7 ఏప్రి, 2013

155. శుచిః, शुचिः, Śuciḥ

ఓం శుచయే నమః | ॐ शुचये नमः | OM Śucaye namaḥ


స్తువతామర్చయతాం చ స్మరతాం పావనత్వతః ।
తథాఽస్య స్పర్శ ఇత్యాదిమంత్రవర్ణాచ్ఛుచిర్హరిః ॥ 

పవిత్రుడు. పవిత్రతను కలిగించువాడు. స్తుతించువారినీ, అర్చించిన వారినీ, స్మరించు వారినీ హరి పవిత్రులనుగా చేయును. అదిగాక ఆయన స్పర్శమును పవిత్రము కావున విష్ణువు శుచిః అని చెప్పబడును.

:: శ్రీమద్భాగవతము - నవమస్కన్ధము, దశమోఽధ్యాయము ::
ఏకపత్నీవ్రతధరో రాజర్షిచరితః శుచిః ।
స్వధర్మం గృహమేధీయం శిక్షయాన్స్వయమాచరత్ ॥ 55 ॥


ఏకపత్నీవ్రతమును పాటించినవాడూ, రాజర్షి వంటి చరితము గలవాడూ, పవిత్రుడూ అయిన శ్రీరామచంద్రుడు గృహస్తులకు స్వధర్మమును తన స్వీయ ఆచరణద్వారా నేర్పినాడు.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::
సీ. భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నాహ్వయమును గుణమును లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై నిజమాయ నెవ్వఁ డిన్నియును దాల్చు
నా పరమేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్దరూపికి రూపహీనునకు
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకు
ఆ. మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ, గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు.

భగవంతునికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపజేయడం కోసము తన మాయాప్రభావముతో ఇవన్నీ ధరిస్తాడు. రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు. ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకు మూలం; అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ ఊహలకూ అందరానివాడు; పరిశుద్ధుడు. సత్త్వగుణంతో దరిజేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను.



Stuvatāmarcayatāṃ ca smaratāṃ pāvanatvataḥ,
Tathā’sya sparśa ityādimaṃtravarṇācchucirhariḥ.

स्तुवतामर्चयतां च स्मरतां पावनत्वतः ।
तथाऽस्य स्पर्श इत्यादिमंत्रवर्णाच्छुचिर्हरिः ॥

One who purifies those who think of, praise and worship Him. His very contact is purifying.

Śrīmad Bhāgavata - Canto 9, Chapter 10
Ekapatnīvratadharo rājarṣicaritaḥ śuciḥ,
Svadharmaṃ gr̥hamedhīyaṃ śikṣayānsvayamācarat. (55)

Lord Rāmacandra who practiced monogamy, conducted His life as a Rājarṣi i.e., a Saintly King, pure - untinged by qualities like anger; taught good behavior for everyone, especially the householders by setting an example of Himself and His personal activities.

उपेन्द्रो वामनः प्रांशुरमोघश्शुचिरूर्जितः ।
अतीन्द्रस्संग्रहस्सर्गो धृतात्मा नियमो यमः ॥ १७ ॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘశ్శుచిరూర్జితః ।
అతీన్ద్రస్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭ ॥

Upendro vāmanaḥ prāṃśuramoghaśśucirūrjitaḥ ।
Atīndrassaṃgrahassargo dhr̥tātmā niyamo yamaḥ ॥ 17 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి