునిగేయ! సంతత భాగధేయ!, నలిన నేత్రా! రమా లలనా కళత్ర! (286) |
పరమాత్మా! మానవులూ, దేవతలూ, మృగాలూ, రాక్షసులూ, పాములూ, పక్షులూ మొదలయిన పలు విధాల ప్రాణులతో నిండి ప్రకృతి పురుషులతో కూడి మహదాదులకు కారణమైన నీ స్థూల రూపాన్ని నేను ఎరుగుదును. కానీ, నిత్యకల్యాణమూ, నిరంతర మహైశ్వర్య సంపన్నమూ అయి, శబ్ద వ్యాపారానికి గోచరం కాని నీ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రం నేను ఎరుగను. రాజీవనేత్రా! రమాకళత్రా! నీవు నిర్మలాకారుడవు. భవభయదూరుడవు. మునిజన సంస్తనీయుడవు. పరమ భాగ్యధౌరేయుడవు.
22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
Śrīmānyasya samagrā śrīḥ hareraiśvaryalakṣaṇā / श्रीमान्यस्य समग्रा श्रीः हरेरैश्वर्यलक्षणा One endowed with all characteristics of Śrī which connotes Aiśvarya or opulence of every kind including the ability to create, sustain and annihilate is Śrīmān.
Śrīmad Bhāgavata - Canto 5, Chapter 20
Teṣāṃ svavibhūtīnāṃ lokapālānāṃ ca vividhavīryopabr̥ṃhaṇāya bhagavānparamamahāpuruṣo mahāvibhūtipatirantaryāmyātmano viśuddhasattvaṃ dharmajñānavairāgyaiśvaryādyaṣṭamahāsiddhyupalakṣaṇaṃ viṣvaksenādibhiḥ svapārṣadapravaraiḥ parivārito nijavarāyudhopaśobhitairnijabhujadarāṃṅaiḥ sandhārayamāṇastasmingirivare samantātsakalalokasvastaya āste. (40)
:: श्रीमद्भागवते पञ्चम स्कन्धे विंशोऽध्यायः ::
तेषां स्वविभूतीनां लोकपालानां च विविधवीर्योपबृंहणाय भगवान्परममहापुरुषो महाविभूतिपतिरन्तर्याम्यात्मनो विशुद्धसत्त्वं धर्मज्ञानवैराग्यैश्वर्याद्यष्टमहासिद्ध्युपलक्षणं विष्वक्सेनादिभिः स्वपार्षदप्रवरैः परिवारितो निजवरायुधोपशोभितैर्निजभुजदरांङैः सन्धारयमाणस्तस्मिन्गिरिवरे समन्तात्सकललोकस्वस्तय आस्ते ॥ ४० ॥
He is the master of all transcendental opulences and the master of the spiritual sky. He is the Supreme Person, Bhagavān, the Supersoul of everyone. The gods, led by Indra, the King of heaven, are entrusted with seeing to the affairs of the material world. To benefit all living beings in all the varied planets and to increase the power of those elephants and of the gods, the Lord manifests Himself on top of that mountain in a spiritual body, uncontaminated by the modes of material nature. Surrounded by His personal expansions and assistants like Viṣvaksena, He exhibits all His perfect opulences, such as religion and knowledge, and His mystic powers such as aṇimā, laghimā and mahimā. He is beautifully situated, and He is decorated by the different weapons in His four hands.
22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः । |
अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥ |
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః । |
అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥ |
Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ । |
Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి