28 ఏప్రి, 2013

176. మహాద్యుతిః, महाद्युतिः, Mahādyutiḥ

ఓం మహాద్యుతయే నమః | ॐ महाद्युतये नमः | OM Mahādyutaye namaḥ


మహాద్యుతిః, महाद्युतिः, Mahādyutiḥ
మహతీ ద్యుతిః బాహ్యా అభ్యంతరా చ అస్య బాహ్యము అనగా వెలుపలగా కనబడునదీ, అభ్యంతరా అనగా లోపలగా జ్ఞాన రూపమగునదీ అగు గొప్ప ద్యుతి లేదా కాంతి లేదా తేజము ఇతనికి కలదు.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
మ. ఒక వేయర్కులు గూడిగట్టి కరువై యుద్యత్ప్రభాభూతితో
నొకరూపై చనుదెంచు మాడ్కి హరి దా నొప్పారె; నా వేలుపుల్‍
వికలాలోకనులై, విషణ్ణమతులై; విభ్రాంతులై మ్రోలఁ గా
నక శంకించిరి కొంత ప్రొద్దు; విభుఁ గానం బోలునే వారికిన్‍? (159)

మహావిష్ణువు వేయ్యిసూర్యుల తేజస్సు ఒకటిగా పోతపోసిన కాంతివైభవంతో ప్రకాశించినాడు. దేవతల చూపులు చెదిరిపోయినాయి. ధ్యానిస్తూ వారు స్వామిని చూడగానే కొంతసేపు భయపడినారు. ప్రభువును చూడటం వారికి సాధ్యం కాదు కదా!



Mahatī dyutiḥ bāhyā abhyaṃtarā ca asya / महती द्युतिः बाह्या अभ्यंतरा च अस्य One who is intensely brilliant both within and without. Here brilliance also indicates blissful knowledge.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 6
Evaṃ stutaḥ suragaṇairbhagavānharirīśvaraḥ,
Teṣāmāvirabūdrājansahastrārkodayadyutiḥ. (1)

:: श्रीमद्भागवते अष्टम स्कन्धे प्रथमोऽध्यायः ::
एवं स्तुतः सुरगणैर्भगवान्हरिरीश्वरः ।
तेषामाविरबूद्राजन्सहस्त्रार्कोदयद्युतिः ॥ १ ॥

Lord Hari, being thus worshiped with prayers by the gods and Lord Brahmā, appeared before them. His bodily effulgence resembled the simultaneous rising of thousands of suns.

महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः
अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః
అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥

Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ
Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి