ఓం మహాశక్తయే నమః | ॐ महाशक्तये नमः | OM Mahāśaktaye namaḥ
మహతీ శక్తిః సామర్థ్యం అస్య గొప్పదియగు శక్తి సామర్థ్యము ఇతనికి కలదు.
:: పోతన భాగవతము - అష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::
సీ. | భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేక |
జగములఁ గలిగించు సమయించు కొఱకునై నిజమాయ నెవ్వఁ డిన్నియును దాల్చు | |
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్దరూపికి రూపహీనునకును | |
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకు | |
ఆ. | మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ, గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచు |
నిపుణుఁడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు. (78) |
ఎవ్వనికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవో - లోకాలను పుట్టించి నశింపజేయడం కోసం తన మాయాప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడో, రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడో, అన్నింటిణీ చూస్తూ ఉంటాడో, ఆత్మ కాంతిలో వెలుగుతూ ఉంటాడో, అతడే ఆత్మకు మూలం; అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ, ఊహలకూ అందరానివాడు. పరిశుద్ధుడు. సత్త్వగుణంతో దరిజేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కరిస్తాను.
Mahatī śaktiḥ sāmarthyaṃ asya / महती शक्तिः सामर्थ्यं अस्य He has immense śakti or power and capacity; so He is Mahāśaktiḥ.
Śrīmad Bhāgavata - Canto 8, Chapter 3
Na vidyate yasya ca janma karma vā na nāmarūpe guṇadoṣa eva vā,
Tathāpi lokāpyayasambhavāya yaḥ svamāyayā tānyanukālamr̥cchati. (8)
Tasmai namaḥ pareśāya brahmaṇo’nantaśaktaye,
Arūpāyorurūpāya nama aścaryakarmaṇo. (9)
:: श्रीमद्भागवते अष्टमस्कन्धे, तृतीयोऽध्यायः ::
न विद्यते यस्य च जन्म कर्म वा न नामरूपे गुणदोष एव वा ।
तथापि लोकाप्ययसम्भवाय यः स्वमायया तान्यनुकालमृच्छति ॥ ८ ॥
तस्मै नमः परेशाय ब्रह्मणोऽनन्तशक्तये ।
अरूपायोरुरूपाय नम अश्चर्यकर्मणो ॥ ९ ॥
He who has no material birth, activities, name, form, qualities or faults; to fulfill the purpose for which this material world is created and destroyed, He comes in a form by His original internal potency and He who has unlimited powers in various forms - all free from material contamination, acting wonderfully - to Him I offer my respects to.
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः । |
अनिर्देश्यवपुश्श्रीमानमेयात्मा महा द्रिधृक् ॥ १९ ॥ |
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః । |
అనిర్దేశ్యవపుశ్శ్రీమానమేయాత్మా మహా ద్రిధృక్ ॥ ౧౯ ॥ |
Mahābuddhirmahāvīryo mahāśaktirmahādyutiḥ । |
Anirdeśyavapuśśrīmānameyātmā mahā dridhr̥k ॥ 19 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి