8 ఏప్రి, 2013

156. ఊర్జితః, ऊर्जितः, Ūrjitaḥ

ఓం ఊర్జితాయ నమః | ॐ ऊर्जिताय नमः | OM Ūrjitāya namaḥ


ఊర్జితః, ऊर्जितः, Ūrjitaḥ
బల ప్రకర్షశాలీ ఇత్యర్థః బలమునకు సంబంధించిన ఆధిక్యము లేదా వేరెవ్వరి బలముకంటెను అత్యధికమగు బలముతో ఒప్పారువాడు.

 :: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::
క. ముద్దుల తక్కరి బిడ్డఁడు, ముద్దులఁ గూల్పంగఁ దలఁచి మసలక తా నా

మద్దికవ యున్న చోటికి, గ్రద్దన ఱో లీడ్చుకొనుచుఁ గడఁకం జనియెన్‍.
వ. చని యా యూర్జిత మహాబలుండు నిజోదరదామ సమాకృష్యమాణ తిర్యగ్భవదులూఖలుండై యా రెండు మ్రాఁకుల నడుమం జొచ్చి ముందటికి నిగుడుచు
క. బాలుఁడు ఱో లడ్డము దివ, మూలంబులు వెకలి విటపములు విఱిగి మహా

భీలధ్వనిఁ గూలెను శా, పాలస్యవివర్జనములు యమళార్జునముల్‍.

టక్కులమారి ముద్దుకృష్ణుడు ఆ మద్ది చెట్లను కూల్చి వేయాలని సంకల్పించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కొంటెకన్నయ్య జంట మద్దిచేట్లు ఉన్న చోటికి అమాంతంగా రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళాడు.

ఆ బాలకృష్ణుడు స్థిరమైన మహాబలం కలవాడు. అతని పొట్టకు కట్టబడిన త్రాటి ఊపుకు రోలు అడ్డం తిరిగిపోయింది. అతడు చెరచెరా రెండు మద్ది చెట్ల మధ్య నుంచి రోటిని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.

బాలుడు రోలు అడ్డం త్రిప్పి లాగగానే, ఆ మద్దిచెట్లు రెండూ వేళ్ళతో సహా పెకిలించుకొనిపోయి, కొమ్మలు విరిగిపోతూ మహా భయంకరమైన ధ్వనితో నేలకూలిపోయినాయి. చాలాకాలం తరువాత యమళార్జునుల శాపాలు తొలగిపోయాయి.



Bala prakarṣaśālī ityarthaḥ / बल प्रकर्षशाली इत्यर्थः One of infinite strength. Or One whose strength is superior to any other.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 10
Bālena niṣkarṣayatānvagulūkhalaṃ tad
    Dāmodareṇa tarasotkalitāṅghribandhau,
Niṣpetatuḥ paramavikramitātivepa
    Skandhapravālaviṭapau kr̥tacaṇḍaśabdau. (27)

:: श्रीमद्भागवते, दशमस्कन्धे, दशमोऽध्यायः ::
बालेन निष्कर्षयतान्वगुलूखलं तद्‌
    दामोदरेण तरसोत्कलिताङ्घ्रिबन्धौ ।
निष्पेततुः परमविक्रमितातिवेप
    स्कन्धप्रवालविटपौ कृतचण्डशब्दौ ॥ २७ ॥

By dragging behind Him with great force the wooden mortar tied to His belly, the boy Kṛṣṇa uprooted the two trees. By His great strength, the two trees, with their trunks, leaves and branches, trembled severely and fell to the ground with a great crash.

उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः
अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః
అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥

Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ
Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥

2 కామెంట్‌లు:

  1. హర్షిత్ ఏ దేవుని పేరు....దాని అర్దాన్ని వివరించగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'విష్వక్సేనుడు' విష్ణు దేవుని సేనాధిపతి. 'విష్వక్సేనుడు' అనేది విష్ణు నామాలలో ఒకటి. 'విష్వక్సేనుడు' అని శివ సహస్రనామాలలో కూడా ఉన్నది. దీనిని బట్టి 'విష్వక్సేనుడు' అంటే ఏ దేవుడో చెప్పగలమా?

      హర్షిత్ అంటే సంతోషం అన్నట్టుగా రమారమిగా చెప్పుకోవచ్చును. ఆ లెక్కన భక్తుని భక్తికి సంతోషించిన ఏ దేవుడినైనా అనుకోండి. నిజానికి దేవుడికి ఒక పేరంటూ ఉంటుందా?

      తొలగించండి